మహానాయకుడి చరిత్ర నుండి కొన్ని పేజీలు మాత్రమే!

Arun Chilukuri
Published on: 23 Feb 2019 3:31 PM IST
మహానాయకుడి చరిత్ర నుండి కొన్ని పేజీలు మాత్రమే!
X

ఒక గొప్ప వ్యక్తి గురించి తీసిన సినిమా అనగానే చాల అంచనాలే వుంటాయి, అలాంటి అంచనాలతోనే ముందుకు వచ్చిన కథానాయకుడి మీద, ఇప్పుడు వచ్చిన ఎన్టీఆర్ మహానాయకుడి సినిమా మీద కూడా వున్నాయి, అయితే తెలుగు ప్రజల ధైర్యం మరియు దైవంగా భావించే ఎన్టీఆర్ గారి పూర్తి చరిత్ర తెలుసుకోడానికి ఈ సినిమాలు ఉపయోగ పడతాయా అంటే... పూర్తిగా అవును...అని చెప్పలేం. అయితే ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకంలాంటిదాని ప్రతి తెలుగువాడికి తెలిసిందే, ఆ తెర మీద రాముడు, తెరవెనక పాలక రాముడిగా ఎన్నిమంచి, చెడులు, కష్ట, సుఖాలు చూసాడో, తెరపై చూడాలనే ఆత్రుత వుంటుంది... కాని ఈ సినిమాలో ఆ పుస్తకంలోని కొన్ని పేజీలు మాత్రమే సినిమాగా చూపెట్టాలనే ఆలోచన...ఆ మహానుభావుడి గొప్పతనాన్ని కొంతే చూపెట్టినట్టు అయ్యింది. పెద్దగా ఆశించకుండా వెళితే ఒక సారి చూడవచ్చు, కేంద్రంపై తెలుగు బిడ్డ ప్రభావం గురించి చెప్పే మంచి సినిమా.శ్రీ.కో.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story