HIT 2 Movie Review : హిట్‌ 2 మూవీ రివ్యూ.. డబుల్ హిట్ అయ్యే సత్తా ఉన్న..

Adivi Sesh HIT 2 Telugu Movie Review
x

HIT 2 Movie Review : హిట్‌ 2 రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Highlights

* ఈ సినిమా ఒక మిస్టరీ ఇక ఈ చిత్ర ట్రైలర్ చూస్తే ఈ సినిమా కథ కూడా ఒక అమ్మాయి దారుణ హత్య చుట్టూ తిరుగుతుంది

చిత్రం: హిట్: ది సెకండ్ కేస్

నటీనటులు: అడివి శేష్, మీనాక్షి చౌదరి, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, కోమలి ప్రసాద్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు

సంగీతం: సురేష్ బొబ్బిలి

సినిమాటోగ్రఫీ: ఎస్ మణికందన్

నిర్మాతలు: ప్రశాంతి తిపిర్నేని, నాని

దర్శకత్వం: శైలేష్ కొలను

బ్యానర్: వాల్ పోస్టర్ సినిమా

విడుదల తేది: 02/12/2022

2020 లో శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా మిస్టరీ ముందు విడుదలైన ఈ సినిమా ఒక అమ్మాయి మర్డర్ చుట్టూ తిరుగుతుంది. సినిమా విడుదలైన తర్వాత మొదటి సీన్ నుంచి ఆఖరి దాకా ప్రేక్షకుల దృష్టిని కట్టిపడేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా "హిట్: ది సెకండ్ కేసు" విడుదలైంది. అడవిశేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి శైలేష్ కొలను ను దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఒక మిస్టరీ ఇక ఈ చిత్ర ట్రైలర్ చూస్తే ఈ సినిమా కథ కూడా ఒక అమ్మాయి దారుణ హత్య చుట్టూ తిరుగుతుందని చెప్పుకోవచ్చు. టీజర్ మరియు ట్రైలర్లతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన శైలేష్ కొలను ఈ సినిమాని ఇవాళ అనగా డిసెంబర్ 22న థియేటర్లలో విడుదల చేశారు మరి ఈ సినిమాతో ప్రేక్షకులు ఎంతవరకు హిట్ అందుకున్నారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

కథ:

కృష్ణదేవ్ అలియాస్ కేడి (అడవి శేష్) సంజన మర్డర్ కేస్ ను చేపడతాడు. సంజన బాడీని ఒక కిల్లర్ ముక్కలు ముక్కలుగా చేసి పడేస్తాడు. ఈ నేపథ్యంలో కేడి విచారణ మొదలుపెడతాడు. కానీ ఆ విచారణలో తెలిసేది ఏంటంటే అక్కడ దొరికిన అన్ని అవయవాలు సంజనాకి చెందినవి మాత్రమే కాదని, వేరే వేరే అమ్మాయిలకు చెందినవి అని తెలుస్తుంది. ఇంతకీ ఆ కిల్లర్ ఎవరు? కేడి ఆ కిల్లర్ ని పట్టుకోవడంలో ఎటువంటి అడ్డంకులను ఎదుర్కొన్నాడు? చివరికి కేడి ఆ కిల్లర్ ను పట్టుకున్నాడా? ఆ కిల్లర్ ఎందుకు వీళ్ళని చంపేశాడు? చివరికి ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

అడవి శేష్ ఈ సినిమాకి వెన్నెముకకు గా చెప్పుకోవచ్చు. మొదటి నుంచి సినిమాపై మంచి బజ్ పెరగడానికి గల కారణాలలో అడవి శేష్ ఎంట్రీ కూడా ఒకటి. ఈ సినిమాలో అడవిశేష్ తన పాత్ర కి తగ్గట్టుగానే చాలావరకు సన్నివేశాలలో తన సీరియస్ లుక్ తో తన పాత్రలో ఒదిగిపోయి నటించారు. మీనాక్షి చౌదరి కూడా తన నటనతో మంచి మార్కులు వేయించుకుంది. అడవి శేష్ తో మీనాక్షి చౌదరి కెమిస్ట్రీ కూడా సినిమాకి చాలా బాగా ప్లస్ అయింది. వారి మధ్య సన్నివేశాలు ఎక్కువగా లేకపోయినప్పటికీ ఉన్నంతలో మెప్పించాయి. రావు రమేష్ కూడా ఈ సినిమాలో చాలా బాగా నటించారు. తనికెళ్ళ భరణి కూడా తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. కోమలి ప్రసాద్ మరియు శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు కూడా నటనపరంగా పర్వాలేదు అనిపించారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

డైరెక్టర్ శైలేష్ కొలను సినిమా స్క్రిప్ట్ ని చాలా బాగా రాసుకున్నారు. అంతేకాకుండా దానిని ఎగ్జిక్యూట్ చేసే విధానంలో కూడా సఫలమయ్యారని చెప్పుకోవాలి. సినిమా మొదలైన దగ్గర నుంచి పూర్తయ్యేదాకా ప్రేక్షకులకు ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమా మొత్తం చాలా ఆసక్తికరంగా నడుస్తుంది. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలను చాలా బాగా చిత్రీకరించారు. మంచి కంటెంట్ ఉండడమే కాకుండా డైరెక్టర్ దానిని చాలా బాగా పోర్ట్రే చేశారు. జాన్ స్టీవార్డ్ ఏడూరి అందించిన నేపథ్య సంగీతం బాగుంది. ఏం ఏం శ్రీలేఖ పాట కూడా బావుంది. నిర్మాణ విలువలు కూడా సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యాయి. సినిమాటోగ్రాఫర్ మణికందన్ అందించిన విజువల్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. ఎడిటింగ్ చాలా బాగుంది. ఎక్కడ సాగదీసే సన్నివేశాలు లేకుండా చాలా బాగా సినిమాని ఎడిట్ చేశారు. రన్ టైం కూడా తక్కువగా ఉండటం మంచిది అయింది.

బలాలు:

సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉండడం

రన్ టైం తక్కువగా ఉండడం

నేపథ్య సంగీతం

బలహీనతలు:

ఎక్కువ హై మూమెంట్స్ లేకపోవడం

స్లో నేరేషన్

చివరి మాట:

సినిమా మొదలవటం మాత్రమే కాకుండా ప్రొసీడింగ్స్ కూడా చాలా స్లోగా ఉంటాయి. ఆ ప్రపంచంలోకి వెళ్లడానికి కొంత సమయం పట్టొచ్చు. ఫస్ట్ ఆఫ్ చాలా స్మూత్ గా గడిచిపోతుంది. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులకు సినిమాపై మరింత ఆసక్తిని కలగజేస్తుంది. అయితే సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు ప్రెడిక్టబుల్ గా అనిపించాయి. కానీ సినిమా అభ్యంతరం ప్రేక్షకులకు ఎక్కడా బోరు కొట్టించని విధంగానే ఉంది. ప్రెస్ మీట్ సన్నివేశాలు, మధ్యలో వచ్చే ట్విస్టులు కూడా బాగున్నాయి. కొన్ని సన్నివేశాలు రిపీట్ అయినట్లు అనిపిస్తాయి. ఫైనల్ ట్విస్ట్ తో కదా క్లైమాక్స్ కి వెళుతుంది. ఓవర్ ఆల్గా హిట్టు ఒక ఆసక్తికరమైన ఇన్వెస్టిగేట్టు థ్రిల్లర్గా చెప్పుకోవచ్చు. అక్కడక్కడ రెగ్యులర్గా అనిపించినప్పటికీ అంచనాలను మించి సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది.

బాటమ్ లైన్:

"హిట్ 2" టైటిల్ కి తగ్గట్టు గానే డబుల్ హిట్ అయ్యే సత్తా ఉన్న సినిమా.

Show Full Article
Print Article
Next Story
More Stories