Top
logo

live blog : ఈరోజు (మే-23-శనివారం) తాజా వార్తలు..ఎప్పటికప్పుడు!

live blog : ఈరోజు (మే-23-శనివారం) తాజా వార్తలు..ఎప్పటికప్పుడు!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 23 మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం...

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 23 మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు తాజావార్తలు

Web TitleLatest news today 23rd May 2020 live news blog in Telugu with breaking news of Telangana and Andhrapradesh

Live Updates

 • 23 May 2020 6:12 PM GMT

  ఏపీ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ నియామకం

  ▪️YSR ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గా డా.బుచ్చిపుడి సాంబశివరెడ్డి నియామకం.

  ▪️నూతనంగా ఎంపికైన సాంబశివ రెడ్డికి నెలకు రూ. 2 లక్షల వేతనంతో పాటు ఇతర అలవెన్సులు కలిపి రూ.3,82,000 ప్రభుత్వం చెల్లించనుంది.

 • 23 May 2020 4:03 PM GMT

  తెలంగాణా మేడ్చల్ జిల్లలో యువతిని వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తి అరెస్ట్

  - ఎమ్మెల్సీ కొడుకునంటూ పరిచయం చేసుకున్న భరత్..

  - 15 లక్షల రూపాయలు ఇవ్వాలని లేదంటే ఫొటోస్ సోషల్ మీడియాలో పెడుతానంటూ బెదిరింపు కాల్స్...

  - మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆవేదన.

  - నాలుగు నెలల క్రితం ఎమ్మెల్సీ కొడుకు అని చెప్పి పరిచయం అయిన నోముల భరత్ గౌడ్.

  - పరిచయం అనంతరం పలు వేధింపులకు గురైన యువతి , చివరకు పోలీసులకు ఫిర్యాదు.

  - పోచంపల్లి గ్రామానికి చెందిన నిందితుడు నోముల భరత్ గౌడ్ పై పలు సెక్షన్ ల కింద కేస్ నమోదు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు

 • 23 May 2020 4:02 PM GMT

  తెలంగాణలో కొత్తగా 52 కరోనా కేసులు

  -జీహెచ్‌ఎంసీ పరిధి నుంచే 33 కేసులు వచ్చాయి.

  -ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 19 మందికి పాజిటివ్‌.

  -తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1813కి చేరింది.

  -కరోనాతో పోరాడి ఇప్పటివరకు 49మంది చనిపోయారు.

 • 23 May 2020 2:49 PM GMT

  సీఎం జగన్ ను కలిసిన 2019 బ్యాచ్‌ ఏపీ కేడర్‌కు చెందిన ప్రొబేషనరీ ఐఏఎస్‌లు

  - ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను 2019 బ్యాచ్‌ ఏపీ కేడర్‌కు చెందిన ప్రొబేషనరీ ఐఏఎస్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు.

  -ఈ సందర్భంగా యువ ఐఏఎస్‌ అధికారులను సీఎం అభినందించారు.

  - నిబద్ధత గల అధికారులుగా ప్రజలకు మంచి సేవలందిండం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్న సీఎం ఆకాంక్షిచారు.

  - పూర్తి వివరాలు 

 • 23 May 2020 2:46 PM GMT

  - మంచిర్యాల జిల్లా  కాసిపేట మండలంలోని కొత్త వరిపేట గ్రామంలో రూ. 82,500 విలువ గల 50 కిలోల నిషిదిత నకిలీ పత్తి విత్తనాల స్వాధీనం.

  - ఒకరిపై కేసు నమోదు చేసిన పోలీసులు.

 • 23 May 2020 2:45 PM GMT

  మహారాష్ట్రలో 24 గంటల్లో 63 మంది మరణం

  - మహారాష్ట్రలో గత 24 గంటల్లో కరోనావైరస్ కారణంగా 63 మంది మరణించారు.

  - రాష్ట్రంలో మరణాల సంఖ్య 1517 కు చేరింది.

  - అదే సమయంలో దేశంలో ఇప్పటివరకు 3 వేల 583 మంది సంక్రమణ కారణంగా మరణించారు.

  - అంటే, దేశంలో చోటుచేసుకున్న మరణాలలో 42.3% మహారాష్ట్రలోనే నమోదయినట్టయింది.

  - పూర్తి కధనం 

 • ఏలేరు కాలవలో స్నానికి వెళ్లి ఇద్దరి మృతి
  23 May 2020 1:26 PM GMT

  ఏలేరు కాలవలో స్నానికి వెళ్లి ఇద్దరి మృతి

  - తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం మల్లవరం లో ఏలేరు రిజర్వాయర్ లో స్నానానికి దిగిన నలుగురు విద్యార్థులు.

  - అందులో ఇద్దరు మృతి.

  - వీరు పెద్దాపురం మహారాణి కళాశాల డిగ్రీ విద్యార్థులు.

   


 • 23 May 2020 1:22 PM GMT

  - ప్రకాశంజిల్లా, ఎర్రగొండపాలెం మండలం, చెన్నుపల్లి చెంచు గూడెం సమీపంలోని నల్లమల అడవి ప్రాంతంలో పెద్ద పులి మృతి .

  - సంఘటన స్థలాన్ని పరిశీలించి వెటర్నరీ డాక్టర్ చేత పంచనామా నిర్వహింహించిన మార్కపురం ఫారెస్ట్ DFO.ఖాదర్ బాషా.

  - ఈ పెద్ద పులి వయస్సు 20 సం.ఉంటుంది. ముసలితనంతో చనిపోయిందని DFO షేక్ ఖాదర్ భాష తెలిపారు..

   


 • 23 May 2020 12:52 PM GMT

  - జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం సమీపంలోని ఎర్రకాల్వ జలాశయం లో ఈతకు దిగి గొల్లపల్లి అన్వేష్ (26) అనే వ్యక్తి గల్లంతు.

  - స్నేహితుడి పెండ్లి రోజు సందర్భంగా 15 మంది స్నేహితులు ఎర్ర జలాశయం వద్ద పార్టీ చేసుకునేధందుకు వచ్చి జలాశయంలోకి ఈతకు దిగడంతో ఈ దుర్ఘటన జరిగి ఉండవచ్చని అభిప్రాయపడుతున్న పోలీసులు

  - మృతదేహం కోసం గాలిస్తున్న పోలీసులు.

 • 23 May 2020 9:59 AM GMT

  లాక్ డౌన్ సమయంలో స్వాధీనం చేసుకున్న వాహనాలు తీసుకెళ్లవచ్చు.. ఏపీ డీజీపీ

  - ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించి స్వాధీనం చేసుకున్న వాహనాలను తిరిగి పొందవచ్చు : డీజీపీ

  - వాహనాలకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలను సంబంధిత పోలీస్ స్టేషన్ లో సమర్పించాల్సి ఉంటుంది : డీజీపీ

  - ఆ మేరకు ఇప్పటికే జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశాం : డీజీపీ

  - వాహన యజమానులు సంబంధిత పోలీస్ స్టేషన్ లో సంప్రదించగలరు : డీజీపీ

Next Story