Live Updates:ఈరోజు (జూన్-16) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 16 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు మంగళవారం, 16 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, ఏకాదశి ( పూర్తిగా), అశ్వనీ నక్షత్రం (పూర్తిగా) సూర్యోదయం 5:41 am, సూర్యాస్తమయం 6:51 pm
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 16 Jun 2020 9:46 AM IST
- మంగళగిరి ఆరవ పోలీస్ బెటాలియన్ లో పెరుగుతున్న కోవిద్ కేసులు.
- కొత్తగా ఏడుగురు పోలీసు సిబ్బందికి పాజిటివ్.
- గతంలో ఇక్కడే ముగ్గురుకి పాజిటివ్ నమోదు.
- 16 Jun 2020 8:47 AM IST
విశాఖ జిల్లా, పాడేరు మండలం, కందమామిడి వద్ద అదుపు తప్పి బైక్ బోల్లా, కృష్ణ కాంత్ అనే యువకుడు మృతి. మరొకరి పరిస్థతి విషమం, పాడేరు ఆస్పత్రికి తరలింపు
- 16 Jun 2020 8:46 AM IST
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ఈరోజు షెడ్యూల్
- 16వ తేదీ ఉదయం 10 గంటలకు వర్చువల్ కాన్ఫరెన్సింగ్ ద్వారా గవర్నర్ ప్రసంగం
- 11:30 గంటలకు స్పీకర్ అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా మండలి (బీఏసీ) సమావేశం.
- అనంతరం తిరిగి సభ ప్రారంభం.
- గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం- చర్చ
- గవర్నర్ ప్రసంగంపై ముఖ్యమంత్రి సమాధానం
- 12:30 గంటల నుంచి 1 గంట మధ్యలో ప్రస్తుత వార్షిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి
- అదేసమయంలో శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రతిపాదించనున్న ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్
- సాధారణ బడ్జెట్ అనంతరం సభలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రతిపాదించనున్న ఆ శాఖ మంత్రి కన్నబాబు
- శాసనమండలిలో వ్యవసాయ బడ్జెట్ / పద్దును మండలిలో ప్రతిపాదించనున్న మంత్రి మోపిదేవి వెంకటరమణ

- 16 Jun 2020 8:44 AM IST
అమరావతి : అమరావతి ల్యాండ్ స్కామ్ లపై ఈడీ విచారణ
- నిన్నటి నుంచి విచారణ చేస్తున్న ఈడీ బృందాలు.
- సిఐడి అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్న ఈడీ బృందాలు.
- అగ్రిగోల్డ్ స్కామ్ పై కూడా వివరాలు సేకరిస్తున్న ఈడీ అధికారులు.
- ఈఎస్ఐ స్కామ్ పై కూడా ఆరా తీస్తున్న ఈడీ.
- 16 Jun 2020 7:46 AM IST
- నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.
- దీనిలో పూర్తిస్థాయి బడ్జెట్తో పాటు వ్యవసాయ బడ్జెట్ ను సంబంధిత మంత్రులు ప్రవేశపెట్టనున్నారు.
- దీంతో పాటు మరికొన్ని కీలక అంశాలు చర్చకు రానున్నాయి.
- ఈ ఏడాది మార్చిలో ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.



