Brandy Diaries Movie Review: రివ్యూ - బ్రాండీ డైరీస్

Brandy Diaries Movie Review
x

Brandy Diaries Movie Review: రివ్యూ - బ్రాండీ డైరీస్

Highlights

Brandy Diaries Movie Review: రివ్యూ - బ్రాండీ డైరీస్

నటీనటులు - సునీత సద్గురు, నవీన్ వర్మ, కెవి శ్రీనివాస్, రవీంద్ర బాబు, దినేష్ మాడ్నె

సాంకేతిక నిపుణులు - సినిమాటోగ్రఫీ - ఈశ్వరన్ తంగవేల్, ఎడిటర్ - యోగ శ్రీనివాస్, సంగీతం - ప్రకాష్ రెక్స్, బ్యానర్ - కలెక్టివ్ డ్రీమర్స్, నిర్మాత - లెల్ల శ్రీకాంత్, రచన దర్శకత్వం - శివుడు

కథేంటంటే

బ్రాండీ డైరీస్ కొన్ని పాత్రల మధ్య సాగే కథ. శేఖర్, శ్రీను, వర్మ, జాన్సన్, కోటి అనే ఐదుగురు గ్లాస్ మేట్స్. శేఖర్ డిప్యూటీ ఎమ్మారో గా పనిచేస్తుంటాడు. శ్రీను సివిల్స్ ప్రిపేర్ అవుతుంటాడు. జాన్సన్ పనీ పాట లేని వ్యక్తి, వర్మ ఓ జీనియస్. కోటి ఒక చెప్పుల కంపెనీలో పనిచేస్తుంటాడు. ఇలా వివిధ రంగాలకు చెందిన ఐదుగురు వ్యక్తులను మందు స్నేహితులను చేస్తుంది. తాగి వాళ్ల వాళ్ల కష్టాలను పరస్పరం షేర్ చేసుకుంటారు. శేఖర్ అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి, కానీ పై అధికారులు అవినీతి పనులు చేయడం అతనికి నచ్చదు. గవర్నమెంట్ ఉద్యోగి అయి ఉండి సంపాదించలేకపోవడంతో భార్య పోరు పెడుతుంటుంది. వర్మ మిడిల్ ఏజ్ దాటి ఓల్డ్ ఏజ్ కు దగ్గరవుతున్న బ్యాచ్ లర్. ప్రేమ, పెళ్లి అనేవి అతనికి పడవు. బాగా చదువుకున్న వ్యక్తి. సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న శ్రీను, కెరీర్ లో స్థిరపడాలని ప్రయత్నిస్తుంటాడు. ఇలా ఐదు పాత్రలది ఐదు విభిన్న నేపథ్యం. ఈ ఐదు పాత్రల ద్వారా దర్శకుడు చెప్పిన ఫిలాసపీ, లైఫ్ జర్నీనే బ్రాండీ డైరీస్. ఇందులో హీరో పాత్ర శ్రీనుది. అతను సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే భవ్య అనే యువతిని ప్రేమిస్తాడు. మద్యపానం అలవాటు, అతని ప్రేమకు ఆటంకం అవుతుంది. మరి ఈ ఐదుగురు జీవితాలు మద్యం ప్రభావంతో ఎలాంటి మలుపులు తిరిగాయి అనేది మిగిలిన కథ.

ఎలా ఉందంటే..

ఐదు విభిన్న పాత్రల ద్వారా జీవితాన్ని వివరించాలని చూశాడు దర్శకుడు శివుడు. ప్రేమ, పెళ్లి, స్నేహం, కెరీర్ ఇలా చాలా అంశాలను మద్యం నేపథ్యంతో తెరకెక్కించాడు. బ్రాండీ డైరీస్ అటు ఇంటెలిజెంట్ గా సాగుతూనే మనలో చాలా మంది జీవితాలకు అద్దం పడుతుంది. వాస్తవికంగా సినిమాను రూపొందించడం మరో ప్రధాన విషయం. బ్రాండీ డైరీస్ లో ఎక్కడా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోలేదు. ఒక ఐదారు పాత్రల గమానాన్ని, వాటి జీవన శైలిని సింబాలిక్ గా చూపిస్తూ కథను తెరకెక్కించారు. ప్రధాన పాత్ర ధారులైన సునీత సద్గురు, నవీన్ వర్మ, కెవి శ్రీనివాస్, రవీంద్ర బాబు, దినేష్ మాడ్నె తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రకాష్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు బలాన్నిచ్చాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కథకు తగినట్లు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఉన్నాయి. వర్మ పాత్ర ద్వారా చాలా ఫిలాసఫీ చెప్పించారు దర్శకుడు శివుడు. అతను చెప్పిన మాటలు నిజమే కదా అనిపిస్తాయి. శ్రీను భవ్య మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ కు థియేటర్ లో యూత్ ఆడియెన్స్ రెస్పాన్స్ బాగుంది. ఇళ్లు, పిల్లలు, కుటంబాన్ని పట్టించుకుకోని జాన్సన్ లాంటి పాత్రలను మనం ఎందరినో చూసి ఉంటాం. తన ఉద్యోగ ధర్మంగా పేదలకు సాయం చేయాలని చూసే డిప్యూటీ ఎమ్మార్వో శేఖర్ పాత్ర కూడా బాగుంది. భవ్య పాత్రలో సునీత ఆకట్టుకుంది. ఆమె స్మైల్, హావభావాలు మెప్పించాయి. మొత్తంగా బ్రాండీ డైరీస్ ఒక రియల్ లైఫ్ మిర్రర్ అనుకోవచ్చు.

యూత్ కి మంచి కిక్ ఇచ్చే సినిమా. ప్రతి తాగుబోతు మరియు మందు అసలు తగానివాడు అందరూ ఖచ్చితంగా చూడవలసిన సినిమా... బ్రాందీ డైరీస్ మంచి కిక్ ఇచ్చే సినిమా . తప్పక చూడండి.

Show Full Article
Print Article
Next Story
More Stories