రివ్యూ : ఆవిరి

రివ్యూ : ఆవిరి
x
Highlights

వైవిధ్యమైన కథలతో సినిమాలు చేయడం రవిబాబు శైలి... అందులో భాగంగానే అనసూయ, అవును లాంటి సినిమాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు ఆవిరి అనే మరో...

వైవిధ్యమైన కథలతో సినిమాలు చేయడం రవిబాబు శైలి... అందులో భాగంగానే అనసూయ, అవును లాంటి సినిమాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు ఆవిరి అనే మరో వైవిధ్యమైన కథతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రవిబాబు.. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో మన సమీక్షలో చూద్దాం..

కథ :

రాజ్ (రవిబాబు), లీనా (నేహా చౌహాన్) దంపతులు తమ కూతుర్లు శ్రేయ, మున్నిలతో కలిసి ఓ ఇంట్లో ఉంటారు. తమ పెద్దకూతురు శ్రేయ చనిపోవడం వల్ల ఆ భాద నుండి బయటపడేందుకు మరో ఇంటికి షిఫ్ట్ అవుతారు. కానీ ఆ కొత్త ఇంట్లో మున్ని విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. కనిపించని తన అక్కతో మాట్లాడుతూ ఉంటుంది... శ్రేయ కనిపించని రూపంలో ఆత్మగా మారి మున్నీని ఇంట్లోంచి బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలో సడన్ గా మున్ని కనబడకుండా పోతుంది. ఆసలు మున్ని ఎక్కడికి వెళ్ళింది. శ్రేయ మున్నితో ఎందుకు అలా చేస్తుంది. ఇందులో జాన్వి అనే పాత్ర ఎవరు ? రాజ్ కి దీనికి సంబంధం ఏంటి అన్నది తెరపైన చూడాలి.

ఎలా ఉందంటే ?

ఆవిరి రూపంలో ఉన్న తన అక్కతో మున్ని మాట్లాడడం, అసలు మున్ని ఇలా ఎందుకు చేస్తుంది అన్న సన్నివేశాలతో సినిమా మొదటి భాగాన్ని నడిపించాడు దర్శకుడు రవిబాబు. కానీ రీపిటేడ్ సీన్స్ తో చాలా సార్లు బోర్ కొట్టించాడు. రాజ్ మున్నిపై అరిచిన ప్రతిసారి రాజ్ పై అటాక్ జరగడం, ఇదే మున్నినే చేస్తుందని రాజ్ అనుకోవడం లాంటి సన్నివేశాలు కొంచం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. ఇక రెండవ భాగం వచ్చేసరికి మున్ని కనిపించకపోవడంతో సినిమా అసలు కథ మెయిన్ ట్రాక్ ఎక్కుతుంది. రాజ్ స్నేహితుడు పోలీసాఫీసర్ వినోద్ (ముక్తా ఖాన్), అతని ఫ్రెండ్ డాక్టర్ పవన్ శర్మ (భరణీ శంకర్) కథ లోకి ఎంట్రీ అయి మిస్సింగ్ కేసును విచారిస్తున్న సమయంలో తన భార్య లీనానే మున్నీని దాచేసిందని కనిపెట్టడం, రాజ్‌పై లీనా దాడి చేయడం,లీనాలో ఉన్న ఆత్మ జాన్వీది అని తెలుసుకోవడంతో కథ ఇంట్రెస్టెంటిగ్‌గా సాగుతుంది.

నటినటులు :

సినిమాలో కనిపించేవి కొన్ని పాత్రలు అయినప్పటికీ తెరపైన వారి ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మూడు పాత్రలు సినిమాకి ప్రాణం పోసాయి. రాజ్, లీనా, మున్నీల పాత్రలు బాగున్నాయి. రవిబాబు ఎప్పటిలాగే రాజ్ పాత్రలో ఒదిగిపోయాడు. ఆ తర్వాత మున్నిపాత్రలో శ్రీముక్త బాగా నటించింది. నేహ చౌహాన్ తన పాత్రకు న్యాయం చేసింది. మిగిలిన వారు పాత్రల మేరకు ఒకే అనిపించారు.

సాంకేతిక విభాగం:

సినిమాకి సినిమాటోగ్రఫీ ప్రధాన బలంగా నిలిచింది. ఇక వైద్య అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో భయపెట్టంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి.

గమనిక : సినిమా రివ్యూ ఒక ప్రేక్షకుడికి మాత్రమే సంబంధించినది పూర్తి సినిమాని ధియేటర్ కి వెళ్లి చూడగలరు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories