Top
logo

Live Updates: ఈరోజు (సెప్టెంబర్-27) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (సెప్టెంబర్-27) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 27 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం | 27 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | ఏకాదశి: రా. 9-26 వరకు తదుపరి ద్వాదశి | శ్రవణ నక్షత్రం రా.11-25 వరకు తదుపరి ధనిష్ఠ | వర్జ్యం: తె.వ. 3-34 నుంచి 5-13 వరకు | అమృత ఘడియలు: మ.12-50 నుంచి 2-28 వరకు | దుర్ముహూర్తం: సా.4-16 నుంచి 5-04 వరకు | రాహుకాలం: సా.4-30 నుంచి 6-00 వరకు | సూర్యోదయం: ఉ.5-53 | సూర్యాస్తమయం: సా.5-52

ఈరోజు తాజా వార్తలు

Live Updates

 • Prakasam Barrage: ప్రకాశం బ్యారేజి వద్ద పెరుగుతున్న వరద ఉధృతి..
  27 Sep 2020 1:13 PM GMT

  Prakasam Barrage: ప్రకాశం బ్యారేజి వద్ద పెరుగుతున్న వరద ఉధృతి..

  విజయవాడ..

  -సముద్రంలోకి 5,06,604 క్యూసెక్కుల నీటి విడుదల

  -కాలువలకు 5,090 క్యూసెక్కుల విడుదల

  -మొత్తం ఔట్ ఫ్లో/ ఇన్ ఫ్లో 5,11,694 క్యూసెక్కులు

 • Kakinada updates: కార్లపై అప్పులు చేస్తోన్న ఘరానా మోసగాడిని అరెస్ట్ చేసిన సర్పవరం పోలీసులు..
  27 Sep 2020 1:08 PM GMT

  Kakinada updates: కార్లపై అప్పులు చేస్తోన్న ఘరానా మోసగాడిని అరెస్ట్ చేసిన సర్పవరం పోలీసులు..

  తూర్పుగోదావరి :

  - అద్దెకు తీసుకున్న కార్లపై అప్పులు చేస్తోన్న ఘరానా మోసగాడిని అరెస్ట్ చేసిన కాకినాడ రూరల్ సర్పవరం పోలీసులు..

  - నెల వారి అద్దె చెల్లిస్తానని పలువురి దగ్గర కార్లు తీసుకుని తాకట్టు పెట్టిన మండవల్లి నాగ వెంకట సత్యకృష్ణ మోహన్..

  - కారు అసలు ఓనర్లు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన సిఐ గోవిందరాజు..

  - నిందితుడి నుంచి రూ. కోటి 50 లక్షల విలువైన 14 కార్ల ను స్వాధీనం చేసుకొని చీటింగ్ కేసు నమోదు చేసిన సర్పవరం పోలీసులు..

 • Nellore updates: కావలి ప్రగతినగర్ లో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ కలకలం..
  27 Sep 2020 1:05 PM GMT

  Nellore updates: కావలి ప్రగతినగర్ లో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ కలకలం..

  నెల్లూరు..

  -అక్షర (7), నరేష్ (9) అనే చిన్నారులను కిడ్నాప్ చేసిన యువకుడు.

  -చర్చి వద్ద ఆడుకుంటుండగా బైక్లో వచ్చి చిన్నారులను ఎక్కించుకుని వెళ్లిన యువకుడు..

  -పోలీసులను ఆశ్రయించిన పిల్లల కుటుంబ సభ్యులు..

  -చిన్నారుల వద్ద ఉన్న సెల్ ఫోన్ ను తీసుకుని చిన్నారులను జనతాపేట వద్ద వదిలేసి వెళ్లిపోయిన కిడ్నాపర్..

  -సీసీ ఫుటేజీలను పరిశీలించి స్వల్ప వ్యవధిలోనే చిన్నారులను గుర్తించిన పోలీసులు..

  -కిడ్నాపర్ కోసం గాలిస్తున్న పోలీసులు ..

 • Amaravati updates: కృష్ణానది ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో కరకట్ట వెంబడి నివాసాల వారికి నోటిసులిస్తున్న అధికారులు..
  27 Sep 2020 12:59 PM GMT

  Amaravati updates: కృష్ణానది ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో కరకట్ట వెంబడి నివాసాల వారికి నోటిసులిస్తున్న అధికారులు..

  అమరావతి..

  -గతంలో సైతం ఇదే విధంగా నోటీసులిచ్చిన రెవెన్యూశాఖ అధికారులు

  -ఉండవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి సైతం నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన అధికారులు

  -రాత్రికి 6అదనంగా మరో6లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉండటంతో ముందస్తుగా నోటీసులు ఇస్తున్న అధికారులు

 • 27 Sep 2020 6:46 AM GMT

  నరసింహా స్వామి నూతన రధం నిర్మాణ ప‌నులు ప్రారంభం

  తూర్పుగోదావరి:  నరసింహా స్వామి వారికి నూతన రధం నిర్మాణానికి 11గంటల 15 ని,,లకు జిల్లా ఇంచార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు రథం పనులను ప్రారంభించారు.

  కలక్టర్ మురళీ ధర్ రెడ్డి, ఎంపీ అనురాధ, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు పాల్గొన్నారు

 • 27 Sep 2020 6:42 AM GMT

  చేప‌ల చెరువు త‌వ్వ‌కాల‌పై గ్రామ‌స్తుల ఆందోళ‌న‌

   పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం

  కాళ్ళకూరు వెంకటాపురంలో ప్రభుత్వం నూతనంగా ఇచ్చే ఇంటి స్థలాలను ఆనుకొని చేపల చెరువుల తవ్వకాలు

  మార్చి నెలలో నూతన భూసేకరణ చేస్తే ..

  నెల క్రితం చేపల చెరువుల తవ్వకాలకు అనుమతులు ఇచ్చిన కాళ్ల రెవెన్యూ ఫిష్రరిస్ వ్యవసాయ అధికారులు

  ఆందోళనలో నూతనంగా ఇంటి స్థలాలు తీసుకునే లబ్ధిదారులు

  వెంకటాపురం గ్రామస్తులు ఆందోళన చేసిన ఫలితం లేదని గ్రామస్తులు ఆగ్రహం

 • Daggubati Purandeswari: త్వ‌ర‌లోనే బ‌ల‌మైన శ‌క్తిగా ఎదుగుతాం: పురందేశ్వరి
  27 Sep 2020 6:37 AM GMT

  Daggubati Purandeswari: త్వ‌ర‌లోనే బ‌ల‌మైన శ‌క్తిగా ఎదుగుతాం: పురందేశ్వరి

  ప్రకాశం జిల్లా: పురందేశ్వరి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామెంట్స్,

  - బీజేపీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చినందుకు బీజేపీ అధిష్టానానికి దన్య వాధాలు.

  - నాకంటే ప్రతిభావంతులైన వారు బీజేపీలో ఉన్నప్పటికి తనకు ప్రాధాన్యత ఇచ్చి నందున శక్తి వంచన మేరకు దక్షిణ ప్రాంతంలో బీజేపీ అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తాను.

  - పథాదికారులతో సమావేశం అనంతరం రాష్ట్రంలో ఎటువంటి వ్యూహాలపై అదిష్టానం నిర్ణయం తీసుకుంటుందో ఆమేరకు దక్షిణ ప్రాంతంలో అమలు పరుస్తాం.

  - దక్షిణ ప్రాంతంలో ప్రాంతీయ పార్టీలు భలంగా ఉన్నకాలంలో బీజేపీ అధికారం లోకి తేవడం అంత ఆషామాషీ కాదు...కాని ప్రజల పక్షణా నిలిచి ప్రజల్లో నమ్మకాన్ని కల్గిస్తాం.

  - వ్యవసాయ బిల్లులో ఒకటి రెండు అంశాల్లో ఆందోళన ఉన్నప్పటికీ రైతులకు మేలు చేకూరుస్తుంది.

  - ఏపీలోని విషయాలు ఎప్పటికప్పుడు చేర వేయ డంలో ఇకపై చురుకైన పాత్ర పోషిస్తాను.

  - అమరావతి రాజధాని విషయంలో కేంద్రం పాత్ర చాల పరిమితమైనది.

  - రాజధాని విషయం కోర్టు నిర్ణయిస్తుంది. tharwa

  - టీడీపీతౌ పొత్తు ఉంటుందా లేదా అనేది బీజేపీ అధిష్టానం నిర్ణ ఇస్తుంది.

 • Jaswant Singh passed away: కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్‌ సింగ్ మృతి! ‌
  27 Sep 2020 4:52 AM GMT

  Jaswant Singh passed away: కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్‌ సింగ్ మృతి! ‌

  -కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్‌ సింగ్‌ కన్నుమూశారు.

  -వాజ్‌పేయీ హయాంలో ఆయన రక్షణ, ఆర్థిక, విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

  -ఆయన మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.

  -సైనికుడిగా, రాజకీయ నేతగా ఆయన దేశానికి సేవలు అందించారని కొనియాడారు.

  -కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సైతం జశ్వంత్‌ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

 • Kurnool Distrivt updates: కాస్త తెరిపి ఇచ్చిన వర్షాలు..దీంతో తగ్గుముఖం పట్టిన వరద..
  27 Sep 2020 4:45 AM GMT

  Kurnool Distrivt updates: కాస్త తెరిపి ఇచ్చిన వర్షాలు..దీంతో తగ్గుముఖం పట్టిన వరద..

  కర్నూలు జిల్లా..

  -నంద్యాల పట్టణంలో తగ్గిన ఛామకాలువ.పాలేరు.మద్దిలేరు వాగు ల ఉధృతి ..

  -సాయిబాబా నగర్ ,ఎన్జీవో కాలనీ ,స్టేట్ బ్యాంక్ కాలనీ, సలీం నగర్..పద్మావతి నగర్ , లో శాంతించిన వరద నీరు ..

  -హరిజన వాడలో కొనసాగుతున్న మోకాళ్ళ లోతు నీరు...ఎగువ ప్రాంతాల్లో వర్షం తగ్గడమే కారణం..

  -ఊపిరి పీల్చుకున్న అధికారులు, ప్రజలు..

 • Amaravati updates: నేడు టీడీపీ జిల్లా కమిటీల ప్రకటన..
  27 Sep 2020 4:42 AM GMT

  Amaravati updates: నేడు టీడీపీ జిల్లా కమిటీల ప్రకటన..

  అమరావతి..

  -25 పార్లమెంట్ నియోజక వర్గాలకు 25 మంది అధ్యక్షులను నియమించనున్న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు

  -ఉదయం 11:50 గంటలకు కమిటీపై ప్రకటన

  -పార్లమెంట్ ఒక యూనిట్ గా జిల్లా అధ్యక్షుల ఎంపిక

  -మొత్తం వర్చువల్ ద్వారా కమిటీలు ప్రకటించనున్న చంద్రబాబు నాయుడు

Next Story