Top
logo

యుగపురుషుడిగా ఎన్టీఆర్

యుగపురుషుడిగా ఎన్టీఆర్
Highlights

మహానటుడు ఎన్టీఆర్ నటించిన ఎన్నో చిత్రాలలో యుగపురుషుడు యువతరన్ని ఆకర్షించి, ఆనందాన్ని పంచిన సినిమా. ఇది 1978 లో...

మహానటుడు ఎన్టీఆర్ నటించిన ఎన్నో చిత్రాలలో యుగపురుషుడు యువతరన్ని ఆకర్షించి, ఆనందాన్ని పంచిన సినిమా. ఇది 1978 లో కె. బాపయ్య దర్శకత్వంలో విడుదలైన సినిమా. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ఎన్.టి.ఆర్., కె. బాపయ్య, అశ్వనీదత్ ల కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం 'ఎదురులేని మనిషి' తరువాత అదే కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం యుగపురుషుడు. 1978, జూలై 14న విడుదలైన ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్., జయప్రదల మధ్య శృంగార సన్నివేశాలు కొత్త తరహాలో ఉండడంతోపాటు యువతరాన్ని ఆకర్షించే అనేక అంశాలు ఉండడం ఈ చిత్రం ప్రత్యేకత. ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటించిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు. ఇప్పటివరకు ఈ సినిమా చూడకుంటే ఒక సారి చూడండి. శ్రీ.కో


లైవ్ టీవి


Share it
Top