Bichagadu-2 Review: బిచ్చగాడు-2 రివ్యూ.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వేరే లెవల్ లో..

Bichagadu 2 Movie Review in Telugu
x

Bichagadu-2 Review: బిచ్చగాడు-2 రివ్యూ.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వేరే లెవల్ లో..

Highlights

విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన చిత్రం బిచ్చగాడు2. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకులముందుకొచ్చింది. టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను క్రియేట్ చేశాయి. విజయ్ ఆంటోనీ మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా బాధ్యతలు తీసుకొని చేసిన ఈ సినిమా అతడికి విజయం అందించిందా అంటే..

బిచ్చగాడు..ఏడేళ్ల క్రితం వచ్చిన ఈ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా బాక్సాఫీస్ ముందుకొచ్చిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీసుల దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఇన్నేళ్ల తర్వాత ఈ హిట్ మూవీకి సీక్వెల్ గా బిచ్చగాడు2 బాక్సాఫీస్ ముందుకొచ్చింది. బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో హీరో విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో బిచ్చగాడు2లో నటించి నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది. ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్ ఎలా ఉంది.

బిచ్చగాడు2 స్టోరీ లైన్ :

బిచ్చగాడు 2 మూవీ కథ విషయానికొస్తే..విజయ్ గురుమూర్తి అంటే విజయ్ ఆంటోనీ దేశంలోనే అత్యంత ధనికుడు. లక్ష కోట్లకి వారసుడు అయిన విజయ్ గురుమూర్తి ఆస్తి మీదే అందరి కళ్లు ఉంటాయి. అయితే విజయ్ అనుకోకుండా చనిపోవడంతో...విజయ్ గురుమూర్తి పోలికలతో ఉన్న అతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అయితే ఉన్నట్టుండి ఆ వ్యక్తి విజయ్ గురుమూర్తిలా మాట్లాడడం, ఆలోచించడం చేస్తాడు. దీని వెనక బ్రెయిన్ మార్పిడి ఉందని తెలుసుకొని అతడ్ని చంపేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు. మరి, విజయ్ గురుమూర్తిని పోలిన వ్యక్తి ఎవరు..అసలు విజయ్ గురుమూర్తిని ఎవరు చంపాలనుకుంటున్నారు...విజయ్, పోలీసులు అరెస్ట్ చేసిన సత్య..ఇద్దరు వేర్వేరా లేక ఒక్కరేనా..ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

రివ్యూ :

బిచ్చగాడు 2 ఫస్ట్ షో చూసిన ప్రేక్షకులు సినిమా పై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. బిచ్చగాడు సినిమా కంటే సీక్వెల్ ఎంతో బాగుందంటున్నారు. బ్రెయిన్ మార్పిడి పై జరిగే ప్రయోగం కారణంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేదే ఈ చిత్ర కథ అంటున్నారు. డబ్బు మరియు ఎమోషన్స్ చుట్టూ సాగే ఈ కథలో తెరపైన కనిపించిన ప్రతి ఒక్కరూ చక్కటి పర్ ఫార్మెన్స్ ఇచ్చారని చెబుతున్నారు. సినిమాలో సెంటిమెంట్ సీన్స్ హార్ట్ టచ్చింగ్ గా ఉన్నాయంటున్నారు. అయితే ఫస్టాఫ్ చాలా ఎంగేజింగ్ గా ఉంటే సెకండాఫ్ తేలిపోయిందంటున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా బాగుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

ప్లస్ పాయింట్స్ :

కథ

కొన్ని సన్నివేశాలు

యాక్షన్ సీన్స్

ఇంటర్వెల్ బ్యాంగ్

విజయ్ నటన

మైనస్ పాయింట్స్:

సెకండాఫ్ లో సీన్స్

స్క్రీన్ ప్లే

ఓవరాల్ టాక్ : బిచ్చగాడు 2 టీజర్ , ట్రైలర్ సినిమా పై హైప్ క్రియేట్ చేయగా..సిల్వర్ స్క్రీన్ పై వచ్చే సరికి మాత్రం అదే రేంజ్ ని సినిమా మెయింటేన్ చేయలేకపోయింది. డిఫరెంట్ కాన్సెప్ట్ కాబట్టి..డిఫరెంట్ గా ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేసిన వారికి ఓ రొటీన్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలిగించింది. యాక్టర్ గా విజయ్ 100 పర్సంట్ మార్కులతో పాస్ అయితే దర్శకుడిగా మాత్రం ఇంకా రాటు దేలాలి. స్క్రీన్ ప్లే విషయంలో మరింత దృష్టి పెట్టి ఉండాల్సింది. సినిమాలో మ్యూజిక్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా ఉన్నాయి. ఓవరాల్ గా చెప్పాలంటే, భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళితే బిచ్చగాడు 2 మనల్ని మెప్పించడం ఖాయం.

Show Full Article
Print Article
Next Story
More Stories