Live Updates:ఈరోజు (జూలై-05) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు ఆదివారం, 05 జూలై, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, శుక్లపక్షం, పౌర్ణిమ (ఉ.10:13రకు), పూర్వాషాడ నక్షత్రం (రా.11:02వరకు) సూర్యోదయం 5:46am,సూర్యాస్తమయం 6:54pm

ఈరోజు గురుపూర్ణిమ. గురుపూజామహోత్సవానికి సంబంధించిన పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి!

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 5 July 2020 3:20 AM GMT

    ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సోమవారం

    అమరావతి :

    - ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సోమవారం జమ కానున్నాయి.

    - 2వ తేదీనే గవర్నర్‌ ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపినప్పటికీ శనివారం వరకు ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ కాలేదు.

    - గవర్నర్‌ ఆమోదం పొందిన రోజే బడ్జెట్‌ అమల్లోకి వస్తున్నట్లు ఆర్థికశాఖ జీవో ఇచ్చింది.

    - పూర్తి వివరాలు  

  • 5 July 2020 3:17 AM GMT

    నేడు రేపూ వర్షాలు

    అమరావతి :

    - ఆంధ్రప్రదేశ్‌ తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

    - ఏపీ  తీరప్రాంతానికి, దక్షిణ ఒడిసా తీరానికి పశ్చిమ దిశగా ఆవర్తనం నెలకొంది.

    - ఇది సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది.

    - ఆది, సోమవారాల్లో ఉత్తరాంధ్ర, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

    -  పూర్తి వివరాలు 

  • 5 July 2020 3:14 AM GMT

    విజయవాడ: అక్రమంగా మద్యం తరలిస్తున్న వాలెంటర్ అరెస్ట్.

    - నున్న సచివాలయంలో వాలెంటర్ భూక్య జోసెఫ్ గా గుర్తించిన పోలీసులు.

    - శనివారం అర్ధరాత్రి మద్యాన్ని ఆటోలో తరలిస్తూ పట్టుబడ్డ వైనం.

    - అతని నుండి 180 బాటిల్స్ స్వాధీనం చేసుకున్న నున్న సిఐ ప్రభాకర్ సిబ్బంది.

Print Article
Next Story
More Stories