Live Updates: ఈరోజు (30 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 30 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 30 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | చతుర్దశి సా.4-54 తదుపరి పూర్ణిమ | రేవతి నక్షత్రం మ.3-15 తదుపరి అశ్విని | వర్జ్యం లేదు | అమృత ఘడియలు మ.12-36 నుంచి 2-22 వరకు | దుర్ముహూర్తం ఉ.8-18 నుంచి 9-03 వరకు తిరిగి మ.12-06 నుంచి 12-52 వరకు | రాహుకాలం ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 30 Oct 2020 2:54 PM IST
Krishna District Updates: ఉయ్యూరులో టిడిపి నిరసన ప్రదర్శన...
కృష్ణాజిల్లా...
-గత ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన ఎన్ టి ఆర్ హౌసింగ్ జీ+3 భవనాలను, వెంటనే పేదలకు అప్పగించాలి
-నిరసనలో మచిలీపట్నం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ, పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఎమ్మెల్సీ వై వి బి రాజేంద్ర ప్రసాద్
-పార్టీ కార్యాలయం వద్ద నుండి మునిసిపాలిటి పరిధిలో టిడ్కో నిర్మించిన భవనాల వరకూ నిరసన ప్రదర్శన
- 30 Oct 2020 6:52 AM IST
Road accident: గోకవరం మండలం తంటికొండ ఘాట్ రోడ్ లో ఘోరప్రమాదం
తూర్పు గోదావరి జిల్లా లో పెళ్ళిబృందం వ్యాన్ బోల్తా
* ఆరుగురు మృత్యువాత
* వీరంతా గోకవరం మండలం ఠాగూర్ పాలెం కు చెందినవారుగా గుర్తింపు
* వ్యానులో 17 మంది ప్రయాణిస్తుండగా తిరిగి ప్రయాణంలో ప్రమాదం
* మరో 8మందికి తీవ్రగాయాలు
* పలువురు పరిస్థితి విషమం
* క్షతగాత్రులను రాజమండ్రి- ప్రభుత్వాస్పత్రికి తరలింపు.
* రాత్రి సుమారుగా 3 గంటల సమయంలో ప్రమాదం
* ఠాగూర్పాలెం పెళ్లి కొడుకుకు - రాజానగరం మండలం వెలుగు బంధ గ్రామానికి చెందిన పెండ్లి కుమార్తె కు కొండపై రాత్రి వివాహం
* తంటికొండ ఆలయంపై రాత్రి జరిగిన వివాహ అనంతరం తిరుగు ప్రయాణంలో ప్రమాదం.
* ఘటనా స్థలానికి చేరుకున్న రాజమండ్రి- అర్భన్ ఎస్పీ షిమోషి బాజ్పాయ్
* సహాయక చర్యలను చేపట్టిన పోలీసులు




