SwathiMuthyam Review: పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న స్వాతిముత్యం

SwathiMuthyam Review: బెల్లంకొండ సురేష్ రెండో వారసుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కిన మూవీ స్వాతిముత్యం.

Arun Chilukuri
Updated on: 5 Oct 2022 2:30 PM IST
Bellamkonda Ganesh Swathimuthyam Movie Review
X

SwathiMuthyam Review: పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న స్వాతిముత్యం

SwathiMuthyam Review: బెల్లంకొండ సురేష్ రెండో వారసుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కిన మూవీ స్వాతిముత్యం. ఇక వర్ష బొల్లెమ్మతో బెల్లంకొండ గణేష్ చేసిన ఈ ప్రయోగం వరల్డ్ వైడ్ గా విడుదలైంది. మరి విక్కీ డోనర్ లాంటి ఫ్లేవర్ ఉన్న ఈమూవీ హిట్ మెట్టెక్కిందా? లేదా? బెల్లంకొండ సురేష్ వారసుడిగా, బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడిగా స్వాతిముత్యం మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు బెల్లంకొండ గణేష్. వర్ష బొల్లెమ్మతో జోడీ కట్టి లక్ష్మణ్ కే కృష్ణ మేకింగ్ లో స్వాతిముత్యంగా మారి వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు గణేష్.

స్వాతిముత్యం కథలోకి వెలితే పెళ్లీ వరకు వెళ్లిన హీరో జర్నీలో ఒకే ఒక్కట్విస్ట్, సీన్ రివర్స్ అయ్యేలా చేస్తుంది. ఒకరిని ఒకరు ఇష్టపడి ఇక ఏడడుగులు నడవబోతున్న జంట జీవితాల్లోకి మరో లేడీ అది కూడా ఓ ట్విస్ట్ ఇచ్చే కారణంతో వస్తే... ఆ సమస్యనుంచి పెళ్లి కొడుకు ఎలా భయటపడతాడనేదే సినిమా కథ. బెల్లంకొండ గణేష్ స్వాతిముత్యం అనిపించుకునేలానే ఇన్నోసెంట్ రోల్ లో బాగా పెర్ఫామ్ చేస్తే, వర్ష బొల్లెమ్మ తన పాత్రలో పాతుకుపోయింది. ఇక వెన్నెల కిషోర్, నరేష్ అండ్ కో తమ పాత్రల పరిది మేరకు పర్లేదనిపించారు.

స్వాతి ముత్యం కమల్ కెరీర్ లో వచ్చిన ఓ మాస్టర్ పీస్. ఆ సినిమా పేరునే వాడి స్వాతిముత్యం టీం రిస్క్ చేసింది. ఐతే కామెడీ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాను నెరేట్ చేయడంతో లక్ష్మణ్ కే కృష్ణ సక్సెస్ అయ్యాడంటున్నారు. స్వాతి ముత్యం మూవీకి మ్యూజిక్ ప్లస్ అయ్యింది. కథాంశం కలిసొచ్చేలా ఉంది. ఫ్యామిలీ డ్రామాకి కామెడీ ఫ్లేవర్ యాడ్ అయ్యింది. మొత్తానికి బడా హీరోల సినిమాలు సందడి చేసే టైంలో వచ్చినా కాని స్వాతిముత్యానికి పాజిటివ్ రెస్పాన్సే వస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story