Major Movie Review: మేజర్ మూవీ రివ్యూ.. అడివి శేష్ కేరీర్ లోనే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్..

Adivi Sesh Major Movie First Review
x

Major Movie Review: మేజర్ మూవీ రివ్యూ.. అడివి శేష్ కేరీర్ లోనే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్..

Highlights

Major Movie Review: మేజర్ మూవీ రివ్యూ.. అడివి శేష్ కేరీర్ లోనే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్..

చిత్రం: మేజర్

నటీనటులు: అడివి శేష్, సాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ తదితరులు

సంగీతం: శ్రీ చరణ్ పాకల

సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు

నిర్మాతలు: మహేష్ బాబు, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర

దర్శకత్వం: శశి కిరణ్ తిక్క

బ్యానర్: సోనీ పిక్చర్స్, జీ ఎం బీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్

విడుదల తేది: 03/06/2022

"గూఢచారి", "ఎవరు" వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో కెరీర్ లో ముందుకు దూసుకుపోతున్న యువ హీరో అడవి శేష్ తాజాగా ఇప్పుడు "మేజర్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. "గూఢచారి" ఫేమ్ డైరెక్టర్ శశికిరణ్ తిక్క ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. సాయి మంజ్రేకర్ మరియు శోభితా ధూళిపాళ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 26/11 ముంబై ఎటాక్స్ లో చనిపోయిన అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిందో చూసేద్దామా..

కథ:

మేజర్ సినిమా కథ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఎలా చనిపోయారు అందరికీ తెలుసు కానీ ఆయన అలా బతికారు అని ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. అయితే సందీప్ ఉన్నికృష్ణన్ ఎందుకు సైనికుడిగా మారారు? ఆయన బాల్యం ఎలా గడిచింది? ఆపరేషన్ బ్లాక్ టోర్నాడో లో సందీప్ కమాండింగ్ ఆఫీసర్ గా ఎలా మారారు? ముంబైలోని తాజ్ హోటల్ లో 2008 లో జరిగిన టెర్రరిస్ట్ ఎటాక్ లో చాలామంది భారతీయ సైనికులు అక్కడున్న బందీలను ఎలా విడిపించారు? అనేదే ఈ సినిమా కథ.

నటీనటులు:

అడవి శేషు ఈ సినిమాలో వన్ మాన్ షో చేశారనీ చెప్పుకోవచ్చు. సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడవి శేష్ పూర్తిగా ఒరిగిపోయి చాలా బాగా నటించారు తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. అడవి శేషు ఈ సినిమాలో కరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కోసం అడవిశేష్ చాలా కష్టపడ్డారని సినిమా చూస్తే తెలుస్తుంది. సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులుగా ప్రకాష్ రాజ్ మరియు రేవతి చాలా అద్భుతంగా నటించారు. సాయి మంజ్రేకర్ పాత్ర కూడా చాలా బాగా కుదిరింది. చాలా వరకు ప్రేక్షకులు తన పాత్రకి బాగా కనెక్ట్ అవుతారు. శోభితా ధూళిపాళ కూడా తన పాత్ర బాగానే న్యాయం చేసింది. మురళి శర్మ నటన ఈ సినిమాకు బాగా ప్లస్సయింది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

ఈ సినిమా కోసం పనిచేసిన సాంకేతిక బృందం అద్భుతమైన అవుట్పుట్ ను ఇచ్చింది. శశికిరణ్ తిక్క నెరేషన్ ప్రేక్షకులను సినిమా కి బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. ముఖ్యంగా సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రని శశికిరణ్ వెండి తెర పైన చాలా అద్భుతంగా చూపించారు. శ్రీ చరణ్ పాకాల అందించిన సంగీతం చాలా బాగుంది. ఇప్పటికే కొన్ని పాటలు ఇన్ ఇంటర్ నెట్ లో వైరల్ గా మారాయి. శ్రీ చరణ్ అందించిన నేపథ్య సంగీతం కూడా సినిమాకి వెన్నెముక గా చెప్పుకోవచ్చు. ప్రతి సన్నివేశాన్ని నేపథ్య సంగీతం చాలా బాగా ఎలివేట్ చేసింది. వంశి పచ్చిపులుసు విజువల్స్ నీ కూడా బాగా మెచ్చుకోవాలి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు రొమాంటిక్ సన్నివేశాలు విజువల్స్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. అబ్బూరి రవి అందించిన డైలాగ్స్ కూడా సినిమాని వేరే లెవెల్ కి తీసుకు వెళ్ళాయి.

బలాలు:

అడివి శేష్

నెరేషన్

స్క్రీన్ ప్లే

డైలాగులు

సంగీతం

బలహీనతలు:

కొన్ని స్లో సన్నివేశాలు

చివరి మాట:

సినిమా చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ చిన్నతనం, కాలేజ్ డేస్ మరియు ఫ్యామిలీ గురించి ఉంటుంది. సాయి మంజ్రేకర్ తో సందీప్ ప్రేమ కథని చాలా బాగా చూపించారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండ్ హాఫ్ పై మరింత ఆసక్తిని పెంచుతుంది. కథ ముందే తెలిసినప్పటికీ దర్శకుడు తన నెరేషన్ తో సినిమాను ఎంతో ఆసక్తిగా మార్చారు. చాలా చోట్ల సినిమా కథ గతానికి ప్రస్తుతానికి మారుతూ ఉంటుంది. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ప్రేక్షకులు తమ సీట్లకు అతుక్కుపోతారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్స్ రోమాలు నిక్క పొడుచుకునే విధంగా ఉంటాయి. ఓవరాల్ గా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది.

బాటమ్ లైన్:

"మేజర్" సినిమా ప్రేక్షకుల పై మేజర్ ఇంపాక్ట్ ను కలిగించేలా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories