Live Updates: ఈరోజు (26 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 26 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 26 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | దశమి ఉ.11-16వరకు తదుపరి ఏకాదశి | ధనిష్ఠ నక్షత్రం ఉ.07-40 వరకు తదుపరి శతభిషం | వర్జ్యం: మ.03-15 నుంచి 04-56 వరకు | అమృత ఘడియలు రా.01-21 నుంచి 02-42 వరకు | దుర్ముహూర్తం: మ.12-10 నుంచి 12-57 వరకు తిరిగి 2:30 నుంచి 03:17 వరకు | రాహుకాలం: ఉ.07-30 నుంచి 09-00 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 26 Oct 2020 6:39 PM IST
Merugu Nagarjuna: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పారిశ్రామిక విధానం ప్రారంభించడం ఆనందదాయకం...
అమరావతి....
- మేరుగ నాగార్జున, ....వైసీపీ ఎమ్మెల్యే
- రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పారిశ్రామిక విధానం ప్రారంభించడం ఆనందదాయకం
- ఈ అవకాశాన్ని దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను అని సీఎం ని ఈ దేశంలో ఎప్పుడన్నా చూసామా
- ఈ రోజు మేము ధైర్యంగా ప్రరిశ్రమల స్థాపనలో ముందుకువెళతారు
- స్కిల్ డెవలెప్మెంట్ తో ఎన్నో సౌకర్యాలు దీనిలో ఉన్నాయి
- మొత్తం రాయతీలతో, ఇండస్ట్రియల్ పార్క్ లో మాకు ప్రత్యేక కేటాయింపులు చేయడం శుభపరిణామం
- అందుకే మేమంతా ముఖ్యమంత్రిని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నాం
- కోవిడ్ సమయంలో 270 కోట్ల రూపాయలు దళిత పారిశ్రామికవేత్తలకు మేలు జరిగింది
- సాయం చేయడం చేతకాని వారు సంక్షేమ పథకాలు దళితులకు అందకుండా చేయాలని కుట్ర చేస్తున్నారు
- 26 Oct 2020 6:25 PM IST
Amaravati Updates: అధికారులతో సీఎం వైయస్.జగన్ సమీక్ష...
అమరావతి...
* కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం, కొప్పర్తి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌పై అధికారులతో సీఎం వైయస్.జగన్ సమీక్ష
* క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఇండస్ట్రియల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, ఇతర ఉన్నతాధికారులు.
- 26 Oct 2020 5:59 PM IST
East Godavari Updates: భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తోట త్రిమూర్తులు...
తూర్ప గోదావరి జిల్లా....
మండపేట....
-- మండపేటలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మండపేట వైసీపీ ఇన్చార్జ్ తోట త్రిమూర్తులు
-- మండపేటలోని విజయలక్ష్మి నగర్ లో మెయిన్ రోడ్డు అనుకునే మండపేట నియోజకవర్గ వైసీపీ కార్యాలయం నిర్మాణం
- 26 Oct 2020 5:31 PM IST
Thammineni Seetharam Comments: ఎవరు ఏంటో ప్రజలే నిర్ణయిస్తారు..
శ్రీకాకుళం జిల్లా..
- స్పీకర్ తమ్మినేని సీతారాం కామెంట్స్..
- బిసి కార్పొరేషన్ పదవులు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావనేది తెలుగుదేశం పార్టీ అభిప్రాయం..
- అందుకే టిడిపి హయాంలో బిసిలకు అవకాశం కల్పించలేదు..
- మా ప్రభుత్వానికి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి..
- అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలని ముఖ్యమంత్రి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు..
- ప్రతీ రాజకీయ పార్టీకి ఎన్నికలే గీటురాయి..
- మేము దౌర్జన్యాలు చేస్తున్నాం అని చెప్పుకుని టిడిపి ఎన్నికల్లోకి వెళ్ళాలి..
- మేము అభివృద్ధి, సంక్షేమం చేస్తున్నాం అని ప్రజల్లోకి వెళతాం..
- మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి పాజిటివ్ దృక్పథంతో ప్రజలకు పాలన అందిస్తున్నారు..
- 26 Oct 2020 5:26 PM IST
Seediri Appalaraju Comments: క్యాబినెట్ కూర్పులో జగన్ బిసిలకు ప్రాధాన్యత ఇచ్చారు..
శ్రీకాకుళం జిల్లా..
మంత్రి అప్పలరాజు కామెంట్స్..
-బిసి కార్పొరేషన్ ల ద్వారా వెనుకబడిన తరగతుల వారికి రాజ్యాధికారం కల్పించాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచన..
-బిసిలకు ఇచ్చిన కార్పొరేషన్ పదవులు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావు అని అచ్చెన్నాయుడు మాట్లాడడం హాస్యాస్పదం..
-తనను రాష్ట్ర అధ్యక్షుడు చేయడంతోనే తెలుగుదేశం బిసిలకు పెద్దపీట వేసిందని అచ్చెన్నాయుడు చెబుతున్నారు..
-గతంలో ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు బిసి కాదా ?
-బిసి, ఎస్సి, ఎస్టీ లకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని చట్టం చేసిన ఘనత జగన్ ది..
-ఏ రకంగా టిడిపి బిసిల పార్టీ అనేది అచ్చెన్నాయుడు సెలవివ్వాలి..
- 26 Oct 2020 5:21 PM IST
Ananthapur Updates: కొడికొండ వద్ద వాహనాల తనిఖీల్లో పోలీసుల చేతి వాటం..
అనంతపురం :
- వ్యాపారి వద్ద బిల్లులు లేకపోవడంతో మద్యం బాటిళ్లు పగులకొట్టి రెండు బిస్కెట్లు తీసుకుని వదిలేసిన కానిస్టేబుళ్లు
- ప్రొద్దుటూరుకు చెందిన వ్యాపారి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన భాగోతం
- ఒక ఎక్సైజ్, ఒక సివిల్ కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్న చిలమత్తూరు పోలీసులు.
- 26 Oct 2020 5:06 PM IST
West Godavari Updates: లోకేష్ పర్యటన అపశృతి...
పశ్చిమగోదావరి జిల్లా
- సిద్దాపురం ఈ పర్యటనలో అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయిన ట్రాక్టర్
- స్వయంగా ట్రాక్టర్ నడుపుతున్న నారా లోకేష్
- పార్టీ నేతలు ఎలర్ట్ అవడంతో తప్పిన ప్రమాదం
- 26 Oct 2020 4:20 PM IST
Kishan Reddy: చైనా సరిహద్దులో బీజేపీ పాగా...
కిషన్ రెడ్డి.. కేంద్ర మంత్రి.
# లద్దాక్ అటాన్మెస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ముందజ
# మెత్తం 26సీట్లకు ఎన్నికలు
# ఫలితాలు వెలువడిన స్థానాలు 14
# ఆధిక్యతలో బీజేపీ
# 10స్థానాలు గెలుచుకున్న బీజేపీ
# రెండు కాంగ్రెస్, రెండు స్థానాలు గెలుచకున్న ఇండిపెండెంట్లు
# ఎన్నికల ఇంఛార్జ్ గా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
- 26 Oct 2020 4:15 PM IST
Vizianagaram Updates: పార్వతీపురం ఐటిడిఎ వద్ద గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా...
విజయనగరం :
* పార్వతీపురం మండలం సంగంవలస, రావికోన గ్రామాలలో ఎక్సైజ్ అధికారులు మహిళలపట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని గిరిజనుల ఆందోళన
* పోలీసులను నిలదీస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపణ
* ఐటిడిఎ పీవో కి వినతిపత్రం ఇచ్చిన గిరిజనులు
- 26 Oct 2020 4:12 PM IST
Vizianagaram Updates: ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరిశీలించిన మంత్రి బొత్స సత్యనారాయణ...
విజయనగరం :
-ఎమ్ ఆర్ కాలేజీ లో ఇంటర్ విద్య ని మూసివేస్తామని ప్రభుత్వానికి తెలియజేశారు
-ఎమ్ ఆర్ కాలేజి లోని ఇంటర్ విద్యార్దులను ప్రభుత్వ జూనియర్ కళాశాల లో అడ్మిషన్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం
-మాన్సాస్ లో జరుగుతున్న వివాదాలు కుటుంబ తగాదాలు
-మాన్సాస్ లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదు
-ఆస్తులు అన్యాక్రాంతం జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది













