logo
సినిమా రివ్యూ

Godfather Review: 'గాడ్‌ ఫాదర్‌' మూవీ రివ్యూ.. మంచి హిట్ కొట్టిన చిరంజీవి

Chiranjeevi Godfather Movie Review Telugu
X

Godfather Review: ‘గాడ్‌ ఫాదర్‌’ మూవీ రివ్యూ.. మంచి హిట్ కొట్టిన చిరంజీవి

Highlights

Godfather Review: ‘గాడ్‌ ఫాదర్‌’ మూవీ రివ్యూ.. మంచి హిట్ కొట్టిన చిరంజీవి

చిత్రం: గాడ్ ఫాదర్

నటీనటులు: చిరంజీవి, నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్, పూరి జగన్నాథ్, మురళి శర్మ, సునీల్, బ్రహ్మాజీ, సముతిరఖని, తదితరులు

సంగీతం: తమన్ ఎస్

సినిమాటోగ్రఫీ: నిరావ్ షా

నిర్మాతలు: రామ్ చరణ్, ఆర్ బీ చౌదరి

దర్శకత్వం: మోహన్ రాజా

బ్యానర్లు: కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్

విడుదల తేది: 05/10/2022

ప్రస్తుతం ఇండస్ట్రీలో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి. ఈమధ్యనే "ఆచార్య" సినిమాతో అతిపెద్ద డిజాస్టర్ అందుకున్నారు చిరు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించ లేకపోయింది. తాజాగా చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో "గాడ్ ఫాదర్" అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. మలయాళం లో సూపర్ హిట్ అయిన "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇవాళ అనగా అక్టోబర్ 5 న థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ సినిమా అయినా ప్రేక్షకులను అలరించిందో లేదో చూసేద్దామా..

కథ:

జనజాగృతి పార్టీ అధినేత అలాగే ముఖ్యమంత్రి పి.కే.ఆర్ మరణంతో సినిమా మొదలవుతుంది. ఆయన మృతి తరువాత సత్య ప్రియ (నయనతార), జయ దేవ్ (సత్య దేవ్), వర్మ (మురళి శర్మ) వీళ్ళందరు ఆ పదవి కోసం ట్రై చేస్తారు. అసలు పార్టీకి ఎవరు అధినేతగా ఉంటారు ఎవరు పార్టీ ని ముందు ఉండి నడిపిస్తారు, పార్టీ లో అధికారం కోసం అందరి కళ్ళు ఆ కుర్చీ పైనే ఉంటాయి. ఇలాంటి సమయం లోనే బ్రహ్మ (చిరంజీవి) వస్తాడు, వచ్చి రాగానే అందరి అంచనాల్ని తారుమారు చేస్తూ ఆ కుర్చీ పై చెడ్డ వాళ్ళ కన్ను పడకుండా చూస్తాడు. అందరి ఎత్తుగడల్ని తారు మారు చేస్తూ బ్రహ్మ ఎం చేసాడు అన్నది మిగిలిన కథ.

నటీనటులు:

చిరంజీవి కి ఈ సినిమాలో విభిన్నంగా ఉండే పాత్ర దక్కింది. ఎందుకంటే అసలు ఈ సినిమాలో చిరంజీవికి పాటలు గాని హీరోయిన్ గాని ఉండదు, సినిమా మొత్తాన్ని చిరంజీవి ముందుండి నడిపించాడు తనదైన శైలిలో. తన క్యారెక్టర్రైజేషన్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్నీ బాగానే సెట్ అయ్యాయి. ఒక రకంగా చెప్పాలి అంటే చిరంజీవి కి ఇదే అసలైన కం బ్యాక్ సినిమా అని చెప్పొచ్చు. నయనతార కూడా తన పాత్రలో ఇట్టే ఒదిగిపోయి చాలా బాగా నటించింది. తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. సత్యదేవ్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా మెయిన్ విలన్ పాత్రలో సత్యదేవ్ చాలా చక్కగా నటించారు, ఈ పాత్ర సత్య దేవ్ కెరీర్ కే పెద్ద టర్నింగ్ పాయింట్. పూరి జగన్నాథ్ కూడా చాలా బాగా నటించారు, చాలా కాలం తర్వాత కెమెరా ముందు కు వచ్చిన పూరి నటనతో మంచి మార్కులే సంపాదించుకున్నారు. ఇకపోతే సల్మాన్ ఖాన్ పాత్ర కి థియేటర్స్ లో విజిల్స్ ఖాయం. సునీల్, సముతిరఖని, మురళి శర్మ ల నటన కూడా బాగానే ఉంది.

సాంకేతిక వర్గం:

డైరెక్టర్ మోహన్ రాజా కథను చాలా బాగా నెరేట్ చేశారు. రీమేక్ అయినప్పటికీ చాలా వరకు కథ కొంత డిఫరెంట్ గానే ఉంది అని చెప్పాలి. సినిమా ను తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా మార్చిన తీరు కూడా బావుంది. చాలా వరకు స్క్రీన్ ప్లే కూడా ఆసక్తికరంగానే నడిచింది. ఇంటర్వల్ కూడా మోహన్ రాజా చాలా బాగా చిత్రీకరించారు. నిర్మాణ విలువలు ఈ సినిమాను బాగానే హై లైట్ అయ్యాయి. తమన్ అందించిన సంగీతం కూడా ఈ సినిమాకి అతిపెద్ద అసెట్ గా చెప్పుకోవచ్చు. పాటలు పక్కన పెడితే నేపథ్య సంగీతం మాత్రం సినిమాకి చాలా బాగా సెట్ అయింది. సినిమాటోగ్రాఫర్ కూడా సినిమాకి మంచి కలర్ ఫుల్ విజువల్స్ ను అందించారు. ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.

బలాలు:

చిరంజీవి

తారాగణం

నేపధ్య సంగీతం

బలహీనతలు:

కొన్ని అనవసరమైన సన్నివేశాలు

చివరి మాట:

2019 లో వచ్చిన "లూసిఫెర్" సినిమా కి రీమేక్ కి వచ్చిన "గాడ్ ఫాదర్" ఎక్కడ ఆ సినిమా తాలుకు మూల కథని దేబ్బతియ్యకుండా కొత్త రకైన స్క్రీప్లే ని జత చేసుకొని ప్రేక్షకులని రంజిపచేయడం పక్కా. అలాగే ఈ దసరా పండక్కి "గాడ్ ఫాదర్" రూపం లో వచ్చిన చిరంజీవి తనదైన మార్క్ నటనతో సినిమాకి ఆయువుపట్టుగా నిలిచి ఎక్కడా ఇది రీమేక్ సినిమా అనే భావన రాకుండా చేయగలిగాడు.

బాటమ్ లైన్:

ఇండస్ట్రీ కి "గాడ్ ఫాదర్" అయిన చిరంజీవి మంచి హిట్ కొట్టారు.

Web TitleChiranjeevi Godfather Movie Review Telugu
Next Story