Live Updates:ఈరోజు (జూన్-05) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు శుక్రవారం, 05 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, పౌర్ణమి (రాత్రి 12:40వరకు), తదుపరి పాడ్యమి సూర్యోదయం 5:40 am, సూర్యాస్తమయం 6:48 pm

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 5 Jun 2020 8:16 AM GMT

    తూ.గో జిల్లా :

    బూరుగుపూడి ఆవ ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం ఇళ్ల స్థలాల సేకరణకు నిరసనగా.. ఇవాళ కోరుకొండ, సీతానగరం మండలాల్లోని ప్రజలు సత్యాగ్రహ దీక్షలు

    మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగనున్న సత్యాగ్రహ దీక్షలు

    దీక్షలో పాల్గొంటున్న 12 గ్రామాల ప్రజలు

    దీక్షలకు మద్దతుగా రాజమహేంద్రవరం లోని బీజేపీ ఆఫీసులో ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆధ్వర్యంలో దీక్షలు

  • 5 Jun 2020 6:50 AM GMT

    తూ.గో.జిల్లా... రాజోలు.

    రాజోలు లో గంజాయి కలకలం...

    మలికిపురం మండలం దిండి బ్రిడ్జి సమీపంలో గంజాయి విక్రయిస్తున్న బ్యాచ్ అరెస్ట్ చేసిన పోలీసులు..

    వారి వద్ద నుండి 900వందల గ్రాముల గంజాయి స్వాధీనం.10మందిని అదుపులోకి తీసుకున్నట్లు రాజోలు సిఐ దుర్గాశేఖర్ రెడ్డి తెలిపారు..

    ఈ పది మందిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్టు పోలీసులు తెలిపారు..

  • 5 Jun 2020 6:48 AM GMT

    డాక్టర్ సుధాకర్ ను హాస్పిటల్ నుండి డిస్ ఛార్జి చేయాలని ఆయన తల్లి కావేరి బాయ్ ఇచ్చిన హైబియస్ కార్పస్ పిటీషన్ మేరకు డిచ్ఛార్జ్ కి ఆదేశాలు ఇచ్చిన హై కోర్టు

  • 5 Jun 2020 6:34 AM GMT

    సిఐ లు బదిలీలు.

    అమరావతి:- గుంటూరు రేంజ్ పరిధిలో ఏనిమిది మంది సిఐలు బదిలీలు.



     


  • 5 Jun 2020 6:33 AM GMT

    తిరువూరు అమరావతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించారు. రోగులకు ప్రత్యేక పడకలు, ఆపరేషన్ ధియేటర్, ల్యాబ్ సదుపాయాలు కల్పించినట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది..



     


  • 5 Jun 2020 6:20 AM GMT

    ఆంధ్రప్రదేశ్ ప్రభూత్వ ప్రధాన కార్యదర్శికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు

    లాక్‌డౌన్‌ సందర్భంలో గుంటూరు జిల్లా, మంగళగిరి బైపాస్ పాస్ పై ఒక్కసారిగా వందలమంది వలసకూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు బయటకురాగా వారికి అర్ధమైయ్యేలా నచ్చచెప్పాల్సింది పోయి తాడేపల్లి టౌన్ CI మల్లికార్జునరావు వారితో దురుసుగా ప్రవర్తించటమే కాకుండా, దారుణంగా వారిపై లాఠీఛార్జ్ చేసి గాయపరిచిన సంఘటనపై ఎం.డీ. ఖాలిద్ పాషా (అల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ )అంబాసిడర్ గారు జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగినది. దీనిపై స్పందించిన NHRC, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా చీఫ్ సెక్రటరీకి సంభందిత అధికారిపై చర్యలు తీసుకోని ఎనిమిది వారాలలో నివేదిక అందచేయాలని సూచిస్తూ నోటీసులు జారీచేసింది.

  • 5 Jun 2020 6:17 AM GMT

    ఏపీ బస్సులను అనుమతించాలని తెలంగాణ, కర్ణాటక, ఒడిశాలకు ఏపీ వినతి

    జూన్ 8వ తేదీ నుంచి అంతరాష్ట్ర సర్వీసులను నడిపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని తెలంగణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల ప్రభుత్వాలకూ తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నినిన్న లేఖను రాశారు.



                                                                            - పూర్తి వివరాలు

      

  • 5 Jun 2020 4:44 AM GMT

    బడులు తెరిచేలోగా నాడు-నేడు పనుల పూర్తి

    దేవరాపల్లి: మండలంలో నాడు-నేడు పథకం ద్వారా పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా ఉప విద్యాశాఖాధికారి (పాడేరు) జ్యోతికుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గరిసింగి, పెదనందిపల్లి, చింతలపూడి, దేవరాపల్లి, రైవాడ, తెనుగుపూడి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పనులను ఆమె పరిశీలించారు. పాఠశాలలు ప్రారంభించే లోగా పనులన్నీ పూర్తి చేయాలని సర్వశిక్ష అభియాన్‌ ఏఈఈ సంతోష్‌ని ఆదేశించారు. దేవరాపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్‌, సీఆర్పీ ఆదిరెడ్డి ఈశ్వరరావు తదితరులు ఉన్నారు.



     

     

  • 5 Jun 2020 4:28 AM GMT

    నిజామాబాద్‌లో ఘోర ప్రమాదం.. చిన్నారులపైకి దూసుకెళ్లిన కారు..

    నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కమ్మర్‌పల్లి వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.


                                                                                    - పూర్తి వివరాలు

     


  • 5 Jun 2020 4:27 AM GMT

    అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం

    రేషన్ బియ్యం మాఫియా గుట్టు రట్టు...వీరులపాడు మండలంలోని జుజ్జురు గ్రామంలో రేషన్ డీలర్ అయిన దేవరకొండ శ్రీనివాసరావు తన ఇంటి పక్కన ఉన్న ఇళ్లలో రేషన్ బియ్యం దాచి అర్ధరాత్రి లోడింగ్ చేస్తుండగా....గ్రామ ప్రజలు సహకారంతో పట్టుకున్న వీరులపాడు SI హరి ప్రసాద్ , స్పెషల్ బ్రాంచ్ పోలీసులు. దేవరకొండ శ్రీనివాసరావు ని ఇంకా పట్టుకున్న రేషన్ బియ్యాన్ని వాహనాలతో సహా పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలీసులు

Print Article
More On
Next Story
More Stories