సంపూ వన్ మాన్ షో ... కొబ్బరిమట్ట రివ్యూ

సంపూ వన్ మాన్ షో ... కొబ్బరిమట్ట రివ్యూ
x
Highlights

సినిమా మొత్తాన్ని సంపూ తన భుజాల పైన వేసుకొని నడిపించాడు . పెదరాయుడు , ఆండ్రాయిడ్ ,పాపారాయుడు అనే మూడు పాత్రల్లో సంపూ నటన అద్భుతమనే చెప్పాలి . ఫ్రేమ్ ఫ్రేమ్ లో అతడి డైలాగ్ డెలివరీకి వావ్ అనకుండా ఉండలేం .

హృదయకాలేయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు సంపూ .. అ తర్వాత రెండు మూడు సినిమాలు చేసిన పెద్దగ ఆడలేదు. దీనితో హృదయకాలేయం టీం మళ్ళీ కొబ్బరిమట్ట సినిమాతో ప్రేక్షకుల ముదుకు వచ్చింది . నిజానికి సినిమా ఎప్పుడో మొదలయింది కానీ కొన్ని కారణాల వల్ల సినిమా విడుదలకి నోచుకోలేదు .ఎన్నో అడ్డంకుల మధ్య ఈ శనివారం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది . మరి కొబ్బరిమట్ట ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో మన సమీక్షలో తెలుసుకుందాం ..

కథ :-

ఓ గ్రామంలో ఏదైనా అన్యాయం జరిగితే న్యాయం చెప్పే పెద్దగా పెదరాయుడు (సంపూర్ణేష్ బాబు) కనిపిస్తాడు.. అతనికి ముగ్గురు భార్యలు , నలుగురు తముళ్ళు, ఇద్దరి చెల్లెలతో ఓ పెద్ద కుటుంబంగా ఆనందంగా ఉంటుంది . ఇలాంటి టైంలో నేనే పెదరాయుడు కొడుకునని అండ్రాయుడు (సంపూ) వస్తాడు .ప్లాష్ బ్యాక్ లో పెద్ద రాయుడుకి ఇంట్లోని పనిమనిషి (షకీలా)కి సంబంధం ఏంటి ? పెద్ద రాయుడు తండ్రి పాపారాయుడికి ఎలాంటి ద్రోహం జరిగింది? చివరికి పెద్దరాయుడు కొడుకు అండ్రాయుడేనని ఎలా ఒప్పుకున్నాడు అన్నది మిగిలిన కథ ...

ఎలా ఉందంటే : -

ఒక కుటుంబ నేపధ్యం ఉన్న కథ కాబట్టి అనుబంధాలు , ఆత్మీయత ఉన్న మనుషులతో సినిమా మొదటిభాగం సాగుతుంది . సినిమాలో బలమైన సన్నివేశాలు పెద్దగ లేకున్నా సంపూ కోసం రాసిన డైలాగ్స్ ప్రేక్షకులని బాగా నవ్విస్తాయి . ప్రతి ఫ్రేమ్ లో సేటేరికల్ డైలాగ్స్ ఉండడంతో ప్రేక్షకుడికి ఎక్కడ కూడా బోర్ అనిపించదు . ఇక ఆండ్రాయిడ్ ఎంట్రీతో ఓ మూడున్నర నిమిషాల భారీ డైలాగ్ తో సినిమాకి ఇంటెర్వెల్ కార్డ్ పడుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో ఆండ్రాయిడ్ , పాపారాయుడు ఎంట్రీలతో సినిమా మరింత ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది . ముఖ్యంగా పాపారాయుడు ఎపిసోడ్ సినిమాకి బిగ్గెస్ట్ హైలేట్ ... ఇక సినిమా క్లైమాక్స్ లో తీసిన భారీ కామెడి ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది . కానీ సినిమా మొత్తం రొటీన్ ఫార్మలాతో సాగడం సినిమాకి పెద్ద మైనస్ గా చెప్పవచ్చు ..

నటినటులు ; -

సినిమా మొత్తాన్ని సంపూ తన భుజాల పైన వేసుకొని నడిపించాడు . పెదరాయుడు , ఆండ్రాయిడ్ ,పాపారాయుడు అనే మూడు పాత్రల్లో సంపూ నటన అద్భుతమనే చెప్పాలి . ఫ్రేమ్ ఫ్రేమ్ లో అతడి డైలాగ్ డెలివరీకి వావ్ అనకుండా ఉండలేం .. నటనలో సంపూ తన విశ్వరూపం చుపించాడనే చెప్పాలి . ఇక షకీలా ,కత్తి మహేష్ మరికొందరు నటినటులు పాత్రల మేరకు ఒకే అనిపించారు .

సాంకేతిక వర్గం ; -

ఈ సినిమాకి ప్రధాన బలం సంగీతమనే చెప్పాలి .. అ తర్వాత సినిమాటోగ్రఫీ బాగుంది . ఎడిటర్ తన పాత్రకి న్యాయం చేసాడు . సినిమాలోని నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచాయి . ఇక సాయి రాజేష్ రాసిన మాటలు సినిమాకి చాలా ఉపయోగపడ్డాయి . పెదరాయుడు సినిమాని స్పూప్ గా తీసుకొని తెరపైన ఓ పూర్తి స్థాయి వినోదాత్మక మైన సినిమాగా మలచడంలో దర్శకుడు రోనాల్డ్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి .

చివరిమాట :

కేవలం ఓ వినోద బరితమైన సినిమా కోసం వెళ్ళాలి అనుకుంటే కొబ్బరిమట్ట నచ్చుతుంది. సినిమాలో కొత్తదనం కోరుకునే వారికీ రొటీన్ సినిమాలో ఇదో సినిమాగా మిగులుతుంది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories