Top
logo

Live Updates:ఈరోజు (జూన్-18) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (జూన్-18) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 18 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు గురువారం, 18 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, ద్వాదశి ( ఉ.09:38 వరకు), భరణి నక్షత్రం (ఉ.08:30 వరకు) సూర్యోదయం 5:42 am,సూర్యాస్తమయం 6:52 pm

ఈరోజు తాజా వార్తలు

Live Updates

 • 18 Jun 2020 10:43 AM GMT

  బొలెరో వాహనంలో తరలిస్తున్న భారీ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న పెనుగంచిప్రోలు పోలీసులు

  - 2,460 మద్యం బాటిళ్లు సీజ్

  - విలువ 3లక్షల 30 వేలు రూ..

  -ముగ్గురు వ్యక్తుల అరెస్ట్

  - పెనుగంచిప్రోలు PS లో కేసు నమోదు

  - ఈరోజు జిల్లా SP శ్రీ రవీంద్రనాథ్ బాబు IPS., ఆదేశాల మేరకు తెల్లవారు జామున పెనుగంచిప్రోలు SI రామకృష్ణ తన సిబ్బందితో రేగుల గడ్డ రహదారిపై వాహన తనిఖీలు చేస్తుండగా బొలెరో వాహనంలో ఖమ్మం నుండి విజయవాడకు తరలిస్తున్న 2,460 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
 • 18 Jun 2020 10:11 AM GMT

  తిరుపతి.

  👉 గోపాల్ రాజు కాలనీ లో యువకుడు హత్య.

  👉 తిరుపతి రైల్వే స్టేషన్ ప్రక్కనున్న మురికి కాలవలో మృతదేహం లభ్యం.

  👉 సాయి నగర్ పంచాయతీ లోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన కె విజయ్ (24)గా ఈస్ట్ పోలీసులు గుర్తింపు.

  👉యువకుల పాత కక్షల వల్లే హత్య కు గురైనట్లు పోలీసు విచారణలో వెల్లడి .

  👉 మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం రూయా ఆసుపత్రికి తరలింపు.

  👉నిందితుల కోసం గాలిస్తున్న ఈస్ట్ పోలీసులు .

  👉కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఈస్ట్ సిఐ శివ ప్రసాద్ రెడ్డి .

 • 18 Jun 2020 6:54 AM GMT

  విజయవాడ

  - ఎపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు నడిపేందుకు తెలుగు రాష్ట్రాల చర్యలు

  - అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడపడంపై ఇవాల ఉన్నధికారుల చర్చలు

  - బస్సు సర్వీసులు నడపడంపై చర్చలు జరపనున్న ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు

  - ఉదయం 11గంటలకు విజయవాడ ఆర్టీసీ హౌస్ లో ప్రారంభం కానున్న చర్చలు

  - ఇరురాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర సర్వీసులు నడపడంపై పరస్పరం ఒప్పందం చేసుకునే అవకాశం

  - అనంతరం బస్సులు ఎప్పటి నుంచి నడపాలనే విషయమై తుది నిర్ణయం తీసుకోనున్న ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు

 • 18 Jun 2020 6:19 AM GMT

  » విశాఖ : కొయ్యూరు మండలం మర్రిపాలెం సమీపంలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు

  - లారీలో అక్రమంగా తరలిస్తున్న 400 కిలోల గంజాయి పట్టివేత.

  - ముగ్గురు అరెస్టు . లారీ స్వాధీనం.

 • 18 Jun 2020 6:18 AM GMT

  విశాఖ మన్యంలో..మన్యం బంద్ లో భాగంగా అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్న గిరిజనులు • 18 Jun 2020 4:08 AM GMT

  - నెల్లూరు జిల్లా జలదంకి మండలం బ్రాహ్మణక్రాక గ్రామంలో ఇందూరు మాధ‌వ అనే గిరిజ‌న యువ‌కుడిని నిర్బంధించి పాశవికంగా దాడి చేసిన అనిల్, మహేష్, రూబెన్ అనే యువకులను పోలీసులు అరెస్టు చేశారు.

  - కేసు వివ‌రాల‌ను కావలి డీఎస్పీ ప్రసాద్ మీడియాకు వివ‌రించారు.

  - ప్రేమ వ్య‌వ‌హార‌మే ఈ దాడికి కార‌ణ‌మ‌ని చెప్పారు.

  - నిందితుల‌ను అరెస్టు చేసిన కావలి రూరల్ సిఐ అక్కేశ్వరరావు, జలదంకి ఎస్సై ప్రసాద్ రెడ్డి ఇత‌ర సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

   


 • 18 Jun 2020 4:06 AM GMT

  తొట్టంబేడు మండలం గుండేలిగుంట గ్రామానికి చెందిన పిచ్చాని. సుబ్రమణ్యం @దొంగోడు , S/o సుబ్బారావు, age.55 సం. లు, గుండేలిగుంట గ్రామం, తొట్టంబెడు మండలం అను వ్యక్తి అక్రమంగా కలిగివున్న 05 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని అతనిని తదుపరి చర్యలనిమిత్తం అదుపులోకి తీసుకోవడం జరిగింది.

  ఈ వ్యక్తి లోక్డౌన్ సమయం నుండి అక్రమంగా నాటుసారా తయారీ చేసి వినియోగదారులకు లీటరు 1000 రూ. చొప్పున విక్రయించేవాడు. • 18 Jun 2020 4:04 AM GMT

  - చిత్తూరు జిల్లా మదనపల్లె రూరల్ పరిధిలో పోలీసుల దాడులు. బసినికొండ గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన కర్నాటక మద్యం స్వాధీనం చేసుకున్న సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ దిలీప్ కుమార్ లు.

  - బుధవారం సాయంత్రం అంతర్గత సమాచారం మేరకు పోలీసులు బసినికొండలో దాడులు చేపట్టి 420 కర్ణాటక మద్యంతో పాటు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

  - వీరిలో అధికారపార్టీకి చెందిన ఒకరు, మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. • 18 Jun 2020 4:02 AM GMT

  గవర్నర్ ను కలవనున్న చంద్రబాబు

  - టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈరోజు సాయంత్రం 6 గంటలకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ కానున్నారు.

  - రాష్ట్రంలో పరిణామాలను గవర్నర్‌కు వివరించనున్నారు.

  - వైసీపీ పాలనలో ప్రాథమిక హక్కులు కాలరాస్తున్నారనీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులతో అరెస్టులకు పాల్పడుతున్నరానీ ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది. 

  -  వైసీపీ నేతల అవినీతి కుంభకోణాలపై కూడా గవర్నర్‌కు చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారని చెబుతున్నారు.

 • 18 Jun 2020 3:43 AM GMT

  సూర్యాపేట : కర్నల్ సంతోష్ బాబు పార్టీవా దేహానికి నివాళులు అర్పించిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి.

  - సంతోష్ బాబు పార్ధివదేహానికి పూల మాల వేసి నివాళులు ఆర్పించిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,మంత్రి జగదీష్ రెడ్డి.

Next Story