Daily Horoscope: ఈరోజు మీరోజు! సెప్టెంబర్ 14 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! సెప్టెంబర్ 14 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 14 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | ద్వాదశి (రా. 10-01వరకు) తదుపరి త్రయోదశి | పుష్యమి నక్షత్రం (మ. 1-22 వరకు) తదుపరి ఆశ్లేష | అమృత ఘడియలు: ఉ.6-57 నుంచి 8-33 వరకు | వర్జ్యం: రా.1-55 నుంచి 3-30 వరకు | దుర్ముహూర్తం: మ.12-20 నుంచి 1-09 వరకు తిరిగి మ. 2-47 నుంచి 3-36 వరకు | రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.5-50 సూర్యాస్తమయం: సా.6-03

ఈరోజు రాశి ఫలాలు

మేషం: కొత్త పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

వృషభం: సన్నిహితులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

మిథునం: కొత్త పనులు చేపడతారు. పాతమిత్రులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడులు తొలగుతాయి.

కర్కాటకం: పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.

సింహం: చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆస్తివివాదాలు కొలిక్కి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పనులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.

కన్య: పనులలో పురోగతి. సోదరుల సలహాలు స్వీకరిస్తారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

తుల: రుణాలు చేస్తారు. ఆత్మీయులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సామాన్యంగా ఉంటుంది.

వృశ్చికం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

ధనుస్సు: శుభకార్యాలకు హాజరవుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవదర్శనాలు. విందువినోదాలు. ఆస్తి, ధనలాభాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.

మకరం: ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. పనుల్లో జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులు, మిత్రులతో వివాదాలు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో చికాకులు.

కుంభం: శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. పనులు వాయిదా. దూరప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

మీనం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. విచిత్ర సంఘటనలు. బాకీలు వసూలవుతాయి. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

Show Full Article
Print Article
Next Story
More Stories