చాణక్య రివ్యూ...

చాణక్య రివ్యూ...
x
Highlights

తొలివలపు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యాడు నటుడు గోపీచంద్.. ఆ తర్వాత విలన్ గా మారి, ఆ తర్వాత మళ్లీ హీరోగా మారి 25 సినిమాలు చేసాడు. ఇక...


తొలివలపు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యాడు నటుడు గోపీచంద్.. ఆ తర్వాత విలన్ గా మారి, ఆ తర్వాత మళ్లీ హీరోగా మారి 25 సినిమాలు చేసాడు. ఇక తమిళ్ దర్శకడు తిరు దర్శకత్వంలో చాణక్య అనే సినిమాని ప్రేక్షకుల ముందుకు వచ్చాడు... మరి ఈ సినిమా ప్రేక్షుకులను ఎంత వరకు ఆకట్టుకుందో మన రివ్యూలో చూద్దాం...

కథ:

అర్జున్ అలియాస్ రామకృష్ణ (గోపిచంద్) పాకిస్తాన్ టెర్రర్ ఎటాక్ నుండి దేశాన్ని కాపాడడానికి ఓ బ్యాంక్ ఉద్యోగి మారి (రా) ఏజెంట్‌గా సీక్రెట్ ఆపరేషన్స్ నిర్వహిస్తూ ఉంటాడు. ఇండియాలో జరిగే ప్రతి టెర్రర్ ఎటాక్ ని పాకిస్థాన్ నుండి ఇబ్రహీం ఖురేషీ ఆపరేట్ చేస్తుంటాడు... అందులో భాగంగా అర్జున్ అబ్దుల్ సలీమ్‌ను రా ఆపరేషన్‌లో భాగంగా అంతం చేస్తాడు.. దానికి బదులుగా అర్జున్ టీంలో ఉన్న నలుగురు స్నేహితులను ఇబ్రహీం ఖురేషీ వారిని కిడ్నాప్ చేసి పాకిస్తాన్ కి తరలిస్తడు. ఈ క్రమంలో అర్జున్ ఎం చేసాడు. తన స్నేహితులను ఎలా కాపాడుకున్నాడు. టెర్రర్ ఎటాక్ లనుండి దేశాన్ని ఎలా కాపాడి, విలన్ ని అంతం చేసాడు అన్నది మిగిలిన కథ..

ఎలా ఉందంటే?

ఇలాంటి కథలు తెలుగులో కొత్తేమి కాదు. కానీ గోపీచంద్ ఇలాంటి పాత్రలో కనిపించే సరికి సగటు ప్రేక్షకుడుని ఈ సినిమా ధియేటర్ కి వెళ్ళేలా చేసింది. సిరియాలో ఉగ్రవాదిని పట్టుకొచ్చే ఓ ఆపరేషన్‌తో చాణక్య మొదలవుతూ ప్రేక్షకుడుని ఆసక్తిని కలిగిస్తుంది. ఇక పాత్రల పరిచయం, స్క్రీన్ ప్లే కూడా నెమ్మదిగా సాగింది. మెయిన్ కథ మొదలైనప్పటికి కథలో వేగం కనిపించదు. రొటీన్ సన్నివేశాలతో సినిమా సాగడంతో చూసే ప్రేక్షకులకి సినిమాపైన ఇంట్రెస్ట్ పోతుంది. హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కూడా పెద్దగా ఆకట్టుకోదు. ఇక రెండవ భాగంలో అయిన సినిమా పుజుకుందా అంటే అది లేదు. రొటీన్ స్క్రీన్ ప్లే తో లాజిక్ లేని సన్నివేశాలతో సినిమా సాగుతుంది.

నటినటులు...

ఇక నటినతుల విషయానికి వస్తే గోపీచంద్ నటన బాగుంది. రా ఏజెంట్‌గానూ గోపీచంద్ స్క్రీన్ పై బాగా కనిపించాడు. యాక్షన్,ఎమోషనల్ సన్నివేశాల్లో గోపి కొత్తదనం చూపించాడు. ఇక హీరోయిన్స్ మేహరీన్, జరీన్ ఖాన్ బాగానే ఆకట్టుకున్నారు. అలీ,నాజర్ మిగిలిన నటినటులు పాత్రల మేరకు ఒకే అనిపించారు.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ పరంగా సినిమాని హై లెవల్ లో నిలబెట్టాయి నిర్మాణ విలువలు.. ఛేజింగ్ సీన్లకు అయితే భారీగానే ఖర్చు చేశారు. విశాల్ శేఖర్ సంగీతం పెద్దగా ఆకట్టుకోదు.. వెట్రి కెమెరావర్క్ బాగుంది. ఎడిటింగ్ పరంగా మార్తాంగ్ కె వెంకటేష్ సినిమాను చాలా వరకూ ట్రిమ్ చేస్తే బాగుండేది అని అనిపిస్తుంది. అబ్బూరి రవి సంభాషణలు బాగున్నాయి. మొత్తానికి గోపీచంద్ ఓ పాత కథతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడనే చెప్పాలి

గమనిక: ఈ సమీక్ష కేవలం ఒక ప్రేక్షకుడుకి మాత్రమే సంబంధించంది. పూర్తి సినిమాని ధియేటర్ కి వెళ్లి చూడగలరు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories