Live Updates:ఈరోజు (జూలై-11) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 11 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు శనివారం, 11 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. ఉత్తరాయణం.. ఆషాఢ మాసం, కృష్ణపక్షం షష్ఠి(ఉ. 12-44 వరకు) తదుపరి సప్తమి, పూర్వాభాద్ర నక్షత్రం (ఉ.5-42వరకు) తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం.. అమృత ఘడియలు (మ.2-51 నుంచి 4-37 వరకు), వర్జ్యం (సా.4-16 నుంచి 6-02 వరకు) దుర్ముహూర్తం (ఉ. 5-36 నుంచి 7-19 వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-36 సూర్యాస్తమయం సా.6-35
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 11 July 2020 10:49 AM IST
కృష్ణా జిల్లాలో వైసీపీ కార్యకర్త పై హత్యాయత్నం
కృష్ణా జిల్లా: పెడన మున్సిపాలిటీలో వై ఎస్ ఆర్ సి పి కార్యకర్త బాజీపై హత్యాయత్నం
- స్థానిక 16 వ వార్డులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అబ్దుల్ బాజీ పై శనివారం తెల్లవారుజామున హత్యాయత్నం
- స్థానిక 12 వార్డు చెందిన జనసేన పార్టీ కార్యకర్తలు బాజీ ఇంట్లోకి చొరబడి కత్తులు రాడ్లతో దాడి
- ఈ ఘటనలో బాజీ తలకు బలమైన గాయం
- కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
- తనను హత్య చేయటానికి పదిమంది మంది వరకు తన ఇంటి పైకి దాడి చేశారని స్థానికులతో పాటు కుటుంబ సభ్యులు అడ్డు రావడంతో బతికిపోయా అని చెబుతున్న బాజీ
- 11 July 2020 8:48 AM IST
Andhra Pradesh:ట్రై ఏజ్ సెంటర్ ద్వారా హోం ఐసోలేషన్ కు అనుమతులు
- ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల్లో హోం ఐసోలేషన్‌కు వెళ్లాలనే వారికి ట్రై ఏజ్ సెంటర్ ద్వారా పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితులు అంచనా వేస్తారని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.
- హోం ఐసోలేషన్ అనుమతులకు నగరంలోని బిషప్ అజరయ్య బాలికోన్నత పాఠశాలలో ట్రై ఏజ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
- శనివారం నుంచి ప్రారంభంకానున్న ఈ సెంటర్‌ను కలెక్టర్ ఇంతియాజ్ శుక్రవారం పరిశీలించారు.
- ఇంట్లో ప్రత్యేక గది, టాయిలెట్ సదుపాయం ఉన్నది లేనిదీ కూడా పరిగణనలోకి తీసుకుంటారన్నారు.
- హోం ఐసోలేషన్ కోరే వారికి రోజూ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారన్నారు.
- 11 July 2020 7:46 AM IST
ముబాయిలో భారీ అగ్నిప్రమాదం
- ముంబాయిలో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది
-ముంబాయిలోని బోరీవాలి ప్రాంతంలోని ఓ షాపింగ్ సెంటర్ లో అగ్నిప్రమాదం సంభవించింది.
- పెద్ద ఎత్తున మంటలు ఆ ప్రాంతంలో వ్యాపించాయి.
- 14 ఫైర్ ఇంజన్ లు అక్కడ మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నాయి
- పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






