Union Budget 2025 Live Updates: రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండబోదన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

Budget 2025 Income Tax Expectations Live: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం వరుసగా ఇది 8వ సారి. మొరార్జీ దేశాయ్, పి చిదంబరం తరువాత అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రిగా ఆమె తన పేరు సుస్థిరం చేసుకున్నారు. అయితే, ఈ కేంద్ర బడ్జెట్‌పై దేశ ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.
అధికారంలో ఎవరు ఉన్నారు అనే విషయంతో సంబంధం లేకుండా బడ్జెట్ వస్తోందంటే చాలు... ప్రతీసారి కార్పొరేట్ వర్గాల నుండి కామన్ మ్యాన్ వరకు అందరి ఆశ ఒక్కటే ఉంటుంది. ఈసారి బడ్జెట్‌లో తమకు ఎలాంటి మేలు కలుగుతుందా అని కార్పొరేట్ వర్గాలు, ఈసారైనా బడ్జెట్ తమకేమైనా పనికొస్తుందా అని జనం ఎదురుచూస్తునే ఉంటారు.
ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్ పెంచితేనే తమ జేబుకు పన్ను రూపంలో చిల్లు పడకుండా ఉంటుందని సామాన్యులు ఆశపడుతున్నారు. అంతేకాకుండా తమ రోజువారీ జీవితంలో పనికొచ్చే అనేక రకాల ఉత్పత్తులు, సేవలపై పన్ను భారం తగ్గించాలని వారు కోరుకుంటున్నారు. వివిధ రంగాల్లో ప్రోత్సాహకాల కింద ప్రభుత్వం ఇచ్చే సబ్సీడీలు పెంచాలని ఆశిస్తున్నారు. మరి సామాన్యులు కోరికలను ప్రభుత్వం పట్టించుకుంటుందా లేదా ? ఈ బడ్జెట్ ఎవరికి అనుకూలంగా ఉంటుందనే పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు అందిస్తూ మీ కోసమే ఈ బడ్జెట్ న్యూస్ లైవ్ అప్‌డేట్స్. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం దయచేసి పేజ్ రిఫ్రెష్ చేస్తూ ఉండండి.
Live Updates
- 1 Feb 2025 7:10 AM GMT
స్టార్టప్ సంస్థలకు 5 ఏళ్ల పాటు ప్రోత్సాహకాల కొనసాగింపు
స్టార్టప్ సంస్థలు ఏర్పడినప్పటి నుండి వరుసగా 5 ఏళ్ల పాటు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
- 1 Feb 2025 6:57 AM GMT
New tax regime - కొత్త ట్యాక్స్ పాలసీ ప్రకారం:
రూ. 4 లక్షల ఆదాయంపై ఎలాంటి పన్ను వసూలు చేయరు.
రూ. 4-8 లక్షల ఆదాయంపై - 5% పన్ను వసూలు చేస్తారు.
రూ. 8-12 లక్షల ఆదాయంపై - 10% పన్ను వసూలు చేస్తారు.
రూ. 12-16 లక్షల ఆదాయంపై - 15% పన్ను వసూలు చేస్తారు.
రూ. 16-20 లక్షల ఆదాయంపై - 20% పన్ను వసూలు చేస్తారు.
రూ. 20-25 లక్షల ఆదాయంపై - 25% పన్ను వసూలు చేస్తారు.
రూ. 25 లక్షల ఆదాయంపై - 30% పన్ను వసూలు చేస్తారు.
- 1 Feb 2025 6:46 AM GMT
No income tax up to Rs12 lakhs - Nirmala Sitharaman in her Budget speech
రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండబోదన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
#WATCH | "No Income Tax payable up to an income of Rs 12 Lakh. Slabs and rates being changed across the board to benefit all tax-payers," announces FM Nirmala Sitharaman.
— ANI (@ANI) February 1, 2025
She further says, "...I propose to revise tax rate structures as follows: 0 to Rs 4 Lakhs - nil, Rs 4 Lakhs… pic.twitter.com/fs29THlzxO - 1 Feb 2025 6:43 AM GMT
అద్దె రూపంలో వచ్చే ఆదాయంపై ఇప్పటి వరకు ఉన్న రూ. 2.4 లక్షల టీడీఎస్ పరిమితిని రూ. 6 లక్షలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం
- 1 Feb 2025 6:40 AM GMT
లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ మినహాయిస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం
Cancer, chronic diseases - 36 life-saving drugs exempted from basic customs duty
క్యాన్సర్‌తో పాటు ఇతర ప్రాణాంతక జబ్బుల చికిత్సలో ప్రాణాలు రక్షించే 36 రకాల లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌ను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుండి మినహాయిస్తున్నట్లు కేంద్రం స్పష్టంచేసింది. దీంతో ఆయా జబ్బులకు చికిత్స తీసుకుంటున్న వారికి అవసరమయ్యే మందుల కొనుగోలు భారం కొంతమేరకు తగ్గే అవకాశం ఉంది.
అయితే 6 రకాల లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌పై మాత్రం 5 శాతం ఉంటుందని కేంద్రం వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 1 Feb 2025 6:34 AM GMT
ఇన్సూరెన్స్ సెక్టార్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతిస్తున్నట్లు కేంద్రం స్పష్టంచేసింది. (100% FDIs in insurance sector ) .
- 1 Feb 2025 6:28 AM GMT
యుద్ధ ప్రాతిపదికన 1 లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం కోసం 15000 కోట్ల నిధుల కేటాయింపు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



