'ఆమె' రివ్యూ

ఆమె రివ్యూ
x
Highlights

మలయాళం భామ అమలపాల్ తాజా చిత్రం ఆడై.. ఆమె అనే పేరుతో తెలుగులో విడుదల చేసారు . సినిమా విడుదలకి ముందే ఎన్నో వివాదాలు సృష్టించిన ఈ సినిమా ఈ రోజు...

మలయాళం భామ అమలపాల్ తాజా చిత్రం ఆడై.. ఆమె అనే పేరుతో తెలుగులో విడుదల చేసారు . సినిమా విడుదలకి ముందే ఎన్నో వివాదాలు సృష్టించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది . మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించిందో మన సమీక్షలో చూద్దాం..

కథ : -

ప్రస్తుతం ఉన్న జనరేషన్ కి ఎక్కువ అలవాటు పడి ఉన్న కామినికి గెలుపు తప్ప ఓటమి అంటే నచ్చదు .ఇందులో భాగంగా బెట్టింగ్స్ వేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది . ఈ క్రమంలో ఓ రోజు బాగా తాగినా కామిని ఇంటికి వెళ్ళదు . దీనితో తన కూతురు కోసం పోలీస్ స్టేషన్ లో కంప్లేంట్ చేస్తుంది కామిని తల్లి . ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఓ బంగ్లాలో కామిని ఒంటిపై నూలు పోగు లేకుండా ఉంటుంది . అసలు దీనికి గల కారణం ఎవరు ? అసలు ఆ రోజు ఎం జరిగింది అన్నది తెర పైన చూసి తెలుసుకోవాల్సిందే ..

విశ్లేషణ : -

అమలపాల్ ని మెయిన్ పాత్రలో పెట్టి ఇంతటి థ్రిల్లర్ సబ్జెక్టు ని ఎంచుకున్న దర్శకుడికి ముందుగా హాట్స్ ఆఫ్ అని చెప్పాల్సిందే .. ప్రతి సన్నివేశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించాడు . సినిమాని ఒక్క థ్రిల్లర్ సబ్జెక్ట్ గానే కాకుండా సమాజానికి ఓ చక్కటి మెసేజ్ కూడా ఇచ్చాడు . మొదటి భాగంలో కామిని పాత్ర ఇది అని చెప్పడానికి ఎంచుకున్న సన్నివేశాలు బాగున్నాయి . ఇక రెండవ భాగంలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించేలా ఉన్నాయి .

నటి నటులు : -

ఇక నటినటులు విషయానికి వచ్చే సరికి సినిమా మొత్తానికి అమలపాల్ బిగ్గెస్ట్ హైలేట్ అని చెప్పాలి . సినిమాలో ఆమె నటించింది అనడం కన్నా జీవించింది అనే చెప్పాలి. ముఖ్యంగా న్యూడ్ సన్నీవేషాల్లో అమలపాల్ నటనకి వావ్ అనకుండా ఉండలేం .. ఇక అమలపాల్ తల్లిగా శ్రీరంజిని బాగా నటించారు . మిగతా నటినటులు పాత్రల మేరకు ఒకే అనిపించారు ..

సాంకేతిక వర్గం :

సినిమాలో కెమరామెన్ వర్క్ బాగుంది .సంగీతం రొటీన్ గానే ఉన్నా నేపధ్య సంగీతం బాగుంది . ఎడిటర్ పనితనం ఒకే , నిర్మాణ విలువలు బాగున్నాయి . ఇక దర్శకుడిగా రత్నకుమార్ ఎంచుకున్న కథకి న్యాయం చేసాడనే చెప్పాలి ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories