ఈరోజు (మే-22-శుక్రవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 22మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
నిన్నటి ముఖ్యాంశాలు కొన్ని..
- రంగనాయకమ్మ సరైన కారణాలు చెప్పలేకపోయారు : సీఐడీ - మరిన్ని వివరాలు
- తెలంగాణలో మరో 38 మందికి కరోన పాజిటివ్ - మరిన్ని వివరాలు
- ఏపీలో షాపులు ఓపెన్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్... కండిషన్లు ఇవే! - మరిన్ని వివరాలు
ఈరోజు తాజా సమాచారం
Live Updates
- 22 May 2020 7:04 AM IST
అంధ్ర ప్రదేశ్ లో సాధారణ పరిస్థితులు
సుదీర్ఘ లాక్ డౌన్ ఆంక్షలు సడలించడంతో ఆంధ్ర ప్రదేశ్ లో ఇంచుమించుగా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.
-ఆర్టీసీ బస్సులను తిప్పడంతో బస్సు ప్రయాణాలు ఎక్కువగానే జరిగాయి.
- మొత్తం 1483 బస్సులు తిరిగాయి.
- ఎపీఎస్ ఆర్టీసీకి తొలిరోజు ఆన్లైన్ బుకింగ్ ద్వారా 19.50 లక్షల ఆదాయం వచ్చినట్టు అధికారులు చెప్పారు.
- దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ రోడ్లపై జనసంచారం ఎక్కువగానే కనిపించింది.
- ఇక పరిశ్రమలు కూడా చాలా వరకూ ప్రారంభం అయ్యాయి.



