కథనం రివ్యూ ..

కథనం రివ్యూ ..
x
Highlights

యాంకర్ గా అనసూయ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది . కేవలం యాంకర్ గానే కాకుండా కొన్ని కొన్ని సినిమాల్లో నటించి మంచి పేరును సంపాదించుకుంది . అయితే ఇప్పటికి వరకు ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే సినిమాల్లో కనిపించిన అనసూయ మొదటిసారి మెయిన్ లీడ్ లో కనిపించింది .

యాంకర్ గా అనసూయ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది . కేవలం యాంకర్ గానే కాకుండా కొన్ని కొన్ని సినిమాల్లో నటించి మంచి పేరును సంపాదించుకుంది . అయితే ఇప్పటికి వరకు ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే సినిమాల్లో కనిపించిన అనసూయ మొదటిసారి మెయిన్ లీడ్ లో కనిపించింది . మరి కథనం కి ప్రేక్షకులు ఎంత వరకు కనెక్ట్ అయ్యారో ఈ సమీక్షలో చూద్దాం ...

కథ : -

అను ( అనసూయ ) సినిమాల్లో ఓ పెద్ద దర్శకురాలు కావాలని గోల్ పెట్టుకుంటుంది . ఈ క్రమంలోనే తానూ రాసుకున్న కొన్ని కథలను నిర్మాతలకు చెబుతూ ఉంటుంది . కానీ అనుకోకుండా ఓ నలుగురు నిర్మాతలు అనుకి ఓ లైన్ ఇచ్చి స్క్రిప్ట్ ని రెడీ చేయమని చెబుతారు . దీనికి ఒకే చెప్పిన అను అ స్క్రిప్ట్ కి కథనం అనే టైటిల్ ని పెట్టుకుంటుంది .ఈ క్రమంలోనే తానూ రాసుకున్న కథలో భాగంగానే బయట హత్యలు జరుగుతూ ఉంటాయి . దీనితో అను ఏసీపీ రణధీర్‌ను మీట్ అవుతుంది . దీనితో అను రాసుకున్న స్క్రిప్ట్ కి బయట జరిగే హత్యలకు ఏంటి సంబంధం అన్నది తెర పైన చూడాలి ..

ఎలా ఉందంటే : -

ఏ సినిమాకి అయిన కథనం అనేది ప్రధాన బలం .. స్టొరీ కొంచం అటు ఇటుగా ఉన్న ప్రేక్షకుడిని ఎగ్జిట్ చేసేది మాత్రం కథనమే .. అయితే ఈ సినిమాలో అదే లోపించింది . కథని గొప్పగా చెప్పినంతగా తెరమీదా ఆవిష్కరించలేకపోయాడు దర్శకుడు .. సినిమా చివరి 15 నిముషాలు తప్ప మనకి ఎక్కడ కూడా పెద్దగా ఇంట్రెస్టింగ్ గా అనిపించదు . ఇక జరిగే హత్యలు అ హత్యలపై జరిగే ఇన్వెస్టిగేషన్ కూడా ఆసక్తిగా సాగదు. కొన్ని కొన్ని సార్లు ఏ ఫిలిం బై అరవింద్ సినిమాని చూస్తున్నామా అన్న సందేహం ప్రేక్షకుడికి కలగక మానదు.. ఇక సినిమా ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలు బాగున్నాయి ..

నటినటులు : -

సినిమా మొత్తాని తన భుజం పై వేసుకొని నడిపించింది అనసూయ .. యంగ్ అసిస్టెంట్ డైరెక్టర్ పాత్రలో మెప్పించింది . ఇక అరవిందమ్మ పాత్రకి అనసూయ న్యాయం చేయలేదనే చెప్పాలి . అలాంటి పాత్రలో అనుష్క ఐతే బాగుండు అని ఒక్కసారి అయిన ప్రేక్షకుడు ఫీల్ అవ్వక మానడు. ధనరాజ్ ,రణధీర్‌ పాత్రల మేరకు బాగానే రాణించారు .. వెన్నల కిషోర్ కామెడి అంతగా పండలేదనే చెప్పాలి ..

సాంకేతిక వర్గం :

ఇక సాంకేతికవర్గం విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ పెద్దగా ఆకట్టుకోదు . సంగీతం సో సో గా ఉంది . నేపధ్య సంగీతం బాగుంది . నిర్మాణ విలువలు విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది . ఎడిటర్ సినిమా వ్యవధి తగ్గించి తన పాత్రకు న్యాయం చేసాడు .

చివరి మాట :

మంచి థ్రిల్లర్ సినిమా చూడాలి అనుకునే వారికి కథనంలో కథనం లోపించినట్టు స్పష్టంగా కనిపిస్తుంది .

Show Full Article
Print Article
Next Story
More Stories