logo
మిక్ఛర్ పొట్లం

ఆనంతభావాల అంతపురం

Anthapuram Movie
X
Anthapuram Movie
Highlights

కొన్ని పాటలలోని భావం, ఆ పాట సంగీతంతో పాటు చాల బాగా ఒదిగిపోతుంది, అలాగే చిత్రీకరణ కూడా బాగా వుంటే ఎంతో పాపులర్ అవుతుంది. అలాంటి పాటే...ఈ అసలేం గుర్తుకురాదు అనే పాట.

అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా

అసలేం తోచదు నాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడకా

అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా

అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా

నీలో ఉందీ నా ప్రాణం .. అది నీకు తెలుసునా

ఉన్నా నేనూ నీకోసం .. నువ్వు దూరమైతె బతకగలనా

ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా

గోరువెచ్చని ఊసుతో చిన్నబుచ్చకనీ .. వినిపించనీ

ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని .. చిగురించనీ

అల్లుకోమని గిల్లుతున్నది చల్ చల్లని గాలి

తెల్లవారులు అల్లలరల్లరి సాగించాలి

ఏకమై .. ఏకమయె ఏకాంతం లోకమయె వేళ

అహ జంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెలా !

అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగ

అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడక

నీలో ఉందీ నా ప్రాణం .. అది నీకు తెలుసునా

ఉన్నా నేనూ నీకోసం .. నువ్వు దూరమైతె బతకగలనా

ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా

అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా

కంటిరెప్పల చాటుగా నిన్ను దాచుకుని .. బంధించనీ

కౌగిలింతల సీమలో కోట కట్టుకుని .. కొలువుండనీ

చెంత చేరితె చేతి గాజులు .. చేసే గాయం

జంట మధ్యన సన్నజాజులు .. హాహాకారం

మళ్ళీ మళ్ళీ ..

మళ్ళీ మళ్ళీ ఈ రోజూ రమ్మన్నా రాదేమో

నిలవనీ చిరకాలమిలాగే ఈ క్షణం

అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా

అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా

నీలో ఉందీ నా ప్రాణం .. అది నీకు తెలుసునా

ఉన్నా నేనూ నీకోసం .. నువ్వు దూరమైతె బతకగలనా

ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా

అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా.

ఎప్పుడైనా ప్రశాంతంగా వినండి ఈ పాటని...మెచ్చుకోకుండా మీరు ఉండలేరు. శ్రీ.కో.

Next Story