కలం నుండి జాలువారిన ఒక ఆణి ముత్యం!

ఓ ఆణిముత్యమంటి అలివేణి... నీ కంట నీరు కూడ ఓ ముత్యమే..అంటూ సాగే మరో మధుర గీతం, వేటూరి సుందరరామ్మూర్తి గారి కలం నుండి జాలువారిన ఒక ఆణి ముత్యం ఈ పాట.

Arun Chilukuri
Published on: 8 Jan 2019 4:58 PM IST
Mudda Mandaram Movie
X
Mudda Mandaram Movie

ఓ ఆణిముత్యమంటి అలివేణి... నీ కంట నీరు కూడ ఓ ముత్యమే..అంటూ సాగే మరో మధుర గీతం, వేటూరి సుందరరామ్మూర్తి గారి కలం నుండి జాలువారిన ఒక ఆణి ముత్యం ఈ పాట.

అతడు :

అలివేణీ ఆణిముత్యమా

నీ కంట నీటి ముత్యమా

ఆవిరి చిగురో ఇది ఊపిరి కబురో

స్వాతి వాన లేత ఎండలో

జాలినవ్వు జాజి దండలో

ఆమె :

అలివేణీ ఆణిముత్యమా

నా పరువాల ప్రాణముత్యమా

జాబిలి చలువో ఇది వెన్నెల కొలువో

స్వాతి వాన లేత ఎండలో జాజిమల్లి పూలగుండెలో

అతడు : అలివేణీ ఆణిముత్యమా

చరణం 1:

కుదురైన బొమ్మకీ కులుకు మల్లెరెమ్మకీ ॥2॥

నుదుట ముద్దు పెట్టనా బొట్టుగా

వద్దంటే ఒట్టుగా!

అందాల అమ్మకీ కుందనాల కొమ్మకీ ||2||

అడుగు మడుగులొత్తనా మెత్తగా

అవునంటే తప్పుగా!

అలివేణీ ఆణిముత్యమా

నా పరువాల ప్రాణముత్యమా

చరణం: 2 :

పొగడ లేని ప్రేమకీ పొన్న చెట్టు నీడకీ ॥2॥

పొగడ దండలల్లుకోనా పూజగా

పులకింతల పూజగా!

తొలిజన్మల నోముకీ దొరనవ్వుల సామికీ ॥2॥

చెలిమై నేనుండిపోనా చల్లగా

మరుమల్లెలు చల్లగా!

అలివేణీ ఆణిముత్యమా

నీ కంట నీటి ముత్యమా ఆఆ ఆఆ...

జాబిలి చలువో ఇది వెన్నెల కొలువో

స్వాతి వాన లేత ఎండలో జాజిమల్లి పూలగుండెలో

అలివేణీ ఆణిముత్యమా

అలివేణీ ఆణిముత్యమా

ఇప్పటి వరకు ఈ పాట వినకుంటే తప్పకుండ ఒక సారి వినండి . శ్రీ.కో.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story