Top
logo

Live Updates:ఈరోజు (జూలై-16) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (జూలై-16) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 16 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు గురువారం, 16 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. ఉత్తరాయణం.. ఆషాఢ మాసం, కృష్ణపక్షం ఏకాదశి(రా. 09-43 వరకు) తర్వాత ద్వాదశి, కృత్తిక నక్షత్రం (సా. 05-54 వరకు) తర్వాత రోహిణి నక్షత్రం.. అమృత ఘడియలు ( మ. 03-16 నుంచి సా.05-01వరకు), వర్జ్యం (ఉ.శే.వ. 06-33వరకు) దుర్ముహూర్తం (ఉ. 09-56 నుంచి 10-47 వరకు) రాహుకాలం (మ. 01-30 నుంచి 03-00 వరకు) సూర్యోదయం ఉ.5-37 సూర్యాస్తమయం సా.6-34

ఈరోజు తాజా వార్తలు

Live Updates

 • జైలులో వరవర రావుకు కరోనా పాజిటివ్!
  16 July 2020 1:19 PM GMT

  జైలులో వరవర రావుకు కరోనా పాజిటివ్!

  కొన్ని నెలల నుంచి ముంబైలోని జైలులో ఉంటున్న విప్లవ రచయితల సంఘం నాయకుడు వరవరరావుకు కరోనా సోకింది. ప్రస్తుతం నేవీ ముంబైలోని జేజే ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కొద్దిరోజుల నుంచి ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాలని కుటుంబసభ్యులు మహారాష్ట్ర ప్రభుత్వం, పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల ఆయనను జేజే ఆస్పత్రికి తరలించిన జైలు సిబ్బంది... త్వరలోనే ఆయనను సెయింట్ జార్జ్ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది.

  వృద్ధాప్యంలో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వరవరరావును కేంద్ర ప్రభుత్వం తప్పుడు కేసుల్లో ఇరికించారని... ఆయనను అమానుషంగా జైలులో నిర్బంధించిందని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాత్కాలిక బెయిల్‌ కోసం వరవరరావు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 

 • కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ట్వీట్
  16 July 2020 12:23 PM GMT

  కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ట్వీట్

  అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్​తో మాట్లాడానని, రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడానికి కారణాలు తెలుసుకున్నానని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ట్వీట్ చేశారు.

  - కరోనా నిర్ధరణ పరీక్షల సంఖ్య పెంచడంపై ఎక్కువ దృష్టి పెట్టామని, రోజుకు 22వేల పరీక్షలు చేస్తున్నామని సీఎం చెప్పినట్లు ఆయన వెల్లడించారు.

  - 'రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా సోకినవారిలో మరణాల రేటు 1.17 శాతం ఉంది. దాన్ని ఒక్క శాతానికి తగ్గించేందుకు కృషి చేస్తున్నాం.

  - వైరస్ సోకినవారిని వెంటనే గుర్తించి చికిత్స అందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని సీఎం చెప్పారు' అని హర్షవర్ధన్ పేర్కొన్నారు.

  - రాష్ట్రంలో కరోనా రోగుల చికిత్సకు 64వేల పడకలు సిద్ధంగా ఉన్నట్టు హర్షవర్ధన్ తెలిపారు.

  - కరోనా నియంత్రణకు కేంద్రం రూ.179కోట్లు ఇచ్చినట్టుగా వెల్లడించారు.

 • 16 July 2020 11:01 AM GMT

  కరోనా తరుముతున్నా... కనికరించరా

  - టీటీడీ అధికారుల తీరుపై ట్విట్టర్ వేదికగా ఆగ్రహించిన గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు.

  - శ్రీవారికి కైంకర్యాలు నిర్వహించే 50మంది అర్చకుల్లో 15మంది కరోనా సోకింది.

  - మరో 25 మంది అర్చకులకు కరోనా పరోక్ష ఫలితాలు రావాల్సి ఉంది.

  - కేసులు పెరుగుతునప్పటికీ స్వామివారి దర్శనాలు నిలుపదలచేయకపోవడం దారుణమంటూ ట్విట్

  - టీటీడీ ఈఓ, అదనపు ఈఓ వ్యవహారశైలి అర్చకులపై ఏమేరకు వ్యతిరేకత ఉందో దీన్నిబట్టి తెలుస్తోంది.

  - తన ట్విట్టర్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి ని ట్యాగ్ చేసిన రమణదీక్షితులు .

 • 16 July 2020 10:17 AM GMT

  తిరుమల క్షేత్రంలో కరోనా కలకలం..

  - తిరుమల క్షేత్రంలో కరోనా కలకలం.

  - 14 మంది అర్చకులకు కరోనా పాజిటివ్.

  - నిర్దారించిన ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు.

  - 60 ఏళ్ళు దాటిన అర్చకులు సెలవు కోరితే మంజూరు చేస్తాం అని తెలిపారు.

 • 16 July 2020 10:16 AM GMT

  హైదరాబాద్ లో మళ్లీ కంటైన్మెంట్ జోన్లు

  - హైదరాబాద్ లో పెరుగుతున్న కరోనా కేసులు..

  - రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులు.

  - కరోనా కట్టడి కోసం పాతవిడదానాన్ని అవలంబించనున్నారు అధికారులు.

  - జీహెచ్ఎంసీ పరిదిలో మళ్లీ కంటైన్మెంట్ జోన్లు.

  - ఐదు కేసులకు మించిన కాలనీలు, బస్తిల్లో కాంటైన్మేంట్ జోన్లు. 

 • 16 July 2020 5:44 AM GMT

  మరింత మందికి వైఎస్సార్ చేయూత..

  ఇంతవరకు పింఛన్లను తీసుకునే వారికి వైఎస్సార్ చేయూత వర్తించదంటూ ఇచ్చిన నిబంధనలను కొన్నింటిని సవరించారు. మరికొంత మంది మహిళలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రకారం కొత్తగా సవరించిన వారంతా మరలా ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

  - పూర్తి వివరాలు 

 • 16 July 2020 5:43 AM GMT

  చిన్న జిల్లాలతో పాలన సౌలభ్యం..

  - పరిపాలన సౌలభ్యం కోసం చిన్న జిల్లాలు చేసే అలోచనలో ఉన్నట్టు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు.

  - అయితే అరకు మాదిరి దూరంగా విస్తరించి ఉన్న జిల్లాను రెండింటిగా ప్రతిపాదిద్దామని సీఎం చెప్పడంతో అంతా ఆమోదించారు.

  - పూర్తి వివరాలు 

 • 16 July 2020 5:41 AM GMT

  మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

  మహబూబాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

  - లారీ అదుపుతప్పి బోల్తా పడింది. చీకటాయపాలెం గ్రామంలోని ఎక్కలదాయమ్మ చెరువు కట్ట వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

  - అక్రమంగా కర్రలోడును తరలిస్తున్న లారీ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది.

  - ప్రమాద సమయంలో లారీలో మొత్తం 11 మంది కూలీలు ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలోనే నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు.

  - మృతులు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆంబోతుతండాకు చెందిన ఆంబోతు హార్యా(37), గోవింద్‌( 38), మధు(35), రాట్ల ధూర్యా(36)లుగా గుర్తించారు.


 • 16 July 2020 5:40 AM GMT

  పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎక్ కౌంటర్

  ఇటీవల కాలంలో మావోయిస్టుల జాడ తగ్గిన నేపథ్యంలో తెలంగాణాలోని భద్రాద్రిలో ఎన్ కౌంటర్తో మరోమారు వార్తల్లోకి వచ్చారు. బుధవారం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగినట్టు పోలీసులు చెప్పారు. అయితే ఈ ఘటనలో ఒకరికే గాయలయ్యాయని, మవోయిస్టుల సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు చెబుతున్నారు.

  - పూర్తి వివరాలు 

 • 16 July 2020 5:38 AM GMT

  మరింత అందంగా కైలాసగిరి..

  - విశాఖకు సుందర ప్రాంతంగా చెప్పుకుంటున్న కైలాసగిరిని మరింత సుందరంగా అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం సంకల్పించింది.

  - ఇప్పటివరకు ఉన్నవాటితో పాటు 380 ఎకరాల్లో రూ.61.93 కోట్లతో పనులు పూర్తిచేసి కొత్తందాలతో కైలాసగిరిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నారు.

  - వీటిలో ప్రస్తుతం ఉన్నదానికి అదనంగా రెండో ఘాట్‌ రోడ్డు నిర్మాణం, 3డీ ప్లానిటోరియంతో పాటు అభివృద్ధి పనులను పర్యావరణహితంగా తీర్చదిద్దేందుకు శ్రీకారం చుట్టారు.

  - పూర్తి వివరాలు 

Next Story