Top
logo

Live Updates:ఈరోజు (జూలై-01) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (జూలై-01) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 01 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు బుధవారం, 01 జూలై, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, శుక్లపక్షం, ఏకాదశి (సా.05:29 వరకు), విశాఖ నక్షత్రం (తె.02:34 వరకు) సూర్యోదయం 5:45am, సూర్యాస్తమయం 6:54pm

ఈరోజు తాజా వార్తలు

Live Updates

 • 1 July 2020 2:56 PM GMT

  పెంచిన పెట్రోల్ డీజిల్ వెంటనే తగ్గించాలి

  పెందుర్తి: లాక్ డౌన్ కారణంగా ప్రజలందరూ ఉపాధి కోల్పోయి ఇళ్లకు పరిమితం అయితే కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకిపెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం బాధాకరం అని అనకాపల్లి పార్లిమెంటరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రుత్తల శ్రీరామ్ మూర్తి, పీసీసీ జనరల్ సెక్రటరీ బొడ్డు శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అడారి రమేష్ నాయుడు కేంద్ర ప్రభుత్వ తీరు పై నిరసన వ్యక్తం చేశారు.

  - పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు నిరసనగా పెందుర్తి లో పెట్రోల్ బంక్ వద్ద ఆడారి రమేష్ నాయుడు ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు.

  - ఈ సందర్భం గా వీరు ముగ్గురు మాట్లాడుతూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.

  - లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం పై నిరసన ర్యాలీ లుకొనసాగుతాయని అన్నారు.

  - ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు షేక్ షఫీ, రాము నాయుడు, ఆర్.ఆర్.నాయుడు, పెందుర్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విన్నకోట రాము, శ్రీరాములు, గండి సన్నిబాబు, లక్ష్మ మోజీ, రమణమ్మ, బి.ఎస్.నాయుడు తదితరులు పాల్గొన్నారు. • 1 July 2020 1:59 PM GMT

  విశాఖ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం విరిగిపడిన చెట్లు

  విశాఖపట్నం: జిల్లాలోని రోలుగుంట ,రావికమతం మండలాల్లో భారీ వర్షం కురిసింది.

  - పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రాకపోకలకు అంతరాయం కలిగింది.

  - మరికొన్ని చోట్ల విద్యుత్ తీగలపై విరిగిన చెట్ల కొమ్మలు పడటంతో రోలుగుంట మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

  - ప్రధానంగా రోలుగుంట, కొవ్వూరు, కొత్తకోట, కొమరవోలు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మాడుగుల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. • 1 July 2020 1:50 PM GMT

  నాటుసారా బట్టీలపై ఎక్సయిజ్ అధికారుల దాడులు

  కాకినాడ: స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ గరుడ సుమిత్ సునీల్, ఉప కమిషనర్ అరుతీరావు ఆదేశాల మేరకు పిఠాపురం మండల పరిధిలోని మాధవపురం, యు.కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ గ్రామంలో బుధవారం సారా బట్టీలపై దాడి నిర్వహించారు.

  -ఈ క్రమంలో నిర్వహించిన దాడులలో 35లీటర్ల సారాయి,ఒక మోటార్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

  -సారాయి అమ్మకాలు జరిపే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

  - ఈ దాడులలో పిఠాపురం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ కాత్యాయని, ఎస్సైలు టీవీ రామిరెడ్డి, పి.ఎన్. సుబ్రహ్మణ్యం, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.  • 1 July 2020 1:34 PM GMT

  రెండు వేల పడకల సామర్ధ్యంతో కోవిడ్ కేర్ సెంటర్: కలెక్టర్

  › అమలాపురం: అల్లవరం మండలం బోడసకుర్రులోని ఆంధ్రప్రదేశ్ పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ( టిడ్ కో) భవన సముదాయంలో సుమారు 15 వందల నుండి 2 వేలు పడకల సామర్ధ్యంతో కోవిడ్ కేర్ సెంటర్, ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి తెలిపారు.

  ›› బుధవారం కలెక్టర్ బోడసకుర్రులోని టిడ్ కో భవన సముదాయాన్ని సందర్శించి కోవిడ్ కేర్ సెంటర్ మరియు క్వారం టైన్ సెంటర్ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పాత్రికేయులతో కలెక్టర్ మాట్లాడుతూ... విస్తీర్ణం పరంగానూ, జనాభా పరంగానూ కూడా జిల్లా పెద్దది కావడం వలన కోవిడ్ నియంత్రణకు అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు.

  ›› జిల్లాలో 15 కోవిడ్ ఆసుపత్రులు వున్నాయని 3 వేల పడకల సామర్ధ్యంతో బొమ్మూరులో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేయడం జరిగిందని, అమలాపురం డివిజన్ కు సంభందించిన కరోనా పాజిటివ్ కేసులకు ఈ టిడ్ కో భవన సముదాయంలో కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామని, అయితే స్థానికులు లేనిపోని వివిధ రకాల అపోహలతో అభ్యంతరం చెబుతున్నారని కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులను దూరం పెట్టడం కాకుండా మనం తీసుకోవలసిన జాగ్రత్తలు మనం తీసుకోవాలని ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి అనేక పర్యాయాలు చెప్పడం జరిగిందని కలెక్టర్ తెలియచేశారు.  • 1 July 2020 9:50 AM GMT

  @ కృష్ణాజిల్లా నందిగామ..

  - కిడ్నాప్ కలకలం 5 గంటల లోనే ఛేదించిన నందిగామ పోలీసులు..

  - నందిగామ మండలం అంబర్ పేట గ్రామానికి చెందిన చిన్నారి అక్షరం కిడ్నాప్ చేసిన చందు అనే వ్యక్తి.. సెల్ ఫోన్ టవర్ సిగ్నల్ ఆధారంగా చందు కదలికలు పసిగట్టి పట్టుకున్న సిఐ కనకారావు ఎస్ ఐ ఏసోబు...

  - లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న చిన్నారి అక్షర తండ్రి.. తల్లి ఝాన్సీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వెతుకులాట ప్రారంభించిన పోలీసులు. అక్షర తండ్రితో స్నేహంగా ఉంటున్న చందు ని కిడ్నాపర్ గా గుర్తించిన పోలీసులు..

  - విజయవాడలో చందుని అదుపులోకి తీసుకొని అక్షరం తల్లిదండ్రుల వద్దకు చేర్చిన పోలీసులు..

 • 1 July 2020 9:49 AM GMT

  @ తుర్పు గోదావరి జిల్లా

  - పిఠాపురం సీతయ్య గారి తోటలో (కరివేపాకు పేట ఎదురుగా). చిన్నారి సహా ఐదుగురిని గాయపరిచిన పిచ్చికుక్క..

  - మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు.

 • 1 July 2020 5:36 AM GMT

  70 లీటర్ల సారాతో పాటు 3 బైక్ లు స్వాధీనం

  కోరుకొండ: రాజమహేంద్రవరం అర్బన్ స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో సూపరిండెంట్ ఏ. రమాదేవి ఆదేశాలతో మంగళవారం కోరుకొండ స్టేషన్ పరిధిలోని జరిపిన విస్తృత దాడులలో రెండు కేసులు నమోదు చేసి, 70 లీటర్ల నాటుసారాతో, ఐదుగురిని అరెస్ట్ చేసి,3 మోటార్ బైకులను సీజ్ చేసినట్లు కోరుకొండ ఎస్ ఈ బి స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కోలా వీరబాబు తెలిపారు.

  - ఆయన తెలిపిన వివరాల ప్రకారం కోరుకొండ మండలం జంబుపట్నం గ్రామానికి చెందిన దాసు బాబు, జగ్గంపేట మండలం గోవిందపురం గ్రామానికి చెందిన రాజు ల వద్ద నుండి 25 లీటర్ల నాటు సారాతో పాటు, ఒక మోటార్ వాహనాన్ని స్వాధీనం చేస్తున్నామన్నారు.

  - అదే విధముగా జగ్గంపేట మండలం గోవిందపురం గ్రామానికి చెందిన వెంకటరమణ మరియు లాజర్ ల ను అరెస్ట్ చేసి వారి దగ్గర నుండి 25 లీటర్ల నాటు సారాతో పాటు ఒక మోటారు వాహనాన్ని సీజ్ చేసామన్నారు.

  - పట్టుబడ్డ నలుగురు గోవిందపురం గ్రామము నుండి జంభూపట్నం గ్రామానికి సారాను తరలిస్తుండగా కోరుకొండ మండలం జంభూట్నం గ్రామ శివారులో వీరిని అదుపులోకి తీసుకున్నామన్నారు.

  - గోకవరం మండలం తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన ప్రసాద్ దగ్గర నుండి 20 లీటర్ల నాటుసారా ఒక మోటార్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ దాడులలో కోరుకొండ యస్ఈబి స్టేషన్ ఎస్ఐ బి అప్పారావు తదితర సిబ్బంది పాల్గొన్నారు.  • 1 July 2020 4:41 AM GMT

  నేటి నుండి కోరుకొండలో స్వచ్ఛంద లాక్ డౌన్

  కోరుకొండ: మండల కేంద్రమైన కోరుకొండలో బుధవారం నుండి వర్తక సంఘం స్వచ్ఛంద లాక్ డౌన్ చేపడుతున్నట్టు తెలియజేశారు.

  - ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కోరుకొండలోని కిరాణా షాపులు, బట్టలు, మెకానిక్ షాప్ లు షాపులు పని చేస్తాయన్నారు.

  - అనంతరం షాపులో అన్ని మూసివేయడం జరుగుతుందని తెలియజేశారు.

  - ప్రజలు ఈ విషయాన్ని గమనించి నిర్ణీత సమయంలో షాపులకు రావాలని వర్తకులు సూచించారు.  • 1 July 2020 2:08 AM GMT

  నాటు సారా స్థావరాలపై పోలీసుల దాడులు, 2వేల లీటర్ల ఊట స్వాధీనం

  కడప: జిల్లాలోని చిన్నమండెం మండలం కొత్తపల్లి గ్రామం మండిపల్లి నాగిరెడ్డి డ్యాము సమీపంలో నాటు సారాయి తయారు చేస్తున్నారని సమాచారం రావడంతో రాయచోటి రూరల్ సి ఐ లింగప్ప వారి సిబ్బంది , చిన్నమండెం మండలం యస్ ఐ హేమాద్రి వారి సిబ్బంది నాటు సారాయి స్థావరాల ఫై దాడులు నిర్వహించారు.

  - ఈ దాడులలో సుమారు 70 లీటర్లు నాటు సారాయి, 2 వేల లీటర్లు ఊటను తో 5మంది నిందుతులను అదుపులోకి తీసుకొన్నట్లు సీఐ తెలిపారు.

  - పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి కోర్టు కు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. • 1 July 2020 2:07 AM GMT

  నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే అమర్నాథ రెడ్డి

  రాజంపేట: నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి నిరుపేదలను ఆదుకునేందుకు మాజీ శాసనసభ్యులు రోటరీ క్లబ్ అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథరెడ్డి, హ్యూమన్ రైట్స్ జాతీయ చైర్మన్ ఆరీఫ్ ఖలీల్ నేతృత్వంలో పట్టణ కేంద్రంలోని హ్యూమన్ రైట్స్ కార్యాలయంలో నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ చేశారు.

  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు తమ వంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు.

  ఈ కార్యక్రమంలో భాగంగానే కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

  ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు పోలా శ్రీనివాసరెడ్డి. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లారెడ్డి . డి సి ఎం ఎస్ చైర్మన్ దండు గోపి. హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు సుకుమార్, రాజంపేట చైర్మన్ బాబ్జాన్. దావూద్. సులేమాన్, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.Next Story