Amigos Review: 'అమిగోస్‌' మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Amigos Movie Review in Telugu
x

Amigos Review: ‘అమిగోస్‌’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Highlights

Amigos Review: ‘అమిగోస్‌’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

చిత్రం: అమిగోస్

నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, ఆశికా రంగనాథ్, బ్రహ్మాజీ, సప్తగిరి, తదితరులు

సంగీతం: జిబ్రాన్

సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్

నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవి శంకర్

దర్శకత్వం: రాజేంద్ర రెడ్డి

బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్

విడుదల తేది: 10/02/2023

ఈ మధ్యనే "బింబిసార" సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ "అమిగోస్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇవ్వడంలో ముందు ఉండే కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో రాజేందర్ రెడ్డి అనే డైరెక్టర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఒక ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో టీజర్ మరియు ట్రైలర్లతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా మంచి అంచనాల మధ్య ఇవాళ అనగా ఫిబ్రవరి 10, 2023 న థియేటర్లలో విడుదలైంది. ఆశికా రంధనాద్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కథ మనుషుల్ని పోలిన మనుషుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ విభిన్న లుక్స్ తో అందరి దృష్టిని ఆకర్షించనున్నారు. మరి ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించిందో చూసేద్దామా..

కథ:

సిద్దు అలియాస్ సిద్ధార్థ్ (కళ్యాణ్ రామ్) ఇషిక (ఆశిక రంగనాథ్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇషిక ఒక ఆర్జే గా పని చేస్తూ ఉంటుంది. కానీ కొన్ని కారణాలవల్ల సిద్దు ప్రేమని ఒప్పుకోవడానికి ఇషిక కొన్ని కండిషన్లను పెడుతుంది. అప్పుడే పెళ్లి చేసుకుంటానని చెబుతుంది. ఈ నేపథ్యంలోనే సిద్దు తన కోరికలతోనే ఉండే మంజునాథ్ హెగ్డే (కళ్యాణ్ రామ్) మరియు మైఖేల్ (కళ్యాణ్ రామ్) లను కలుస్తాడు. మరి సిద్దు ప్రాబ్లెమ్ ను వీరు తీర్చగలిగారా? ఈ క్రమంలో సిద్దుకి ఎలాంటి బెదిరింపులు వచ్చాయి? ఇంతకీ ఇషిక పెట్టిన కండిషన్ ఏంటి? చివరికి ఆ కండిషన్లను సిద్ధూ పూర్తి చేశాడా? చివరికి ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

"బింబిసార" తర్వాత కళ్యాణ్ రామ్ ఈ సినిమా తో మరొక ఛాలెంజింగ్ పాత్రను ఎంపిక చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో విభిన్న లుక్కులతో త్రిపాత్రాభినయం చేసిన కళ్యాణ్ రామ్ తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించారు. మూడు విభిన్న పాత్రలు అయినప్పటికీ వాటి మధ్య వేరియేషన్స్ ను కళ్యాణ్ రామ్ చాలా బాగా చూపించారు. ఈ సినిమా కోసం కళ్యాణ్ రామ్ చాలా కష్టపడ్డారని తెలుస్తోంది. సినిమా ఆద్యంతం తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో కళ్యాణ్ రామ్ కట్టిపడేస్తారు. అసికా రంగనాథ్ కూడా తన పాత్రలో చాలా బాగా నటించింది. మూడు విభిన్న పాత్రలు ఉండడంతో చాలావరకు వెండి తెర మీద కళ్యాణ్ రామ్ మాత్రమే కనిపిస్తారు. హీరో హీరోయిన్లు కాకుండా బ్రహ్మాజీ కూడా తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించారు. జయప్రకాష్ నటన కూడా బాగుంది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు పరవాలేదు అనిపించారు.

సాంకేతిక వర్గం:

రాజేంద్ర రెడ్డి ఈ సినిమా కోసం మంచి కథను ఎంపిక చేసుకున్నారు. మూడు విభిన్న పాత్రలు ఉన్నప్పటికీ ఎలాంటి కన్ఫ్యూజన్ రాకుండా నరేషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ ముగ్గురిలో కూడా మెయిన్ హీరో ప్రపంచాన్ని ముందుగా పరిచయం చేసి ఫస్ట్ ఆఫ్ మొత్తం ఆ పాత్ర చుట్టూనే తిరిగేలా చేశారు. మనుషుల్ని పోలిన మనుషుల కాన్సెప్ట్ నువ్వు ఈ సినిమాలో చాలా బాగా వినియోగించారు. జిబ్రాన్ అందించిన సంగీతం పర్వాలేదు అనిపిస్తుంది. ఒక సూపర్ హిట్ సాంగ్ ని ఈ సినిమాలో రీమిక్స్ చేశారు. అది చాలా బాగా వచ్చింది. నేపథ్య సంగీతం కూడా బాగానే ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు కూడా సినిమాకి బాగానే హైలైట్ అయ్యాయి.

బలాలు:

డిఫరెంట్ కాన్సెప్ట్

సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు

కళ్యాణ్ రామ్ నటన

బలహీనతలు:

ఫస్ట్ హాఫ్ రొటీన్ గా అనిపించడం

ప్రేమ కథ

కామెడీ

త్రిల్లింగ్ ఎలిమెంట్లు లేకపోవడం

ప్రెడిక్టబుల్ కథ

చివరి మాట:

సినిమా చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం మెయిన్ హీరో మరియు హీరోయిన్ల మధ్య ప్రేమ కథ మాత్రమే ఉంటుంది. వారి మధ్య కెమిస్ట్రీ బాగానే ఉన్నప్పటికీ కొంచెం రొమాంటిక్ డోసేజ్ ఎక్కువ అయినట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్లో అసలైన కథ మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ కొంత స్లోగానే నడిచినప్పటికీ సెకండ్ హాఫ్ ఆసక్తికరంగా మారుతుంది. అయితే చాలా వరకు కథ ప్రెడిక్టబుల్ గా అనిపించటం కొంత నిరాశ కలిగిస్తుంది. కాన్సెప్ట్ బాగానే ఉన్నప్పటికీ త్రిల్లింగ్ ఎలిమెంట్లు ఎక్కువగా లేకపోవడం కూడా సినిమాకి మైనస్ పాయింట్ గా మారింది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలు కూడా అంతగా మెప్పించలేకపోయాయి. ఓవరాల్ గా "అమీగోస్" సినిమా ఎలాంటి సస్పెన్స్ లేని ఒక విభిన్న కాన్సెప్ట్ సినిమా.

బాటమ్ లైన్:

ఎలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్లు లేకపోయినప్పటికీ ఒక విభిన్న కాన్సెప్ట్ ఉన్న కథ "అమీగోస్".

Show Full Article
Print Article
Next Story
More Stories