శ్రీ శ్రీ గారు అనుకుంటే..పప్పులో కాలు వేసినట్టే!

కొన్ని పాటలు వినగానే బహుశ గీత రచయిత శ్రీశ్రీ గారేమో అనుకుంటాం, అయితే అలా అనుకునే పాట....కాని వాస్తవానికి...
కొన్ని పాటలు వినగానే బహుశ గీత రచయిత శ్రీశ్రీ గారేమో అనుకుంటాం, అయితే అలా అనుకునే పాట....కాని వాస్తవానికి ఆచార్య ఆత్రేయ గారు రాసిన పాట....ఒకటి...అది...కారులో షికారు కెళ్ళే పాట తోడికోడళ్ళు (1957) సినిమా కోసం ఆచార్య ఆత్రేయ రచించిన సందేశాత్మక లలితగీతం. ఈ గీతాన్ని ఘంటసాల వెంకటేశ్వరరావు మధురంగా గానం చేయగా మాస్టర్ వేణు సంగీతాన్ని అందించారు.
పల్లవి :
కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడిదాన
బుగ్గమీద గులాబిరంగు ఎలావచ్చెనో చెప్పగలవా | | కారులో | |
నిన్నుమించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే
వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చిచేరెను తెలుసుకో | | నిన్నుమించిన | | | | కారులో | |
చరణం 1 :
చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదానా
మేడగట్టిన చలువరాయి ఎలా వచ్చెనో చెప్పగలవా
కడుపుకాలే కష్టజీవులు ఒడలు విరిచి గనులు తొలిచి
చమట చలువను చేర్చి రాళ్ళను తీర్చినారు తెలుసుకో
కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన
నిలిచి విను నీ బడాయి చాలు
తెలుసుకో ఈ నిజానిజాలు
చరణం 2 :
గాలిలోన తేలిపోయే చీరగట్టిన చిన్నదానా
జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా
చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు
చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింక తెలుసుకో
కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన
నిలిచి విను నీ బడాయి చాలు
తెలుసుకో ఈ నిజానిజాలు.
ఈ పాటలో ఎంతో అర్ధం వుందని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే కదా! శ్రీ.కో
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
టెట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష వాయిదాపై మంత్రి సబితా కీలక ప్రకటన
21 May 2022 10:14 AM GMTసీఎం కేసీఆర్‌తో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ
21 May 2022 9:45 AM GMTRaw Milk: పచ్చిపాలు ఆరోగ్యానికి మంచివా చెడ్డవా..!
21 May 2022 9:30 AM GMTతిరుమల శ్రీవారికి అరకు లోయ పసుపు..
21 May 2022 8:45 AM GMTమళ్లీ అదే పొరపాటు చేసిన విశ్వక్ సేన్...
21 May 2022 8:30 AM GMT