తొట్టెంపూడి వేణు స్టైల్ వేరప్ప!

Arun Chilukuri
Published on: 1 Feb 2019 3:29 PM IST
తొట్టెంపూడి వేణు స్టైల్ వేరప్ప!
X

తొట్టెంపూడి వేణు అంటే ఎవరో మీకు తెలుసా! వేణు గా తెలుగు వారందరికీ పరిచయమున్న ప్రముఖ తెలుగు సినీ నటుడు. అయితే మొదటగా భారతీరాజా దర్శకత్వంలో ఓ సినిమాలో కథానాయకుడిగా నటించే అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా కొన్ని అవాంతరాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. వేణు స్నేహితుడైన వెంకట శ్యామ్ ప్రసాద్ ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ అనే సినీ నిర్మాణ సంస్థ స్థాపించాడు. ఆ సంస్థ సారథ్యంలో కె.విజయ భాస్కర్ దర్శకత్వంలో 1999లో వచ్చిన స్వయంవరం అనే సినిమా వేణు తొలి సినిమా. ఇందులో లయ కథానాయికగా నటించింది. లయకు కూడా ఈ సినిమా మొదటిది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. ఆ సినిమాలో నటనకు వేణుకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. తరువాత ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ సారథ్యంలోనే 2000లో వచ్చిన చిరునవ్వుతో అనే సినిమా కూడా విజయాన్ని చవిచూసింది. 2013 లో వచ్చిన రామాచారి సినిమా కూడా నటించాడు. శ్రీ.కో.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story