Live Updates: ఈరోజు (సెప్టెంబర్-27) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 27 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు ఆదివారం | 27 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | ఏకాదశి: రా. 9-26 వరకు తదుపరి ద్వాదశి | శ్రవణ నక్షత్రం రా.11-25 వరకు తదుపరి ధనిష్ఠ | వర్జ్యం: తె.వ. 3-34 నుంచి 5-13 వరకు | అమృత ఘడియలు: మ.12-50 నుంచి 2-28 వరకు | దుర్ముహూర్తం: సా.4-16 నుంచి 5-04 వరకు | రాహుకాలం: సా.4-30 నుంచి 6-00 వరకు | సూర్యోదయం: ఉ.5-53 | సూర్యాస్తమయం: సా.5-52
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 27 Sept 2020 10:10 AM IST
Visakha updates: అనకాపల్లిలో సెల్ ఫోన్ వివాదం..
విశాఖ..
- కొణతాల మధు( 35 ) అనే వ్యక్తి ని బ్లేడుతో గొంతు కోసిన లోవరాజు అనే యువకుడు.
-తక్షణం ఆసుపత్రికి తరలించిన స్థానికులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ మధు.
-కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు అనకాపల్లి ఇండోర్ స్టేడియం వద్ద ఘటన.
- 27 Sept 2020 7:57 AM IST
Anantapur district updates: అనంతపురం ఆర్టిఓ సహా రవాణా శాఖ ఉద్యోగి పై క్రిమినల్ కేసు నమోదు...
అనంతపురం:
-అనంతపురం, తాడిపత్రి లో తప్పుడు ధ్రువపత్రాల తో వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కు పాల్పడిన ఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉన్నతాధికారులు.
-ఇంచార్జి ఆర్టీఓ మహబూబ్ బాషా, సీనియర్ అసిస్టెంట్ మాలిక్ బాషా లను సస్పెండ్ చేసిన అధికారులు
-విజయవాడలో ని నిఘా విభాగం ఆధ్వర్యంలో కొనసాగుతున్న కేసు విచారణ
- 27 Sept 2020 7:53 AM IST
Anantapur district updates: పుట్టపర్తిలో సత్యసాయి బాబా మహాసమాధి పునఃదర్శనం ప్రారంభం..
అనంతపురం:
-ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో నేటి నుంచి సత్యసాయి బాబా మహాసమాధి పునఃదర్శనం ప్రారంభం.
-కరోనా నేపథ్యంలో దర్శనానికి వచ్చే భక్తులు సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.
-దర్శన వేళలు ఉదయం 9 గంటల నుంచి 10 వరకు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు.
-సత్య సాయిబాబా మహా సమాధి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసిన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్.
- 27 Sept 2020 7:40 AM IST
Antervedi updates: నేడు అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహాస్వామి వారి కొత్త దివ్యరథం పనులు ప్రారంభం..
తూర్పుగోదావరి..
-ఉదయం 11.25 నిముషాలకు స్వామివారి నూతన రథం నిర్మాణానికి ముహూర్తం
-ఉదయం 10 గంటలకు విష్వక్సేణ ఆరాధన, పుణ్యాహవచనం నిర్వహణ
-అనంతరం దేశ, రాష్ట్ర గ్రామాలు శుభిక్షంగా వుండాలని , స్వామి రథం నిర్మాణం శీఘ్రంగా పూర్తికావాలనే సంకల్పంతో ఆలయంలో శ్రీ సుదర్శన నరసింహా మహాశాంతి హోమం
-ముఖ్యఅతిధులుగా హాజరుకానున్న డిప్యూటీ సిఎ ధర్మాన కృష్ణ దాస్, మంత్రి వేణుగోపాలకృష్ణ
-కొత్త దివ్యరథం పనులు మొదలుపెట్టనున్న గణపతి ఆచారి బృందం
-రథం పనులను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్న కొపనాతి కృష్ణమ్మ వర్గీయులు







