Union Budget 2025 Live Updates: రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండబోదన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

Union Budget 2025 Live Updates: నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం వరుసగా ఇది 8వ సారి.

Budget 2025 Income Tax Expectations Live: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం వరుసగా ఇది 8వ సారి. మొరార్జీ దేశాయ్, పి చిదంబరం తరువాత అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రిగా ఆమె తన పేరు సుస్థిరం చేసుకున్నారు. అయితే, ఈ కేంద్ర బడ్జెట్‌పై దేశ ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.

అధికారంలో ఎవరు ఉన్నారు అనే విషయంతో సంబంధం లేకుండా బడ్జెట్ వస్తోందంటే చాలు... ప్రతీసారి కార్పొరేట్ వర్గాల నుండి కామన్ మ్యాన్ వరకు అందరి ఆశ ఒక్కటే ఉంటుంది. ఈసారి బడ్జెట్‌లో తమకు ఎలాంటి మేలు కలుగుతుందా అని కార్పొరేట్ వర్గాలు, ఈసారైనా బడ్జెట్ తమకేమైనా పనికొస్తుందా అని జనం ఎదురుచూస్తునే ఉంటారు.

ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్ పెంచితేనే తమ జేబుకు పన్ను రూపంలో చిల్లు పడకుండా ఉంటుందని సామాన్యులు ఆశపడుతున్నారు. అంతేకాకుండా తమ రోజువారీ జీవితంలో పనికొచ్చే అనేక రకాల ఉత్పత్తులు, సేవలపై పన్ను భారం తగ్గించాలని వారు కోరుకుంటున్నారు. వివిధ రంగాల్లో ప్రోత్సాహకాల కింద ప్రభుత్వం ఇచ్చే సబ్సీడీలు పెంచాలని ఆశిస్తున్నారు. మరి సామాన్యులు కోరికలను ప్రభుత్వం పట్టించుకుంటుందా లేదా ? ఈ బడ్జెట్ ఎవరికి అనుకూలంగా ఉంటుందనే పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు అందిస్తూ మీ కోసమే ఈ బడ్జెట్ న్యూస్ లైవ్ అప్‌డేట్స్. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం దయచేసి పేజ్ రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

Live Updates

  • 1 Feb 2025 10:33 AM IST

    బడ్జెట్‌కు కేంద్ర మంత్రి మండలి ఆమోదం

    యూనియన్ బడ్జెట్‌కు కేంద్రమంత్రి మండలి ఆమోదం

  • 1 Feb 2025 10:12 AM IST

    రాష్ట్రపతిని కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రి

    రాష్ట్రపతిని కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

    కాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారమన్

    బడ్జెట్‌కు ముందు రాష్ట్రపతిని కలిసిన ఆర్థికమంత్రి

  • 1 Feb 2025 10:10 AM IST

    కేంద్ర బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్‌

    మరికొద్ది గంటల్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌ కోసం దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తెలుగు ప్రజలు కేంద్ర బడ్జెట్‌పై కోటి ఆశలు పెట్టుకున్నారు. అందునా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆశలన్నీ కేంద్రంపైనే ఉన్నాయి. ఎందుకంటే ఈసారి ఏపీలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ నడుస్తోంది కాబట్టి ప్రజలు, నాయకుల అంచనాలు కూడా రెట్టింపయ్యాయి.

  • 1 Feb 2025 10:09 AM IST

    కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ ప్రభుత్వం గంపెడు ఆశలు

    నిర్మలమ్మ బడ్జెట్‌.. తెలంగాణ సర్కార్‌కు భారీ ఆశలు రేపుతోంది. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి ప్రాజెక్టుల నిధుల కోసం కేంద్రం నుంచి సాయం కోసం ఎదురుచూస్తోంది. కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనల్లో రాష్ట్రానికి కోటీ 63 లక్షల కోట్ల నిధులు కేటాయించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోరుతోంది. మరికొద్ది గంటల్లో కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్... తెలంగాణకు ఏవిధంగా న్యాయం చేయగలదో చూడాలి.

  • 1 Feb 2025 10:08 AM IST

    కాసేపట్లో కేంద్ర కేబినెట్‌ సమావేశం

    పార్లమెంట్‌లోనే భేటీకానున్న కేబినెట్‌

    బడ్జెట్‌ను ఆమోదించనున్న కేబినెట్‌

  • 1 Feb 2025 10:07 AM IST

    కాసేపట్లో పార్లమెంట్ ముందుకు కేంద్ర బడ్జెట్ 2025-26

    లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్

    ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్

    2025 కేంద్ర బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

    కేంద్ర బడ్జెట్‌పై పేదలు, మధ్య తరగతి, వేతన జీవుల ఆశలు

    పీఎం కిసాన్‌, ఆయుష్మాన్‌ భారత్‌..

    పథకాల కొనసాగింపు.. కొత్త పథకాలపై ఆసక్తి

    వ్యవసాయ, అనుబంధ రంగాలకు కేటాయింపులపై ఉత్కంఠ

    కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి రూ.5 లక్షలకు పెంచే అవకాశం

    విత్తనాలు, ఎరువులపై GST తగ్గించే ఛాన్స్

    పన్ను మినహాయింపు పరిధి రూ.75 వేల వరకు పెంచే ఛాన్స్‌

    జల్‌ జీవన్‌ మిషన్‌, పీఎం ఆవాస్ యోజన‌కు కేటాయింపులు పెరుగుతాయా..?

    మోడీ మార్క్ పథకాలకు మరిన్ని తోడయ్యేనా..?

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story