చలాకి హీరొయిన్ రాధిక గారు!

X
Highlights
ఒక హీరొయిన్ అన్ని రకాల పాత్రలు చెయ్యగలటం, అలాగే చాల ఉత్సాహంగా, చలాకీగా వుండగలటం ఎంతో ఉపయోగపడుతుంది, అలాంటి ఒక...
Arun Chilukuri12 Feb 2019 6:36 AM GMT
ఒక హీరొయిన్ అన్ని రకాల పాత్రలు చెయ్యగలటం, అలాగే చాల ఉత్సాహంగా, చలాకీగా వుండగలటం ఎంతో ఉపయోగపడుతుంది, అలాంటి ఒక హీరొయిన్ రాధిక గారు. ఇప్పడు రాధిక శరత్ కుమార్ ఒక ప్రముఖ తమిళ, తెలుగు చలనచిత్ర కథానాయికగా ఎంతో పేరు తెచ్చుకుంది. సన్ టీవీ ప్రేక్షకులకు ఈమె సుపరిచితం. రాడాన్ పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి ప్రస్తుతం సన్ నెట్ వర్క్ ద్వారా ప్రసారమౌతున్న చాలా తమిళ, తెలుగు ధారావాహికలను ఈమె నిర్మిస్తున్నారు. రాధ, అలనాటి తమిళ హాస్య నటుడు ఎం.ఆర్.రాధా కూతురు. ఈమె తల్లి శ్రీలంకకు చెందినది. రాధ రెండుసార్లు వివాహము చేసుకున్నది. ఈమెకు రిచర్డ్ హార్డీతో జరిగిన తొలి వివాహము ద్వారా రయాన్నే హార్డీ అనే కూతురు ఉన్నది. ఆ తరువాత తమిళ నటుడు శరత్ కుమార్ ను ద్వితీయవివాహము చేసుకున్నది. 2004లో కుమారుడు రాహుల్ జన్మించాడు...శ్రీ.కో.
Next Story