Top
logo

Live Updates: ఈరోజు (26 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (26 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 26 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 26 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | దశమి ఉ.11-16వరకు తదుపరి ఏకాదశి | ధనిష్ఠ నక్షత్రం ఉ.07-40 వరకు తదుపరి శతభిషం | వర్జ్యం: మ.03-15 నుంచి 04-56 వరకు | అమృత ఘడియలు రా.01-21 నుంచి 02-42 వరకు | దుర్ముహూర్తం: మ.12-10 నుంచి 12-57 వరకు తిరిగి 2:30 నుంచి 03:17 వరకు | రాహుకాలం: ఉ.07-30 నుంచి 09-00 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31

ఈరోజు తాజా వార్తలు

Live Updates

 • Hydarabad Updates: ట్యాంక్ బండ్ పై సందడి వాతావరణం....
  26 Oct 2020 4:26 PM GMT

  Hydarabad Updates: ట్యాంక్ బండ్ పై సందడి వాతావరణం....

  హుస్సేన్ సాగర్... 

  //హుస్సేన్ సాగర్ వద్దకు నిమజ్జనానికి భారీగా చేరుకుంటున్న దుర్గామాత విగ్రహాలు

  //నిమజ్జనానికి ట్యాంక్ బండ్ పై 10 క్రేన్లను ఏర్పాటుచేసిన జిహెచ్ఎంసి

  //నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసుల ఆంక్షలు

  //ఎన్టీఆర్ మార్గ్, సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్డు మీద వచ్చే వాహనాల దారి మళ్లింపు

 • Hyderabad Updates: హైద్రాబాద్ నుంచి సిద్ధిపేట బయలుదేరిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి...
  26 Oct 2020 4:17 PM GMT

  Hyderabad Updates: హైద్రాబాద్ నుంచి సిద్ధిపేట బయలుదేరిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి...

  హైద్రాబాద్... 

  -బీజేపీ అభ్యర్థి రఘనందనరావు బంధువుల ఇంట్లో సోదాలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తోన్న బీజేపీ

  -ఇప్పటికే కరీంనగర్ నుంచి సిద్ధిపేట చేరుకున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

 • 26 Oct 2020 3:51 PM GMT

  Sangareddy Updates: పఠాన్ చెరు మండలం పాటి చౌరస్తా లో విషాదం...

  సంగారెడ్డి..

  * పఠాన్ చెరు మండలం పాటి చౌరస్తా లో హత్య చేసి పక్కన చెట్ల పొదల్లో పడేసిన మృత దేహం..

  * ఘటన స్థలానికి చేరుకున్న BDL భానుర్ పోలీస్ లు.

  * భానుర్ గ్రామానికి చెందిన వికలాంగుడు మంగలి సత్యనారాయణ (40) గా గుర్తించిన పోలీసులు.

  * తన సమక్షంలోనే గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారని చెబుతున్న భార్య మనీల ( 38).

 • Bandi Sanay: రఘునందన్ రావు బంధువుల కుటుంబాలపై దాడి చేయడం తెలంగాణ బీజేపీ తీవ్రంగా కండిస్తుంది...
  26 Oct 2020 3:45 PM GMT

  Bandi Sanay: రఘునందన్ రావు బంధువుల కుటుంబాలపై దాడి చేయడం తెలంగాణ బీజేపీ తీవ్రంగా కండిస్తుంది...

  బండి సంజయ్ .... బిజెపి రాష్ట్ర అధ్యక్షులు

  * అప్రజాస్వామికంగా తెలంగాణ పోలీసులు దుబ్బాక నియోజకవర్గ బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల కుటుంబాలపై దాడి చేసి, సోదాలు చేయడం     తెలంగాణ బీజేపీ తీవ్రంగా కండిస్తుంది.

  * దుబ్బాక శాసనసభ ఎన్నికలు జరుగుతుంటే సిద్దిపేటలో దాడులు,సోదాలు చేయడం ఎన్నికల నియమావాళికి విరుద్ధం.

  * ఈ చర్య తెలంగాణ ప్రభుత్వ పోలీసు యంత్రాంగం యొక్క దుందుడుకు చర్య.

  * దాడి జరిగిన కుటుంబసబ్యులను కలవడానికి సిద్దిపేటకు బయలుదేరిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.

 • 26 Oct 2020 1:39 PM GMT

  Dubbaka Updates: దుబ్బాకలో ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే కేంద్ర బలగాలు దుబ్బాకలో నియమించాలి...

  - Hmtv తో బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు.

  - ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తా.

  - బీజేపీ కార్యకర్తలను తమ అభ్యర్థిని టార్గెట్ చేసి టీఆరెస్ చేసింది.

  - పోలీసులు బీజేపీ అబ్యర్థికి ఇబ్బందులు పెడుతున్నారు.

  - బీజేపీ కార్యకర్తకు దుబ్బాకలో రక్షణ లేదు.

  - బీజేపీ కార్యకర్తను కొట్టిన పోలీసులు రక్షణ కల్పించడం లేదు.

  - రాష్ట్ర పోలీసులు టీఆరెస్ కార్యకర్తల వ్యవహరిస్తున్నారు.

  - రాష్ట్ర పోలీసుల పై ఫిర్యాదు చేస్తా.

  - వరదల నష్టం పై కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బాదునామ్ చేస్తున్నాడు.

  - వరదల్లో నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ తక్షణ సాయం ఎం చేసాడో చెప్పాలి.

  - గ్రేటర్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టే డబ్బుకు పంచుతున్నాడు సీఎం కేసీఆర్.

  - ఎందుకు పంటనష్టపోయిన రైతులకు డబ్బులు ఇవ్వడం లేదు.

  - మొక్కల కొనుగోలు పై సీఎం కేసీఆర్ రాజకీయం చేస్తున్నాడు.

  - ఎగుమతులు , దిగుమతులు దేశం ప్రాతిపదికన జరుగుతాయి తప్ప రాష్ట్రం పై ఆధారంగా ఉండదని సీఎం కేసీఆర్ కు తెలియదా ప్రజలకు చెప్పాలి.

 • D.K.Arunu: దుబ్బాక ఉప ఎన్నికలను కేంద్ర ఎన్నిక‌ల సంఘం జోక్యం చేసుకోవాలన్న డీకే అరుణ...
  26 Oct 2020 12:48 PM GMT

  D.K.Arunu: దుబ్బాక ఉప ఎన్నికలను కేంద్ర ఎన్నిక‌ల సంఘం జోక్యం చేసుకోవాలన్న డీకే అరుణ...

  # డీకే అరుణ...బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు.

  # బీజేపీ అభ్యర్థి రఘనందనరావు బంధువుల ఇళ్ళపై పోలీసుల సోదాలు చేయటాన్ని ఖండిస్తున్నాను

  # సర్వేలు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రావటాన్ని హరీష్ రావు జీర్ణించుకోలేకపోతున్నాడు

  # టీఆర్ఎస్ ను ఓడించి దుబ్బాక ప్రజలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలవనున్నాను

  # వేల కోట్లున్న టీఆర్ఎస్ నాయకులు వదిలి.. బీజేపీ నేతల ఇళ్ళపై పడటం సిగ్గుచేటు

  # దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించే టార్గెట్ ను పోలీసులకు ప్రభుత్వం ఇచ్చింది

  # పోలీసులు గులాబీ చొక్కాలను తీసివేసి ఖాకీ చొక్కాలు వేసుకోవాలి

  # పోస్టింగుల కోసం పోలీసులు టీఆర్ఎస్ కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు

  # తెలంగాణ పోలీసుల తీరును ప్రజలు అసహయించుకుంటున్నారు

  # ఆర్థికమంత్రి హోదాలో హరీష్ రావు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు

  # దుబ్బాక ఓటమితో టీఆర్ఎస్ కు జ్ఞానోదయం కలగాలి

 • Kishan Reddy: డబుల్ బెడ్రూం ఇళ్ళు ఎన్ని ఎక్కువ పంపిణీ చేస్తే.. బీజేపీకి అంత ఎక్కువ లాభం...
  26 Oct 2020 11:45 AM GMT

  Kishan Reddy: డబుల్ బెడ్రూం ఇళ్ళు ఎన్ని ఎక్కువ పంపిణీ చేస్తే.. బీజేపీకి అంత ఎక్కువ లాభం...

  - మీడియాతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చిట్ చాట్

  - ఇళ్ళు వచ్చిన వారి కంటే రాని వారికే ఎక్కువ కడుపు మంట

  - డబుల్ బెడ్రూం ఇళ్ళ అంశం ప్రాతిపదికనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి

  - డబుల్ బెడ్రూం ఇళ్ళు, కరోనా, హైద్రాబాద్ వరదలు.. అన్నిటిల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం

  - దుబ్బాకలో బీజేపీ గెలుస్తోందనటానికి మంత్రి హరీష్ రావు ఫ్రస్టేషనే ఉదాహరణ

  - దుబ్బాకలో నిరుద్యోగులు బీజేపీకి ప్రచారం చేయటాన్ని హరీష్ రావు తట్టుకోలేకపోతున్నాడు

  - జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో కలసి పోటీచేసే అంశంపై పార్టీలో చర్చ జరగలేదు

  - దుబ్బాకలో పవన్ కళ్యాణ్ ప్రచారం‌ చేసే విషయంలో స్పష్టత లేదు

  - CMRFకు విరాళాలవ్వాలని ముఖ్యమంత్రే వ్యాపారవేత్తలకు ఫోన్ చేసి అడుగుతున్నారు

  - విరాళాలు ఇవ్వాలని సినీ నటులను మంత్రి తలసాని‌ అడిగనందునే .. నాయకులు సైతం విరాళాలు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అన్నారు

  - కేంద్రం నుంచి రాష్ట్రనికి త్వరలో విపత్తు నిధులొస్తాయి.

 • Jakkampudi Raja: చంద్రబాబు తన పాలనలో రైతులను ఏనాడూ పట్టించుకోలేదు...
  26 Oct 2020 11:19 AM GMT

  Jakkampudi Raja: చంద్రబాబు తన పాలనలో రైతులను ఏనాడూ పట్టించుకోలేదు...

  తూర్పు గోదావరి -రాజమండ్రి

  రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా..

  -రాజానగరం ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా పిసీ కామెంట్స్

  -రుణమాపీ చేస్తానని హామీ ఇచ్చి అమలు చేయలేదు

  -రైతులకు పెట్టుబడి రాయితీ క్రింద ప్రతి ఏటా రూ. 13వేల 500 సిఎం జగన్ చెల్లిస్తున్నారు

  -రేపు రెండోవిడత రైతు భరోసా మొత్తాలను రైతుల ఖాతాలో వేయనున్న సిఎం జగన్

  -జగన్ ది ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రభుత్వం

  -వరదలు, వర్షాలు వల్ల నష్టపోయిన రైతులందరినీ సిఎం జగన్ ఆదుకుంటారు.

  -చందబాబు నాయుడు బిసీలను ఓటు బ్యాంకులా వాడుకున్నారు

  -కాపు కార్పొరేషన్ ద్వారా చంద్రబాబు 250 కోట్లే 50వేల మంది రుణాలిచ్చారు

  -ఈ నేపధ్యంలో చీడపురుగులంటూ ఎంపీ భరత్ చేసిన ప్రకటన అభ్యంతరకంగా వుంది.

  -తనపై దుష్ప్చచారం చేసేలా ఆ వ్యాఖ్యలు వక్రీకరించినట్టుగా కన్పిస్తున్నాయి.. ఎంపీ యే ఆ పదం వాడారని అనుకోవడం లేదు

  -నేను ఏ విషయంలోనూ అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదు.

  -సిఎం జగన్ ఆదేశాలే మాకు శిరోధార్యం..

  -ఏదైనా తప్పుచేస్తే రాజకీయాలనుంచే తప్పుకుంటాను..

  -గ్రూపు రాజకీయాలు, వర్గపోరు ఏ పార్టీలోనైనా వుంటాయి. తాము పనిచేసేది పార్టీకోసం, జగన్ కోసమే..

  -మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ నియోజకవర్గానికి గెస్ట్ గా వస్తున్నారు

  -తెలుగుదేశం పాలనలో ఇసుకలో వందల కోట్లను నిలువునా పెందుర్తి దోచుకున్నారు

  -తానేదో రోడ్డుఎక్కితే రోడ్డు పోస్తున్నారనే బిల్డప్ కోసమే వెంకటేస్ పాదయాత్ర చేశారు

 • Chada Venkat Reddy: అకాల వర్షాల కారణంగా నగరాలు కాలనీలో ముంపునకు గురయ్యాయి...
  26 Oct 2020 11:14 AM GMT

  Chada Venkat Reddy: అకాల వర్షాల కారణంగా నగరాలు కాలనీలో ముంపునకు గురయ్యాయి...

  -చాడ వెంకటరెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి...

  -గత 15 రోజులుగా అకాల వర్షాల కారణంగా నగరాలు కాలనీలో ముంపునకు గురయ్యాయి...

  -మరోవైపున చెరువులు కుంటలు నాలాలు ఆక్రమణకు గురికావడంతో పలు కాలనీలు నీటమునిగాయి...

  -నిరుపేదలు పూర్తిగా నష్టపోయారు. కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయం అందించకపోవడం అన్యాయం..

  -రైతులు వారికి నచ్చిన, మేలైన పంటలు వేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ సాగు విధానం తీసుకొచ్చింది...

  -దీంతో ప్రభుత్వం సూచించిన కొన్ని పంటలను రైతులు తమ భూమిలో వేసుకోవడానికి సూచనలు చేశాయి..

  -ప్రభుత్వం సూచించిన విధంగా కామారెడ్డి జిల్లా, లింగాపూర్ అనే గ్రామంలో ఒక పేద రైతు మూడు ఎకరాలు సన్నబియ్యం వరి సాగు చేశాడు...

  -ఆ పంట దోమపోటు కు గురి కావడంతో మొత్తం పంటను దగ్ధం చేయడం జరిగింది...

  -నిజామాబాద్, జగిత్యాల జిల్లాలలో రైతులు ఆందోళన చేసి మొక్కజొన్న వేశారు....

  -మొక్కజొన్న పంటకు 1800 రూపాయలు మద్దతు ధర ఇస్తున్నట్లు ప్రకటించడం స్వాగతిస్తున్నాం..

  -ప్రభుత్వము సూచించిన పంట, తమ భూమికి అనువైన పంట వేయడంలో రైతులు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా గా దిక్కుతోచని స్థితిలో కి నెట్టబడ్డారు..

  -అకాల వర్షాల కారణంగా వల్ల నష్టపోయిన వరి, పత్తి ఇతర పంటలకు సమగ్ర సర్వే చేసి నష్టపరిహారం రైతులకు అందించాలని సిపిఐ డిమాండ్

  -బిజెపి నేతలు నష్టాలపై వాక్యాలు చేస్తున్నట్లు గానే చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి కనీసం పది వేల రూపాయల కోట్ల సహాయం అందించేందుకు కృషిచేయాలని సిపిఐ విజ్ఞప్తి...

 • Nalgonda District Updates: కరోనా మహమ్మారి వలన ఉపాధి కోల్పోయిన ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి...
  26 Oct 2020 11:01 AM GMT

  Nalgonda District Updates: కరోనా మహమ్మారి వలన ఉపాధి కోల్పోయిన ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి...

  నల్గొండ.....

  కంకణాల శ్రీధర్ రెడ్డి.. 

  -కరోనా మహమ్మారి వలన ఉపాధి కోల్పోయిన ప్రైవేటు స్కూల్ ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం

  -ఆర్ధిక ప్యాకేజి ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ, వారికి మద్దతుగా బీజేపీ

  -నల్గొండ కార్యాలయంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి ఒక రోజు నిరాహారదీక్ష....

Next Story