Agent Movie Review: 'ఏజెంట్‌' మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Akhil Akkineni Agent Movie Review in Telugu
x

Agent Movie Review: ‘ఏజెంట్‌’మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Highlights

Agent Movie Review: 'ఏజెంట్‌'మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

చిత్రం: ఏజెంట్

నటీనటులు: అక్కినేని అఖిల్, మమ్ముట్టి, సాక్షి వైద్యా, డినో మోరియా, మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి తదితరులు

సంగీతం: హిప్ హాప్ తమీజా పయాకేజీలను

సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్

నిర్మాత: రామ బ్రహ్మం సుంకర

దర్శకత్వం: సురేందర్ రెడ్డి

బ్యానర్లు: ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా

విడుదల తేది: 28/04/2023

హీరోగా మారిన వెంటనే వరుసగా మూడు డిజాస్టర్లు అందుకున్న అక్కినేని అఖిల్ ఈ మధ్యనే "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమాతో పర్వాలేదు అనిపించారు. తన కెరియర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అఖిల్ ఇప్పుడు తన ఆశలన్నీ "ఏజెంట్" పైన పెట్టుకున్నాడు. "సై రా నరసింహా రెడ్డి" ఫేమ్ సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. మలయాళం స్టార్ మమ్ముట్టి కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం బాగానే కష్టపడ్డ అఖిల్ ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ లుక్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మంచి అంచనాల మధ్య ఇవాళ అనగా ఏప్రిల్ 28, 2023 న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమాతో అక్కినేని యువ హీరో ఎంతవరకు హిట్ అందుకుంటాడో చూసేద్దామా..

కథ:

అఖిల్ (అక్కినేని అఖిల్) ఎప్పటినుంచో ఒక రా ఏజెంట్ అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. కానీ రా ఏజెంట్ అవ్వడానికి తన అన్ని ప్రయత్నాలు ఫెయిల్ అవుతాయి. దీంతో డెవిల్ (మమ్ముట్టి) అనే ఒక ఫేమస్ రా ఏజెంట్ వద్దకి వెళ్తాడు. డెవిల్ కి ఇండియాలో ఒక సిండికేట్ ను రన్ చేసే గాడ్ (డినో మోరియో) తో గొడవలు ఉంటాయి. డెవిల్ గాడ్ ని నాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అసలు డెవిల్ మరియు గాడ్ కి మధ్య గొడవ ఏంటి? అఖిల్ రా ఏజెంట్ అవ్వడానికి డెవిల్ సహాయం చేశాడా? తను అనుకున్నట్లు అఖిల్ రా ఏజెంట్ అవ్వగలిగాడా? డెవిల్ గాడ్ మధ్యలో ఎవరు గెలిచారు? చివరికి ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

అఖిల్ ఈ సినిమా కోసం బాగా కష్టపడినట్లు చెప్పుకోవచ్చు. ఈ సినిమా కోసం అఖిల్ కి ఒక వైల్డ్ మేక్ ఓవర్ చేశారు. పొడుగు జుట్టు, సిక్స్ ప్యాక్ లుక్ అఖిల్ కి చాలా బాగా సూట్ అయ్యాయి. వెండి తెర మీద అఖిల్ ఒక సరికొత్త అవతారంలో కనిపించాడు. యాక్షన్ సన్నివేశాలలో తో పాటే రొమాంటిక్ సన్నివేశాలలో కూడా నటన పరంగా కూడా మంచి మార్కులు వేయించుకున్నాడు. మమ్ముట్టి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మమ్ముట్టి కి ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర లభించింది. ఎప్పటిలాగానే మమ్ముట్టి తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. సాక్షి వైద్య చాలా అందంగా కనిపించింది కానీ ఆమె పాత్ర ఒక రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ గానే మిగిలిపోయింది. తాను ఉన్న సన్నివేశాలలో బాగానే కనిపించింది. డినో మోరియా మొట్టమొదటిసారిగా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆయన పాత్ర అనుకున్నంత లేకపోయినప్పటికీ నటనపరంగా బాగానే అనిపించింది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు చేయడంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డికి ఒక విభిన్నమైన స్టైల్ ఉంటుంది. ఏజెంట్ విషయంలో కూడా సురేందర్ రెడ్డి తనదైన శైలిలో యాక్షన్ సన్నివేశాలను విభిన్నంగా ప్రెజెంట్ చేశారు. అయితే షూటింగ్ మరియు ఫారన్ లొకేషన్ ల మీద పెట్టిన ఫోకస్ సురేందర్ రెడ్డి కథ మరియు స్క్రీన్ ప్లే మీద మాత్రం పెట్టలేకపోయారని చెప్పుకోవాలి. కథ చాలా రెగ్యులర్ గా అనిపిస్తుంది. ఎలాంటి కొత్తదనం లేకుండా అదే అవుట్ డేటెడ్ కథ ఈ సినిమా కోసం ఎంచుకున్నారు డైరెక్టర్. స్క్రీన్ ప్లే కూడా చాలా వరకు స్లోగా ఉండటంతో ప్రేక్షకులకు బోర్ కొట్టే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కానీ నేపథ్య సంగీతం పర్వాలేదు అనిపిస్తుంది. సంగీతం ఈ సినిమాకి నెగిటివ్ పాయింట్ గానే చెప్పుకోవాలి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమా కోసం మంచి లోకేషన్లను ఎంపిక చేసుకున్నారు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

బలాలు:

అఖిల్ విభిన్నమైన లుక్

విజువల్స్

బ్యాక్ గ్రౌండ్ లొకేషన్స్

బలహీనతలు:

కథ

స్క్రీన్ ప్లే

బోరింగ్ నెరేషన్

చివరి మాట:

సినిమా చాలా మామూలుగా మొదలవుతుంది. సినిమా ఫస్ట్ హాఫ్ లోని సన్నివేశాలు అన్నీ ఇంతకుముందు ఏదో సినిమాలో చూసినట్లుగానే కనిపిస్తాయి. రెగ్యులర్ తెలుగు కమర్షియల్ సినిమా ఫార్మేట్ లోనే ఈ సినిమా మొత్తం నడుస్తుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా ఉంటుంది. ట్రైలర్ లో అఖిల్ పాత్ర చెప్పినంత వైల్డ్ గా సినిమా అయితే లేదనే చెప్పుకోవాలి. ఇంటర్వెల్ సీన్ పర్వాలేదు అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ కూడా అంతే బోరింగ్ గా రెగ్యులర్ ఫార్మేట్ లోనే నడుస్తుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి బోరింగ్ కమర్షియల్ సినిమా రాలేదని చెప్పచ్చు. తక్కువ అంచనాల తో సినిమాకి వెళ్తే నచ్చే అవకాశాలు ఉన్నాయి.

బాటమ్ లైన్:

"ఏజెంట్" గా మరొకసారి నిరాశ పరిచిన అక్కినేని అఖిల్.

Show Full Article
Print Article
Next Story
More Stories