Live Updates:ఈరోజు (జూలై-26) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 26 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు ఆదివారం, 26 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం షష్ఠి (ఉ.9-32 వరకు) తర్వాత సప్తమి, హస్త నక్షత్రం (మ. 12-37 వరకు) తర్వాత హస్త నక్షత్రం.. అమృత ఘడియలు ( మ. 12-46 నుంచి 2-17 వరకు), వర్జ్యం ( రా. 8-06 నుంచి 9-36 వరకు) దుర్ముహూర్తం (సా. 4-57 నుంచి 5-49 వరకు) రాహుకాలం (సా. 4-30 నుంచి 6-30 వరకు) సూర్యోదయం ఉ.5-39 సూర్యాస్తమయం సా.6-32
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 26 July 2020 8:16 AM IST
ఒకటినే ఔట్ సోర్సింగ్ జీతాలు..
ఇక నుంచి ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రతి నెల 1నే వేతనాలను అందించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. గతంలో మాదిరి కాకుండా ఇచ్చిన మాట మేరకు దళారీ ఏజెన్సీలకు స్వస్తి పలికి నేరుగా కొత్తగా ఏర్పాటు చేసిన కార్పోరేషన్ పరిధిలోకి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసుకొచ్చి నేరుగా నియామాకాలను సైతం చేపట్టేందుకు ఏపీప్రభుత్వం ముందుకు వచ్చింది.
Next Story



