JC Prabhakar Reddy tests corona positive: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్

JC Prabhakar Reddy tests corona positive: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.

K V D Varma
Published on: 19 Aug 2020 8:00 AM IST
JC Prabhakar Reddy tests corona positive: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్
X

- ఆందోళనలో జెసి అభిమానులు

- ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స అందిస్తున్న కడప సెంట్రల్ జైలు అధికారులు

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఒక్కసారిగా జేసీ అభిమానులు భయాందోళనకు గురవుతున్నారు. ఆయనను కడప సెంట్రల్ జైల్ లో ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు జైలు అధికారుల ద్వారా తెలుస్తోంది. తాను జైల్లో ఉండటం ద్వారా తనకు కరోనా సంక్రమించే అవకాశాలు ఉన్నట్లు ఒక కేసులో బెయిల్పై వచ్చి న అనంతరం ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. అనుకున్నట్లే జరిగిందని... ఆయనకు పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యపరిస్థితిపై ఆయన అభిమానులు, తెలుగుదేశం వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి అచ్చం నాయుడు కు జైల్లో ఉండటం ద్వారా కరోనా సంక్రమించిన విషయం తెలిసిందే. జేసీ ప్రభాకర్ రెడ్డిని మెరుగైన చికిత్స కోసం కార్పొరేట్ ఆస్పత్రికి తరలించాలని ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై కోర్టుకు విన్నవించను న్నట్లు ఆయన కుమారుడు అష్మిత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నా తండ్రి బైపాస్ సర్జరీ చేయించుకున్నారని, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

K V D Varma

K V D Varma

Next Story