Live Updates:ఈరోజు (జూలై-13) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 13 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు సోమవారం, 13 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. ఉత్తరాయణం.. ఆషాఢ మాసం, కృష్ణపక్షం అష్టమి(సా. 4-36 వరకు) తర్వాత నవమి, రేవతి నక్షత్రం (ఉ.10-45 వరకు) తర్వాత అశ్విని నక్షత్రం.. అమృత ఘడియలు (తె. 5-21 నుంచి 9-51 వరకు), వర్జ్యం లేదు. దుర్ముహూర్తం (మ. 12-31 నుంచి 1-23 వరకు) రాహుకాలం (ఉ. 7-30 నుంచి 9-00 వరకు) సూర్యోదయం ఉ.5-36 సూర్యాస్తమయం సా.6-35
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 13 July 2020 10:15 AM IST
జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ నాగేశ్వర్ రావు రాజీనామా
నిజామాబాద్ : జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ నాగేశ్వర్ రావు రాజీనామా.
- ఆసుపత్రి లో వరుస సంఘటనల తో మనస్తాపం.
- సూపరిండెంట్ పదవికి రాజీనామా, రాజీనామా లేఖను డి.ఎం.ఏ.కి పంపిన నాగేశ్వర్ రావు.
- 13 July 2020 10:14 AM IST
నేడు మహబూబ్ నగర్ కు రానున్న రాష్ట్ర పురపాలక, ఐటీ, శాఖ మంత్రి
మహబూబ్ నగర్.. నేడు మహబూబ్ నగర్ కు రానున్న రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు..
పర్యటన వివరాలు..
- మహబూబ్నగర్ శివారులోని మయూరి ఎకో పార్క్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల పాల్గొంటారు...
- పట్టణ సమీపంలోని ప్రభుత్వ వైద్య కళాశాల భవనాల సముదాయం ప్రారంభోత్సవం.
- ఎస్ ఎస్ ఆసుపత్రి సమీపంలోని బైపాస్ దారిలో హరితహారం కార్యక్రమం..
- కలెక్టరేట్ సముదాయంలో ఉన్న మహబూబ్నగర్ ఎక్స్పో ప్లాజాను ప్రారంభిస్తారు.
- అటవీ శాఖ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన వీధి వ్యాపారులకు దుకాణాలు కేటాయింపు పత్రాలు అందజేత కార్యక్రమం.
- వీరన్నపేట సమీపంలోని రెండు పడక గదుల ఇళ్ల లబ్దిదారులకు అందజేత కార్యక్రమం.
- అప్పన్నపల్లి సమీపంలోని వైట్ హౌస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన రుణమే లలో పాల్గొంటారు.
- 13 July 2020 10:08 AM IST
సెక్రటేరియట్ కూల్చివేతపై తెలంగాణ హైకోర్టులో విచారణ
- సెక్రటేరియట్ కూల్చివేతపై ఈరోజు మరోసారి తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.
- కూల్చివేత వల్ల వచ్చే దుమ్మూ ధూళితో శ్వాస కోస వ్యాధులు వస్తున్నాయని ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వర్‌రావు దాఖలు చేసిన పిల్ పై సోమవారం వరకు కూల్చివేత ఆపేయాలని కోర్టు ఆదేశించింది.
- కూల్చివేతకు ఎలాంటి అనుమతులు తీసుకున్నారని కోర్టు ఈసందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
- దీంతో ప్రభుత్వం కూల్చివేతలు నిలిపివేసింది.
- ఈరోజు ఈ వ్యవహారంపై హైకోర్టు ఏం చెప్పబోతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
- 13 July 2020 9:55 AM IST
అసోం రాష్ట్రంలో గ్రామాలను ముంచెత్తుతున్న వరదలు
- అసోం రాష్ట్రంలో వరదలు గ్రామాలను ముంచెత్తుతున్నాయి.
- దీంతో వరద బాధితులను ఎన్డీఆర్ఎఫ్ బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
- బార్పేట జిల్లాలోని ఓ గ్రామం వరద ముంపునకు గురవడంతో 487 మందిని బోట్లలో సురక్షిత ప్రాంతానికి తరలించారు.
- అసోంలో కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తడంతో 950 గ్రామాలు వరదనీటిలో మునిగిపోయాయి.
- వరద బాధితులకు మాస్క్ లు పంపిణీ చేసి, వారు సామాజిక దూరం పాటించేలా చూస్తున్నారు.
- అసోంలోని జోర్హాట్, బోనగైగాం, కామెరూప్ మెట్రో, కామెరూప్ రూరల్, బక్సా, బార్పేట, కచర్, శివసాగర్, సోనిట్ పూర్, ధీమాజీ, తిన్ సుకియా ప్రాంతాల్లో 11 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు.
- వరదబాధిత ప్రాంతాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి వరద సహాయ పనులు చేపట్టారు. పుతిమర్రి, బేకి, ఐ, పహుమర నదులు పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలు నీట మునిగాయి.
- 13 July 2020 8:10 AM IST
ఇంగ్లాండ్ తో తొలి టెస్టులో వెస్టిండీస్ విజయం!
- కరోనా నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లండ్‌తో జరుగిన తొలి టెస్ట్ లో వెస్టిండీస్ విజయం సాధించింది.
- 284/8 ఓవర్ నైట్ స్కోర్‌తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఇంగ్లండ్ 7.2 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటైంది.
- ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 204 రన్స్ కే ఆలౌటవ్వగా, విండీస్ 318 పరుగులు చేసింది. 2000 తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై వెస్టిండీస్ జట్టు ఓ టెస్టు మ్యాచ్‌లో గెలుపొందడం ఇదే రెండోసారి.
- తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టిన వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ గాబ్రిల్‌కి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.
- 13 July 2020 7:56 AM IST
గవర్నర్ నామినేటెడ్ కోటా భర్తీకి చర్యలు
- కొన్నాళ్లుగా ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలతో పాటు గవర్నర్ కోటాలో ఖాళీ అయిన మరో రెండు స్థానాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.
- గవర్నర్ కోటాకు సంబంధించి ఎస్సీ, ముస్లిం వర్గాలకు వీటిని కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది.
- ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో గవర్నర్ కోటాలో భర్తీ చేసే సభ్యుల్లో ఖాళీగా ఉన్న రెండు స్థానాల్లో ఒకటి ఎస్సీ, మరొకటి ముస్లిం వర్గాలకు కేటాయించనున్నట్టు తెలుస్తోంది.
- 13 July 2020 7:54 AM IST
విజయవాడలో గొల్లపూడి మార్కెట్ కు విస్తరించిన కరోనా
- కరో్నా వైరస్ వ్యాప్తి, అక్కడా ఇక్కడా అని కాదు... ఎక్కడ పడితే అక్కడ చొరబడుతోంది... వైరస్ వ్యాపిస్తోంది.
- అతి జాగ్రత్తగా ఉండే ప్రాంతాల్లోనూ ఇది విస్తరిస్తుందంటే ఇక జనాలు తిరిగే చోట పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
- అయితే వీటిని అదుపు చేసేందుకు చాలా చోట్ల స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు.
- కొన్నిచోట్ల ప్రభుత్వమే లాక్ డౌన్ విదిస్తోంది. దీనిలో భాగంగా విజయవాడలో సైతం కొన్ని ప్రాంతాల్లో వివిధ మార్కెట్లలో లాక్ డౌన్ విధించేలా నిర్ణయం తీసుకున్నారు.
- 13 July 2020 7:51 AM IST
ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డోర్ డెలివరీ
- ఏపీ సీఎం జగన్మోహరెడ్డి అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీ నేపథ్యంలో రేషన్ సరుకులను డోర్ డెలివరీ చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
- ఈ పద్ధతిని ముందుగా శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశపెట్టి దానిలోని లోపాలు, సరిదిద్ధాల్సిన వాటిపై అధ్యయనం చేశారు.
- దీనిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 2.60 లక్షల క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.






