Live Updates: ఈరోజు (ఆగస్ట్-29) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 29 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం, 29 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం ఏకాదశి (ఉ. 9-45 వరకు) తదుపరి ద్వాదశి, పూర్వాషాఢ నక్షత్రం (మ. 3-21 వరకు) తదుపరి ఉత్తరాషాఢ, అమృత ఘడియలు (ఉ. 10-38 నుంచి 12-12 వరకు) వర్జ్యం (రాత్రి 11-24 నుంచి 1-01 వరకు) దుర్ముహూర్తం లేదు రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-౧౫
టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున పుట్టినరోజు నేడు
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 29 Aug 2020 9:40 AM IST
Vijayawada updates: బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
విజయవాడ:
-బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
-ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు
-అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి
-రాష్ట్రం కరోనా బారినుండి త్వరగా కోలుకోవాలని, రాష్ట్రంలోని రైతులు అందరూ సుభిక్షంగా ఉండాలని మంత్రి అమ్మవారిని కోరుకున్నారు.
- 29 Aug 2020 9:36 AM IST
East Godavari updates: జిల్లా అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ లేబర్ ఎస్‌ఎస్‌పీవో కేశవ పాండా సస్పెండ్..
తూర్పుగోదావరి:
-జిల్లా అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ లేబర్ ఎస్‌ఎస్‌పీవో (సోషల్ సెక్యూరిటీ ప్రమోషన్ అధికారి) కేశవ పాండాను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
-గతంలో విశాఖపట్నం జిల్లాలో ఆయన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్‌గా విధులు నిర్వహించిన సమయంలో అవినీతి ఆరోపణలు
-జూన్ 12న బదిలీ పై జిల్లాకు వచ్చారు.
-విచారణలో ఫిర్యాదులు రుజువు కావడంతో సస్పెండ్ చేశారు.
- 29 Aug 2020 9:29 AM IST
East Godavari-Rajahmundry updates: వరద ముంపు ప్రాంతమైన దేవీపట్నంలో ఇంకా 20 గ్రామాలు అంధకారంలోనే....
తూర్పుగోదావరి...రాజమండ్రి:
-వరద ముంపు ప్రాంతమైన దేవీపట్నంలో ఇంకా 20 గ్రామాలు అంధకారంలోనే..
-విద్యుత్ ఇంకా పునరుద్దరణ కాలేదు.
-వెళ్లే దారి లేక విద్యుత్ సరఫరా ఇవ్వలేకపోతున్నారు
-మిగిలిన అన్నిచోట్ల విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.
- 29 Aug 2020 6:47 AM IST
Kadapa District updates: సెప్టెంబరు 1, 2 తేదీలలొ సిఎం వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటన
కడప జిల్లా :
-సెప్టెంబరు 1, 2 తేదీలలొ సిఎం వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటన
-2వతేదీ వైఎస్సాఆర్ వర్ధంతి వేడుకల్లో పాల్గొననున్న సిఎం ...
-వర్దంతి వేడుకల్లొ పాల్గొనేందుకు ఒకరోజు ముందే కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయ రాక ...
- 29 Aug 2020 6:40 AM IST
Srikakulam District updates: నేటి నుంచి పలాస విశాఖపట్నం మధ్య నాన్ స్టాప్ సర్వీసులు పునఃప్రారంభం..
శ్రీకాకుళం జిల్లా..
-నేటి నుంచి పలాస విశాఖపట్నం మధ్య నాన్ స్టాప్ సర్వీసులు పునఃప్రారంభం..
-ఉదయం 6, 8, 10 గంటల సర్వీసులు ప్రారంభం..
-ప్రకటించిన ఆర్టీసీ అధికారులు..
- 29 Aug 2020 6:31 AM IST
Srikakulam District updates: సోంపేట మండలంలో కరోనా తీవ్రత దృష్ట్యా లాక్ డౌన్ విధించిన అధికారులు..
శ్రీకాకుళం జిల్లా..
-సోంపేట మండలంలో కరోనా తీవ్రత దృష్ట్యా లాక్ డౌన్ విధించిన అధికారులు..
-వారం రోజుల పాటు లాక్ డౌన్ నిర్వహించాలని అధికారులకు ఆదేశించిన జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు..
-నిత్య, అత్యవసర దుకాణాలకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే అనుమతి..
- 29 Aug 2020 6:28 AM IST
Srikakulam District upadates: నేటి నుంచి రణస్థలం మండలంలో మరోమారు లాక్ డౌన్..
శ్రీకాకుళం జిల్లా..
-నేటి నుంచి రణస్థలం మండలంలో మరోమారు లాక్ డౌన్..
-కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకున్న అధికారులు..
-సెప్టెంబర్ 7వ తేదీ వరకు మండల పరిధిలో కట్టుదిట్టంగా లాక్ డౌన్ కు నిర్ణయం..
-నిత్యావసర, అత్యవసర దుకాణాలకు మాత్రమే అనుమతి..
-నిర్ణీత సమయంలోనే దుకాణాలు తెరిచేందుకు అనుమతినిచ్చిన అధికారులు..



