మెప్పించిన దొరసాని... (రివ్యూ)

మెప్పించిన దొరసాని... (రివ్యూ)
x
Highlights

హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ మరియు రాజశేఖర్ కుమార్తె శివాత్మిక నటించిన దొరసాని చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది . సినిమా...

హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ మరియు రాజశేఖర్ కుమార్తె శివాత్మిక నటించిన దొరసాని చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది . సినిమా ట్రైలర్ మరియు టిజర్ లకు విశేషమైన స్పందన వచ్చింది . రిలీజ్ కు ముందు హీరో విజయ్ దేవరకొండ సినిమా గురించి మాట్లాడిన స్పీచ్ తో సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి .. అయితే మరి అ అంచనాలను దొరసాని ఎంత వరకు నిజం చేసింది అన్నది మన రివ్యూ లో చూద్దాం..

కథ : -

కథ 1980 సంవత్సరం నేపధ్యంలో సాగుతుంది . రాజు ( ఆనంద్ దేవరకొండ) పట్నంలో చదువుకుంటాడు .. సెలవులు కావడం చేత సొంత ఊరికి వస్తాడు .. ఊరిలో జరిగే పెద్ద బతుకమ్మ పండగ సమయంలో దేవిక అలియాస్ దొరసాని (శివాత్మిక)ని చూసి ఆమె పట్ల ఆకర్షితుడు అవుతాడు .. ఇదే క్రమంలో ఆమెను చూసేందుకు పలుమార్లు రాత్రుళ్ళు గడి వైపు వెళ్తాడు .. ఈ నేపధ్యంలోనే దేవకీ కూడా రాజుకి ఆకర్షితురాలు అవుతుంది . ఇలా కొన్ని రోజులకు వీరి మధ్య ఉన్నది ఆకర్షణ కాదు . ప్రేమ అని తెలియడంతో ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోతారు . వీరి ప్రేమ విషయం తెలిసినా దేవిక తండ్రి పోలీసులుకి అప్పగించి అతనిపై నక్సలేట్ అనే ముద్ర వేయిస్తాడు .. దాని నుండి రాజు ఎలా బయట పడ్డాడు ? దొరసానిని ఎలా కలుసుకున్నాడన్నది మిగిలిన కథ ..

ఎలా ఉంది అంటే :-

చెప్పుకోడానికి ఇది అందరికి తెలిసినా కథే అయినప్పటికీ దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు పాత్రలు సినిమాకి ప్రాణం పోసాయి .. దొరల పాలనలో జీవన వ్యవస్థ ఎలా ఉండేది అన్నది చాలా చక్కగా చూపించాడు దర్శకుడు .. సినిమా మొదలు నుండే మనల్ని 80 వ శతాబ్దంలోకి తీసుకువెళ్తాడు దర్శకుడు . రాజు - దొరసాని మధ్య ప్రేమతో కూడుకున్న సన్నివేశాలు సినిమాకి బిగ్గెస్ట్ హైలేట్ అని చెప్పుకోవచ్చు ..సినిమాలో మొదటి భాగం చూస్తుండగానే గడవగా ఇక రెండవ భాగం కొంచం నత్తనడకన సాగుతున్నట్టు అనిపిస్తుంది.

ఎలా చేసారంటే : -

సినిమాకి ప్రధాన బలం నటినటులనే చెప్పాలి . రాజు - దొరసాని పాత్రలో వారిద్దరూ నటించారు అనడం కన్నా జీవించారనే చెప్పాలి . ముఖ్యంగా ఇందులో శివాత్మిక దొరసానిగా బాగా మెప్పించింది . ఆమె పలికించిన హావభావాలకు దియేటర్లో చప్పట్లు కొట్టడం ఖాయం .. మిగతా పాత్రలో ఎవరి పాత్ర మేరకు వారు ఒదిగిపోయారు ...

సాంకేతిక వర్గం : -

ఇక సినిమాకి మరో ప్రధాన బలం సంగీతం .. ప్రశాంత్ ఆర్ విహారి అందించిన సంగీతం మరియు నేపధ్య సంగీతం సినిమాకి ప్రాణం పోసాయి . ఇక సినిమాలో సినిమాటోగ్రాఫర్ సన్నీ కూరపాటి పనితనం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే .. ఆనాటి కాలంలోకి తీసుకువెళ్ళి ఫ్రెష్ లోకేషన్స్ లో సినిమాని చూస్తున్నామన్న అనుభూతిని కల్పించాడు .. ఇక దర్శకుడు కే.వీ.ఆర్ మహీంద్ర చెప్పాలనుకున్న పాయింట్ ని చాలా చక్కగా అద్బుతంగా చెప్పాడు . అంతే గొప్పగా చూపించాడు .

బాటమ్ లైన్ : - మెప్పించిన దొరసాని ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories