Live Updates: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ తొలిదశ ఎన్నికలు లైవ్ అప్ డేట్స్
AP Panchayat Elections 2021 Live Updates: ఏపీలో పంచాయతీ ఎన్నికలు మొదలయ్యాయి. తొలిదశలో 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీల్లో ఈరోజు ఉదయం పోలింగ్ ప్రారంభం అయింది. పంచాయతీ ఎన్నికల విశేషాలు ఎప్పటికప్పుడు మీకోసం లైవ్ అప్ డేట్స్ అందిస్తోంది హెచ్ఎంటీవీ.
Live Updates
- 9 Feb 2021 10:00 AM IST
AP Panchayat Elections 2021 Live Updates
ఏపీ పంచాయతీ ఎన్నికలకు మొత్తం 29,732 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 3,458 సమస్యాత్మకం గానూ, 3,594 అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. పోలింగ్ కోసం 1,130 మంది ఎన్నికల అధికారులు, మరో 3,249 మంది స్టేజ్-2 అధికారులు, 1,432 మంది సహాయ ఎన్నికల అధికారులు, 33,533 మంది ప్రిసైడింగ్ అధికారులు, 44,392 మంది సిబ్బంది సేవలు వినియోగించుకుంటున్నారు. 519 మంది జోనల్ అధికారులు, పోలింగ్ సరళి పరిశీలించేందుకు 1,221 మంది పర్యవేక్షకులు, 3,047 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు.
Next Story



