Live Blog: ఈరోజు (మే-24-ఆదివారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 24మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 24మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా వేడి గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది. బయటకు వెళ్ళినపుడు తగిన జాగ్రతలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఈరోజు తాజా సమాచారం
Live Updates
- 24 May 2020 7:56 AM IST
ఏపీలో 'మన పాలన-మీ సూచన' రేపటి నుంచి!
ఏపీ ప్రభుత్వం నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది.
జగన్ సర్కార్ కొలువుదీరి ఏడాది కావడంతో.. ఈ నెల 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ప్రభుత్వ పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాలపై 'మన పాలన-మీ సూచన' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రణాళికశాఖ ఎక్స్‌అఫిషియో కార్యదర్శి విజయకుమార్ వెల్లడించారు.
- 24 May 2020 7:31 AM IST
సోమవారం ఆంధ్రప్రదేశ్ కు వెళ్లనున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు
సోమవారం ఆంధ్రప్రదేశ్ కు బయల్దేరనున్న టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
★ మార్చి 20 నుంచి నాలుగు వరుస లాక్‌డౌన్‌లతో ఏపీకి చంద్రబాబు దూరం.
★ ఏపీ వెళ్లేందుకు అనుమతి కోరుతూ చంద్రబాబు దరఖాస్తు.
★ ఏపీ, తెలంగాణ డీజీపీలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు.
★ తెలంగాణ ప్రభుత్వం నుంచి వెంటనే అనుమతి.
★ చంద్రబాబుకు ఏపీ ప్రభుత్వం నుంచి ఇంకా రాని అనుమతి. -పూర్తి వివరాలు





