Live Updates: ఈరోజు (సెప్టెంబర్-28) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 28 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 28 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | ద్వాదశి: రా.9-38 వరకు తదుపరి త్రయోదశి | ధనిష్ఠ నక్షత్రం రా.12-19 వరకు తదుపరి శతభిషం | వర్జ్యం: లేదు | అమృత ఘడియలు: మ.1-31 నుంచి 3-11 వరకు | దుర్ముహూర్తం: మ.12-15 నుంచి 1-03 వరకు తిరిగి మ.2-39 నుంచి 3-27 వరకు | రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.5-53 | సూర్యాస్తమయం: సా.5-51
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 28 Sept 2020 9:24 AM IST
Khammam district updates: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలీసుల తనిఖీలు..
ఖమ్మం...
-నేడు మావోల బంద్ పిలుపుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలీసుల తనిఖీలు
-15 రోజుల్లో మూడు ఎన్ కౌంటర్లలో ఆరుగురు దళ సభ్యులు మృతి కి నిరసనగా నేడు మావోల బంద్ పిలుపు
-ముందు జాగ్రత్త చర్యగా ఏజెన్సీ ప్రాంతాలకు బస్ సర్వీసులు నిలిపివేసిన అధికారులు
-అటవీ ప్రాంతాల్లో కొనసాగుతున్న పోలీసుల కూంబింగ్
- 28 Sept 2020 9:21 AM IST
Warangal district updates: నేడు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు..
వరంగల్..
-బూటకపు ఎంకౌంటర్ లను వెతిరేకిస్తూ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి జగన్.
-బంద్ నేపథ్యంలో హై అలెర్ట్ ప్రకటించిన పోలీసులు.
-ములుగు జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహబూబాబాద్ జిల్లా ల పోలీసులు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
-చత్తీస్ గర్డ్, మహారాష్ట్ర బార్డర్ లో భద్రతను పెంచిన పోలీసులు.
-ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు.
-నేటితో మావోయిస్టుల వారోత్సవాలు ముగియనుండటంతో ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లు చేసిన పోలీసులు
- 28 Sept 2020 9:18 AM IST
Kamareddy district updates: నిజాం సాగర్ కు జలకళ...
కామారెడ్డి :
-మంజీర ఎగువ ప్రాంతం లో కురుస్తున్న వర్షాలకు భారీగా వస్తున్న వరద.
-7 టి.ఎం.సి.లకు చేరిన నిజాం సాగర్ నీటి మట్టం.
-పూర్తి స్థాయి నీటి మట్టం 17 టి.ఎం.సి.లు
-ఇన్ ఫ్లో. 7878 క్యూసెక్కులు.
-ప్రస్తుత నీటి మట్టం 7.337 టి.ఎం.సి లు
- 28 Sept 2020 9:15 AM IST
Sriram Sagar Project updates: శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద..
నిజామాబాద్ :
-ఇన్ ఫ్లో 148003 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో 179851 క్యూసెక్కులు
-పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు చేరిన జలాశయం
-40 వరద గేట్లు ఎత్తేసిన అధికారులు, వరద గేట్ల ద్వార 160938 క్యూసెక్కుల విడుదల.
-కాలువల ద్వారా కూడా కొనసాగుతున్న ఔట్ ఫ్లో
-జూన్ నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్టులోకి చేరిన 234 టీఎంసీ ల వరద నీరు
-వరద గేట్ల ద్వారా గోదావరి లోకి 127టీఎంసీలు వృధాగా వదిలేసిన అధికారులు
- 28 Sept 2020 9:02 AM IST
Nagarjuna Sagar Dam: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ క్రస్టు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల....
నల్గొండ :
-20 క్రస్టు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల....
-ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో : 4,19,454 క్యూసెక్కులు.
-పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0450 టీఎంసీలు.
-ప్రస్తుత నీటి నిల్వ : 310.252 టీఎంసీలు.
-పూర్తిస్థాయి నీటిమట్టం : 590 అడుగులు.
-ప్రస్తుత నీటిమట్టం : 589.40 అడుగులు
- 28 Sept 2020 8:35 AM IST
Telangana latest news:ఈ రోజు తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్..
తెలంగాణ...
-రెండు రోజుల పాటు నాలుగు సెషన్స్ లో జరగనున్న ఎంట్రన్స్
-మొత్తం 84 సెంటర్ లలో పరీక్ష నిర్వహణ, తెలంగాణ లో 67, ఆంద్రప్రదేశ్ లో 17 ల సెంటర్ ల ఏర్పాటు
-పరీక్ష కు హాజరు కానున్న 78,970 మంది విద్యార్థులు
- 28 Sept 2020 8:20 AM IST
Adilabad district updates: తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన మావోలు..
ఆదిలాబాద్..
-కదంబ ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ రోజు బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ.
-ఈనెల పందోమ్మిదిన న కదబ అడవులలో ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోలను కాల్చి చంపిన పోలిసులు.
-బూటకపు ఎన్ కౌంటర్లకు నిరసనగా బంద్ కు పిలుపునిచ్చిన. మావోలు





