Live Updates: ఈరోజు (14 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 14 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 14 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | ద్వాదశి ఉ.08-20 వరకు తదుపరి త్రయోదశి | పుబ్బ నక్షత్రం రా.06-56 వరకు తదుపరి ఉత్తర | వర్జ్యం: రా.01-43 నుంచి 03-13 వరకు | అమృత ఘడియలు మ.12-49 నుంచి 01-18 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-17 నుంచి 12-10 వరకు | రాహుకాలం: మ.12-30 నుంచి 01-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 14 Oct 2020 11:22 AM IST
Amaravati updates: కరోనా చికిత్స పొందుతున్న శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ...
అమరావతి....
-బెంగుళూరు మణిపాల్ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతున్న ప.గో.జిల్లా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ.
-నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నా.కుటుంబ సభ్యుల సూచన మేరకు ముందస్తు జాగ్రత్త కోసం మాత్రమే ఆసుపత్రిలో చేరడం జరిగింది.
-నేను ఆసుపత్రిలో ఉన్నా సరే తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నా.
-వర్షాలు అధికంగా కురవడం, ఎర్రకాలువ ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. ముందుగానే అధికారులను అప్రమత్తం చేస్తూ సమన్వయం చేస్తున్నా.
-ప్రజలు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నా.
-ఉదయం 11 గంటలకు నియోజకవర్గ పరిధిలోని అన్ని డిపార్ట్మెంట్ ల అధికారులతో కార్యాచరణపై జూమ్ యాప్ లో వీడియో కాలింగ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నా.
-దయచేసి ఎవరూ బయపడవల్సిన పనిలేదు.సంపూర్ణ ఆరోగ్యంతో కొద్దిరోజుల లొనే తిరిగి వచ్చేస్తా.
-కొట్టు సత్యనారాయణ(శాసనసభ్యులు,ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్)
- 14 Oct 2020 10:28 AM IST
Krishna District updates: గన్నవరం మండలం కేసరపల్లిలో డివైడర్ ఎక్కిన కారు...
కృష్ణాజిల్లా...
-నిద్ర మత్తులో డ్రైవింగ్ చేసిన డ్రైవరు
-పరారీలో డ్రైవర్
-గంజాయి లోడుతో నిండి ఉన్న కారు
-కారు నంబరు AP11X5152 ఆధారంగా దర్యాప్తు
- 14 Oct 2020 10:23 AM IST
Krishna River updates: ఎగువ నుంచి కృష్ణానదికి పెరుగుతున్న వరద ఉధృతి...
విజయవాడ..
-వరద ఉధృతి పై అధికారులను అప్రమత్తం చేసిన కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ .
-ఉదయం 9.00 గంటలకు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ
-ప్రస్తుత ఇన్ ఫ్లో 5,64,770, అవుట్ ఫ్లో 5,64,604 క్యూసెక్కులు
-వరద ముంపు ప్రభావిత అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్.
-చంద్రర్లపాడు నుంచి ఇబ్రహీంపట్నం వరకు తహసీల్దార్ల్ అప్రమత్తంగా ఉండాలి.
-చినలంక, పెదలంక ప్రాంతాల్లో పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.
-పులిచింతల ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో 6,46,747,అవుట్ ఫ్లో 5,34,933 క్యూసెక్స్.
-కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
-వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదు.
-వరద నీటిలో ఈతకు వెళ్ళడం, పశువులు-గొర్రెలు వదలడం లాంటివి చేయరాదు .
- 14 Oct 2020 10:07 AM IST
Visakha Weather updates: మరో నాలుగు రోజుల పాటు ఏపి లో వర్షాలు...
విశాఖ...
-మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం...
-ఇది క్రమంగా తెలంగాణ మీదకు గంటకు 17 కీ.మీ వేగంతో పయనిస్తోంది.
-దీని ప్రభావంతో తెలంగాణలో నేడు అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల కుంభవృష్టి ఉంటాయి.
-ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు...
-రాయలసీమలో కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు..
-మత్స్యకారులు కు కొనసాగుతున్న హెచ్చరికలు...
-తీరం వెంబడి గంట కు 55-65 కీ మీ వేగం తో గాలులు..
-సముద్రం లో అలల 4.5 మీటర్ల ఎత్తుకు ఎగసిపడే అవకాశం..
- 14 Oct 2020 8:35 AM IST
Visakha Weather updates: భారీ వర్షాల కారణంగా మేహాద్రి జలాశయంలో గరిస్ట స్థాయికి నీటీ మట్టం...
విశాఖ..
-345 క్యూసెక్కులు నీటీనీ దిగువకు విడుదల చేసిన అధికారులు.
-గరిష్ట నీటి మట్టం 60 అడుగులు..
-ప్రస్తుతం 59.7 అడుగులకు అంఈరు చేరడంతో గేట్లు ఎత్తి నీటీనీ విడుదల ఛేసిన అధికారులు
- 14 Oct 2020 8:07 AM IST
Tirumala updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు..
తిరుమల సమాచారం..
-నిన్న శ్రీవారిని దర్శించుకున్న 17,977 మంది భక్తులు
-తలనీలాలు సమర్పించిన 6,037 మంది భక్తులు
-నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.62 కోట్లు
- 14 Oct 2020 7:43 AM IST
Rajahmundry Weather updates: భారీ వర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తున్న పోలవరం, పుష్కర కాలువలు..
తూర్పుగోదావరి -రాజమండ్రి -జగ్గంపేట..
-జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో భారీ వర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తున్న పోలవరం, పుష్కర కాలువలు.
-రామవరం వద్ద జాతీయ రహదారిపై నుంచి దాటి గ్రామాన్ని ముంచెత్తుతున్న నీరు
-భయం గుప్పెట్లో రామవరం పరిసర గ్రామాల ప్రజలు
-జాతీయరహదారిపై పెద్దవాహనాలు మినహా చిన్నవాహానాలు వెళ్ళలేని పరిస్థితి...
-రాకపోకలకు తీవ్ర అంతరాయం










