వాన సినిమాలోని పాట

vana
x
vana
Highlights

చినుకు, వాన, అందాల ప్రేయసి... ముఖ్య వస్తువుగా తయారుచేసిన పాట..ఈ ఎదుట నిలిచింది చూడు.. .

చినుకు, వాన, అందాల ప్రేయసి... ముఖ్య వస్తువుగా తయారుచేసిన పాట..ఈ ఎదుట నిలిచింది చూడు.. .

ఎదుట నిలిచింది చూడు..జలతారు వెన్నెలేమో

ఎదను తడిపింది నేడు..చినుకంటి చిన్నదేమో

మైమరచిపోయా మాయలో..

ప్రాణమంత మీటుతుంటే..వానవీణలా..ఆ..

ఎదుట నిలిచింది చూ..డు..

నిజం లాంటి ఈ స్వప్నం .. ఎలా పట్టి ఆపాలీ

కలే ఐతే ఆ నిజం .. ఎలా తట్టుకోవాలీ

అవునో..కాదో..అడగకంది నా మౌనం

చెలివో..శిలవో..తెలియకుంది నీ రూపం

చెలిమి బంధమల్లుకుందే..జన్మ ఖైదులా..ఆ....

ఎదుట నిలిచింది చూడు..

నిన్నే చేరుకోలేక..ఎటెళ్ళిందో నా లేఖా

వినేవారు లేకా..విసుక్కుంది నా కేకా

నీదో..కాదో..రాసున్న చిరునామా

ఉందో..లేదో..ఆ చోట నా ప్రేమా

వరంలాంటి శాపమేదో..సొంతమైందిలా..ఆ....

ఎదుట నిలిచింది చూడు..జలతారు వెన్నెలేమో

ఎదను తడిపింది నేడు..చినుకంటి చిన్నదేమో

మైమరచిపోయా మాయలో..

ప్రాణమంత మీటుతుంటే..వానవీణలా..ఆ....

ఎదుట నిలిచింది చూడు..

బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అంతగా ఆడకున్న కూడా ఈ పాటకి చాల పేరు వచ్చింది. మీరు ఇప్పటివరకు వినకుంటే ఒకసారి వినండి..శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories