కౌసల్య కృష్ణముర్తి : రివ్యూ

కౌసల్య కృష్ణముర్తి : రివ్యూ
x
Highlights

సినిమాకి అతిపెద్ద ప్లస్ ఐశ్వర్య రాజేష్‌ మరియు రాజేంద్రప్రసాద్ అనే చెప్పాలి . సినిమా మొత్తాన్ని వాళ్ళ భుజంపై వేసుకొని నడిపించారు.

రివ్యూ: కౌసల్య కృష్ణమూర్తి

బ్యానర్‌: క్రియేటివ్‌ కమర్షియల్స్‌

నటినటులు : ఐశ్వర్య రాజేష్‌, రాజేంద్రప్రసాద్‌, శివకార్తికేయన్‌, తదితరులు

కథ: అరుణ్‌ రాజా కామరాజ్‌

సంగీతం: ధిబు నినన్‌ థామస్‌

నిర్మాత: కె.ఏ. వల్లభ

దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు

ఈ మధ్య క్రీడలకి సంబంధించిన సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి . మజీలీ , జెర్సీ, డియర్ కామ్రేడ్ సినిమాలు ఈ కోవలోనుండే వచ్చినవే.. అయితే ఇప్పుడు అదే కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని వచ్చిన సినిమానే కౌసల్య కృష్ణముర్తి సినిమా ... తమిళ్ లో వచ్చిన కణ సినిమాకి ఇది రీమేక్ ... మరి తెలుగు ప్రేక్షకులని ఏ మాత్రం ఆకట్టుకుందో మన సమీక్షలో చూద్దాం...

కథ : -

కౌసల్య (ఐశ్వర్య రాజేష్‌) చిన్నప్పటి నుండి క్రికెట్ అంటే చాలా ఇష్టం. తన తండ్రికి(కృష్ణముర్తి) కూడా అంతే... కానీ అది ఒక అబ్బాయిలు ఆడే అట మాత్రమే అనుకున్నా కౌసల్య అ తరవాత అబ్బాయిల బ్యాచ్ లో ఓ సభ్యురాలుగా చేరి తన ఆటను మొదలు పెడుతుంది . అలా స్పిన్నర్ గా తన ఆటను స్టార్ట్ చేసి అక్కడి నుండి రాష్ట్ర స్థాయి , జాతీయ స్థాయికి ఎదిగి నేషనల్ మహిళల జట్టుకు ఎలా ఆడింది . కౌసల్య క్రికెటర్ గా ఎదగడానికి తన తండ్రి చేసిన సహాయం ఏంటి అన్నది తెర పైన చూడాల్సిందే ...

విశ్లేషణ : -

మంచి ఎమోషన్ ఉన్న కథని ఎంచుకున్నాడు దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు .. రిమేక్ స్పెషలిస్ట్ గా పేరున్న భీమినేని కథని ఎక్కడ కూడా చేంజ్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా తెరకెక్కించాడు . సినిమాకి ఓన్లీ క్రీడా నేపధ్యంలో మాత్రమే చూపించకుండా దానికి ఆడిషనల్ గా రైతుల సమస్యలను ఆడ్ చేసి ఓ గొప్ప సందేశాన్ని ఇచ్చాడు దర్శకుడు . ఐతే ఈ క్రెడిట్ మాత్రం ఒరిజినల్ కథ రచయితలకు మాత్రమే దక్కుతుంది . సినిమా మొదటి భాగం చాలా సరదాగా గడిచిపోయినా ఇక రెండో భాగం మొత్తం భాగోద్వేగలతో నింపేసాడు దర్శకుడు ... క్రీడా నేపధ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి . ఇక సమకాలీన రైతుల సమస్యలు ప్రేక్షకుడిని కంటతడి పెట్టిస్తాయి ... కానీ సినిమాలో ఎక్కడ కూడా కొత్తదనం లేకపోవడం ప్రేక్షకుడిని కొంచం నిరాశకి గురిచేస్తుంది.

నటినటులు :

సినిమాకి అతిపెద్ద ప్లస్ ఐశ్వర్య రాజేష్‌ మరియు రాజేంద్రప్రసాద్ అనే చెప్పాలి . సినిమా మొత్తాన్ని వాళ్ళ భుజంపై వేసుకొని నడిపించారు. ఎమోషనల్ సన్నివేశాల్లో ఇద్దరి నటనకి హాట్స్ ఆఫ్ అనుకుండా ఉండలేం ... శివకార్తికేయన్‌ పాత్ర ఒకే అనిపించింది . ఇక సినిమాలోని నటినటులు వారివారి పాత్రల మేరకు ఒదిగిపోయారు ...

సాంకేతిక వర్గం :

సినిమాటోగ్రఫీ బాగుంది . సినిమాలో పాటలు పెద్దగా కదిలించలేకపోయిన నేపధ్య సంగీతం బాగుంది . ఎడిటర్ ఇంకాస్తా సీన్స్ కి కటింగ్ పెడితే బాగుండు అనిపిస్తుంది . సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి . ఇక ఒరిజినల్ కథ బాగుండడంతో ఎక్కడ కూడా మార్పులు చేర్పులు చేసేందుకు దర్శకుడు సాహసం చేయలేదేమో అనిపిస్తుంది. దీనితో కౌసల్య కృష్ణముర్తి వన్ టైం వాచబుల్ గా మిగిలిపోతుంది .

గమనించగలరు : ఈ సమీక్ష కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే... పూర్తి సినిమాని థియేటర్లో చూడగలరు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories