సుబ్బరాయ శర్మ స్టేజి నుండి స్క్రీన్ వరకు.

సుబ్బరాయ శర్మ స్టేజి నుండి స్క్రీన్ వరకు.
x
Highlights

కొద్దిమంది నటులకు వారిదంటు ఒక ప్రత్యెకమైన శైలి వుంటుంది. అలాంటి నటులే సుబ్బరాయ శర్మ. వీరు ఒక తెలుగు సినీ నటుడు. ఈయన 1982 లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన శ్రీవారికి ప్రేమలేఖ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు.

కొద్దిమంది నటులకు వారిదంటు ఒక ప్రత్యెకమైన శైలి వుంటుంది. అలాంటి నటులే సుబ్బరాయ శర్మ. వీరు ఒక తెలుగు సినీ నటుడు. ఈయన 1982 లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన శ్రీవారికి ప్రేమలేఖ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు. నాటకాల్లో, టీవీ కార్యక్రమాల్లో కూడా నటించాడు. 1993, 1996 సంవత్సరాల్లో టీవీ నంది పురస్కారాలు అందుకున్నాడు. బడిలో చదివే రోజుల్లో మిత్రుడైన సుత్తి వీరభద్రరావు తో కలిసి అనేక నాటకాలు ప్రదర్శించారు. వాటిల్లో చివరకి మిగిలేది అనే నాటకం బాగా రక్తి కట్టింది. కళాశాలలో చదివే రోజుల్లో పేషెంట్ మందు, అంతా ఇంతే, వాంటెడ్ ఫాదర్ అనే నాటకాల్లో నటించాడు. ప్రముఖ దర్శకుడు జంధ్యాల కూడా ఈయనకు కాలేజీలో సహవిద్యార్థి. కెమెరామెన్ యం.వి రఘు తో కలిసి కూడా కొన్ని నాటకాలు వేశాడు. జెమిని టివీలో ప్రసారమైన తులసీదళం సీరియల్ ద్వారా ప్రభుత్వ గుర్తింపు లభించింది. ఈ సీరియల్‌లో పైడితల్లి పాత్రకు గుర్తింపు 1993లో ఉత్తమసహాయ నటుడి అవార్డు లభించింది. రెండుసార్లు ప్రభుత్వ నంది నాటకోత్సవాలలో న్యాయనిర్ణేతగా వెళ్ళాడు. నాలుగుసార్లు నంది టివీ అవార్డుల కమిటీలో న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. 2009లో ఢిల్లీతెలుగు అకాడమీ ద్వారా లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డుతో సన్మానం పొందాడు .శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories