Ugram Movie Review: 'ఉగ్రం' మూవీ రివ్యూ.. అల్లరోడు హిట్ కొట్టిన‌ట్టేనా..!

Allari Naresh Ugram Movie Review
x

Ugram Movie Review: 'ఉగ్రం' మూవీ రివ్యూ..

Highlights

Ugram Movie Review: అల్లరి నరేష్ చిత్రం అంటే కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది.

Ugram Movie Review: అల్లరి నరేష్ చిత్రం అంటే కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. అయితే గత కొంతకాలంగా ఈ కామెడీ హీరో తన రూటు మార్చి కంటెంట్ ఉన్న చిత్రాలతో వస్తున్నాడు. ఈ మధ్య నాంది చిత్రంతో అల్లరి నరేష్ తనని తాను కొత్తగా పరిచయం చేసుకున్నాడు. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావడంతో అదే పంథాను కొనసాగిస్తూ ఉగ్రం సినిమా చేశాడు. టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకులకు ఒక ఇంటెన్స్ థ్రిల్లర్ ని చూపించబోతున్నట్లు చాటిన అల్లరోడు..తాజాగా బాక్సాఫీస్ ముందుకొచ్చేశాడు. ఉగ్రంలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా అల్లరి నరేష్ నటించాడు. మరి, ఈ సినిమా కథేంటి..మూవీ ఎలా ఉంది..ఈ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కథ విషయానికొస్తే..అల్లరోడు ఒక సిన్సియర్ పోలీసాఫీసర్. ఎన్నో చిక్కుముడులు ఉన్న కేసులను ఇట్టే పరిష్కరిస్తుంటాడు. హీరోయిన్ మిర్న మీనన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వీరికి ఒక పాప పుడుతుంది. వీరి జీవితం ఇలా హాయిగా సాగిపోతున్న తరుణంలో అల్లరి నరేష్ కుటుంబానికి యాక్సిడెంట్ అవుతుంది. ఈ యాక్సిడెంట్ లో మనోడి మెమోరీ పోతుంది. అంతేకాదు, భార్య,బిడ్డ కూడా కనిపించకుండా పోతారు. అల్లరోడి భార్య, బిడ్డ తరహాలోనే సిటీలో ఎంతోమంది కనిపించకుండా పోతారు. ఇలా కనిపించకుండా పోవడానికి సిటీలోని హ్యుమన్ ట్రాఫికింగ్ ముఠాయే కారణం..ఈ ముఠా ఆగడాలకు అల్లరి నరేష్ ఎలా చెక్ పెట్టాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి..ఇదే ఉగ్రం సినిమా.

పర్ ఫార్మెన్స్ విషయానికొస్తే...ఈ సినిమా అల్లరోడి వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. ఎందుకంటే, సినిమా కథ మొత్తం అల్లరోడి చుట్టూనే తిరుగుతుంది. సీఐ శివకుమార్ గా అల్లరినరేష్ ఔట్ స్టాండింగ్ పర్ ఫార్మెన్స్ కనబరిచాడు. అల్లరి నరేష్ ఒక కామెడీ హీరో అనే ఫీలింగ్ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడికి కలగదు. అంతగా తనను తాను ట్రాన్స్ ఫర్మ్ చేసుకున్నాడు. ఇక, అతని భార్య పాత్రను పోషించిన మిర్నా తన పాత్రకు న్యాయం చేసింది. అలాగే డాక్టర్ పాత్రలో ఇంద్రజ సైతం తన మార్క్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. మిగిలిన పాత్రధారులు సైతం తమకు ఉన్న పరిధిలో చక్కగా నటించారు.

ఇక టెక్నికల్ విషయానికొస్తే..దర్శకుడు విజయ్ రాసుకున్న కథ బాగుంది. కథనాన్ని కూడా బాగానే నడిపించాడు. అయితే సినిమా ప్రారంభం కాస్త స్లోగా అనిపించినా...కథలోకి వెళ్లే కొద్దీ ప్రేక్షకుడిని ఎక్కడా బోర్ కొట్టించకుండా దర్శకుడు ముందుకుతీసుకెళ్లాడు. హీరో మిస్టరీని సాల్వ్ చేసే విధానం, కథలో వచ్చే ట్విస్టులు, ఇన్వెస్టిగేషన్ తీరు ప్రేక్షకుడిని మెప్పించే విధంగా ఉన్నాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమా స్థాయిని పెంచాయని చెప్పాలి.

ఓవరాల్ గా నాంది చిత్రంతో కమర్షియల్ సక్సెస్ ని ఖాతాలో వేసుకున్న అల్లరి నరేష్ తాజాగా తన ఉగ్రం మూవీతో కూడా మరో భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంటున్నాడనే చెప్పాలి. మాస్ ఆడియెన్స్ తో పాటు థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమాని తప్పకుండా నచ్చుతుంది..ఎందుకంటే, అల్లరోడు ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియెన్స్ ని ఇస్తాడు. ఇది గ్యారెంటీ..ఈ సినిమా స్ఫూర్తితో అల్లరి నరేష్ నుంచి ఇకపై డిఫరెంట్ సినిమాలు వస్తాయని మనం ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories